
నేడు(బుధవారం, ఫిబ్రవరి 19) మరాఠా సామ్రాజ్య వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి. 1630, ఫిబ్రవరి 19న శివాజీ జన్మించారు. మొఘలుల బారి నుండి భారతదేశాన్ని కాపాడటంలో శివాజీ మహరాజ్ విజయాన్ని సాధించారు. ఆయన ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచారు. ఆనాడు శివాజీ మహారాజ్ చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటలు నేటికీ అందరికీ ఉపయుక్తమవుతున్నాయి.
1. చిన్న లక్ష్యంతో మొదలుపెట్టి..
ఛత్రపతి శివాజీ మహారాజ్ తెలిపినదాని ప్రకారం ఒక చిన్న లక్ష్యం దిశగా వేసే ప్రతి అడుగు.. ఆ తరువాత పెద్ద లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. దీని అర్థం పెద్ద లక్ష్యాలను సాధించే ముందు చిన్న లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించాలి.
2. శత్రువు బలహీనుడే..
ఎవరైనా సరే శత్రువును బలహీనుడిగా పరిగణించాలని, అందుకు విరుద్దంగా చాలా బలవంతుడిగా భావించి, భయాందోళనలకు లోనుకావద్దని చెప్పేవారు. ఎవరికైనా జీవితంలో కఠినమైన సవాలు ఎదురైనప్పుడు, అది వారిపై ఆధిపత్యం చెలాయించేలా చేసుకోకూడదన్నారు.
3. అంకితభావంతో..
కాలచక్రంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు కూడా మనిషి అంకితభావంతో పనిచేయాలని, అప్పుడు కాలమే అతనికి అనుగుణంగా మారుతుందని ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పేవారు. ఎవరైనాసరే లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడి పనిచేయాలన్నారు.
4. పరిణామాల గురించి..
ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ముందుగా దాని పరిణామాల గురించి ఆలోచించాలని శివాజీ సూచించేవారు. ఇలా చేయడం ఎంతో ప్రయోజనకరమని, అప్పుడే భవిష్యత్ తరాలు కూడా మనల్ని అనుసరిస్తాయనేవారు.
5. పర్వతారోహణ కూడా చిన్నదే..
ధైర్యసాహసాలకు ప్రసిద్ధి చెందిన మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ ఒకసారి మాట్లాడుతూ.. లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పుడు పర్వతారోహణ కూడా చిన్నదిగా కనిపిస్తుందని అన్నారు. అంటే ఎవరైనా సరే లక్ష్యాలను సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగితే, అత్యంత క్లిష్ట పరిస్థితులు కూడా తేలికగా అనిపిస్తాయి.
6. గెలవడమే లక్ష్యం
ఎవరికైనా గెలవడమే లక్ష్యం అయినప్పుడు, దానిని సాధించేందుకు ఎంతటి కష్టానికైనా సిద్ధపడాల్సిందేనని ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పేవారు.
ఇది కూడా చదవండి: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?.. భగవంత్ మాన్ క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment