role model for all
-
'హెల్త్‌కేర్ మహిళలలో కనిపించని రోల్‌మోడల్..' ఫ్రంట్లైన్కే పరిమితమా?
'హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో మహిళలు తక్కువ ఆదాయాలను పొందే ఫ్రంట్‌లైన్ పాత్రలలోనే కనిపిస్తున్నారు అని దస్రా ఆర్గనైజేషన్ ఒక డేటా విడుదల చేసింది. మహిళలు వైద్యవిద్యలలో 29 శాతం ఉంటే, నర్సింగ్ సిబ్బందిలో 80 శాతం ఉన్నారు. ఇక 100 శాతం ఆశావర్కర్లుగా ఉన్నారు.ఆరోగ్య సంరక్షణలో నాయకత్వ స్థానాల్లో కేవలం 18 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ రంగంలో పురుషుల కంటే 34 శాతం స్త్రీలు తక్కువ సంపాదిస్తున్నారు.' లాభాపేక్ష లేకుండా, అన్ని రంగాలలో సామాజిక మార్పునకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ దస్రా. ఈ సంస్థ హెల్త్ కేర్ రంగంపై దృష్టి పెట్టి, ఓ నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో పొందుపర్చిన విషయాలలో ముఖ్యంగా గమనించాల్సింది మహిళలకు రోల్‌మోడల్స్ లేకపోవడం, వారి పనిని తక్కువ అంచనా వేయడం, అంతర్గత పక్షపాతాలు, లింగ సమానత్వం గురించి సరైన అవగాహన లేకపోవడం అని పేర్కొంది. ఫ్రంట్‌లైన్ పాత్రలలోనే.. భారతదేశంలో ప్రధానమైన హెల్త్‌కేర్ రంగం కొన్ని సంవత్సరాలుగా సాంకేతికత, నైపుణ్యాలు, విద్య, వృత్తిపరంగా గణనీయమైన అభివృద్ధి, విస్తరణను చవిచూసింది. అయినప్పటికీ ఆరోగ్య సంరక్షణ రంగంలో మహిళలు తక్కువ ఆదాయాలను పొందే ఫ్రంట్‌లైన్ పాత్రలలో కనిపిస్తున్నారని దస్రా నివేదిక సూచిస్తుంది. దస్రా డైరెక్టర్ శైలజా మెహతా మాట్లాడుతూ ‘ఆరోగ్య సంరక్షణరంగంలో మహిళల నాయకత్వంలో మార్పు తీసుకురావడం చాలా అవసరం. ఎందుకంటే, ఇతర రంగాలను కూడా హెల్త్‌కేర్ ప్రభావితం చేయడమే కారణం. లింగ సమానత్వం విషయంలో మా పనిలో మేం మహిళల పురోగతికి సంబంధించిన గ్యాప్‌పై దృష్టి పెట్టాలనుకున్నాం’ అని తెలిపారు. అతి తక్కువ శాతం! నివేదిక ఫలితాల ప్రకారం మొత్తం హెల్త్‌కేర్ వర్క్ ఫోర్స్‌లో 54 శాతం ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ సెక్టార్లో మహిళలు దాదాపు 25 నుంచి 30 శాతం నాయకత్వ స్థానాలను ఆక్రమించారు. ఫార్మాస్యూటికల్, బయోటెక్ రంగాలలో 5 నుంచి 10 శాతం మాత్రమే నాయకత్వపాత్రల్లో మహిళలు ఉన్నారు. మార్కెటింగ్ కార్యకలాపాల స్థానాల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ప్రవేశ స్థాయి స్థానాల్లో మహిళలు 40 నుంచి 50 శాతం ఉండగా, సీనియర్ పాత్రలలో ఈ శాతం గణనీయంగా 15 నుంచి 20 శాతానికి పడిపోయింది. పరిమిత ప్రాధాన్యం.. మహిళలు ఆర్ అండ్ డి, నర్సింగ్, హెచ్ఆర్, పరిపాలన, నాణ్యత హామీ, చట్టపరమైన, నియంత్రణ వ్యవహారాలు వంటి విధుల్లో బాగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవి పరిమిత ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ హెచ్ఆర్ పాత్రల కోసం మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. దీని ఫలితంగా గణనీయంగా 70–80 శాతం ప్రాతినిధ్యం ఉంది. ఇదే నాయకత్వ స్థానాల్లో 20 నుంచి 30 శాతానికి పడిపోతుంది. నివేదిక ఫలితాలు, రోగుల సేవా బృందాలు, ఎఫ్ అండ్ బి మొదలైన వాటిలో ఇదే విధమైన నమూనాను గమనించాయి. ప్రవేశ స్థాయులలో 40 నుంచి 60 శాతం మహిళలను ప్రాధాన్యంగా నియమించుకుంటారు. అయితే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ స్థాయులకు వారి పురోగతి పరిమితంగా ఉంది. ఇది 15 నుంచి 20 శాతానికి మాత్రమే చేరుకుంది. రోల్ మోడల్స్ లేకపోవడమే.. లీడర్షిప్ క్వాలిటీ పెంపొందించుకోవడానికి మహిళలకు ప్రధాన అవరోధం రోల్ మోడల్స్ లేకపోవడమే. మహిళల పనిని తక్కువ అంచనా వేయడం, అంతర్గత పక్షపాతాలు, లింగ సమానత్వం, వైవిధ్యం గురించి నమ్మదగిన సాంస్కృతిక కథనం లేకపోవడం అని నివేదిక హైలైట్ చేసింది. శైలజా మెహతా మరిన్ని వివరాలు చెబుతూ ‘అడ్డంకులు చాలా రెట్లు ఉన్నాయి. మహిళలు నిజంగా ప్రభావవంతంగా ఉన్నారా.. మంచి నాయకులు కాదా... అని ప్రశ్నించే మూస పద్ధతి కూడా ఒక కారణంగా ఉంది. మహిళల నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రతికూల పక్షపాతాలు, నిబంధనలు, ప్రవర్తనలు, ఊహాజనితాలు ఎన్నో ఉన్నాయి. వీటిని వదులుకోవడం అంత సులభం కాదు. సంస్థలు మెరుగైన వ్యాపారం కోసం ఆలోచిస్తాయే తప్ప మహిళా ఉన్నతిని పెద్దగా పట్టించుకోవు. హెల్త్‌కేర్ రంగంలో మహిళలు లీడర్షిప్ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. భారతదేశంలో చాలా మంది మహిళలకు వారి ఆకాంక్షలకు కఠినమైన అడ్డంకులు ఉంటాయి. మహిళల లక్ష్యం నర్సు కావడమే అన్నట్టుగా ఉంటుంది. మేనేజర్‌గా లేదా సీఇవోగా ఉండటానికి వారికి అవకాశం ఇవ్వరు. ‘మహిళలు తమ పరిమితులను దాటి, విస్తరించాలి. అడ్డుగోడలను, నిబంధనలను తొలగించుకుంటూ తమను తాము ప్రోత్సహించుకుంటూ ముందడుగు వేయాలి. అప్పుడే భవిష్యత్తు తరాలకు రోల్‌మోడల్స్‌గా నిలుస్తారు’ అని చెబుతున్న దస్రా నివేదిక మనందరినీ ఆలోచింపజేస్తుంది. ఇవి చదవండి: కుమారులకి వంట నేర్పిస్తే.. ఏం జరుగుతుందో ఈ అమ్మ చూపించింది! -
కర్ణాటక మోడల్...ఇక దేశమంతటా!
మైసూరు: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక ప్రజలకిచ్చిన కీలక ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పుడిక దేశమంతటా కర్ణాటక మోడల్‌నే అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 1.1 కోట్ల మహిళలకు నెలకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందించే ఎన్నికల వాగ్దానమైన గృహ లక్ష్మి పథకం అమలుకు సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా బుధవారం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా మైసూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. తామెప్పుడూ తప్పుడు వాగ్దానాలు చేయబోమని చెప్పారు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం చేసిన, చేస్తున్న మంచి పనులను దేశమంతటా విస్తరించి చూపిస్తామన్నారు. ప్రభుత్వాలు పేదల కోసమే పాటుపడాలన్నది కాంగ్రెస్ విధానమని చెప్పారు. ‘వేర్లు గట్టిగా ఉంటేనే చెట్టు దృఢంగా ఉంటుంది. కన్నడ మహిళలు వేర్ల వంటివారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం మహిళలను నిర్లక్ష్యం చేస్తూ అపర కుబేరులను మాత్రమే నెత్తిన పెట్టుకుంటోంది‘ అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు సభలో పాల్గొన్నారు. గత మే లో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం తెలిసిందే. అందుకు దోహద పడ్డ ఐదు ప్రధాన వాగ్దానాల్లో గృహ లక్ష్మి పథకం ఒకటి. చైనా మ్యాప్ తీవ్రమైన అంశం న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌ను తమ అంతర్భాగంగా చూపుతూ చైనా తయారుచేసిన మ్యాప్ చాలా తీవ్రమైన అంశమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ నేను ఇప్పుడే లద్దాఖ్ నుంచి తిరిగి వచ్చాను. అక్కడ అంగుళం నెల కూడా అన్యాక్రాంతం కాలేదన్న మోదీ మాటలు పచ్చి అబద్ధాలు. చైనా మన భూమిని ఆక్రమించిందని లద్దాఖ్‌లో ప్రతి ఒక్కరికీ తెలుసు‘ అన్నారు. -
మహాత్ముడిని ఆదర్శంగా తీసుకోవాలి
అలంపూర్ : మహాత్మ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఎంఈఓ అశోక్ కుమార్ అన్నారు. నియోజకవర్గంలో గాంధీ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అలంపూర్ మండలంలోని లింగనవాయి గ్రామంలో మహ్మతుని జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మాజీ సర్పంచ్‌లను సర్పంచ్ వెంకటమ్మ, ఎంఈఓ అశోక్‌కుమార్‌లు సన్మానించారు. భీమవరం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేడుకులు జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ నాగేశ్వరమ్మ, ఎంపీటీసీ గోపాల్‌రెడ్డిలు మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం ఉద్యమంలో మహాత్ముని త్యాగాలను కొనియాడారు. భైరాపురం గ్రామంలో సర్పంచ్ మౌనిక రమణ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అలంపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్ముని జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీటీసీ సదానందమూర్తి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రుక్ముద్దిన్, రామకృష్ణ, ఇంతియాజ్ అలీ, ఖాసీమ్ మియ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
మహాత్ముడిని ఆదర్శంగా తీసుకోవాలి
అలంపూర్ : మహాత్మ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఎంఈఓ అశోక్ కుమార్ అన్నారు. నియోజకవర్గంలో గాంధీ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అలంపూర్ మండలంలోని లింగనవాయి గ్రామంలో మహ్మతుని జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మాజీ సర్పంచ్‌లను సర్పంచ్ వెంకటమ్మ, ఎంఈఓ అశోక్‌కుమార్‌లు సన్మానించారు. భీమవరం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేడుకులు జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ నాగేశ్వరమ్మ, ఎంపీటీసీ గోపాల్‌రెడ్డిలు మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం ఉద్యమంలో మహాత్ముని త్యాగాలను కొనియాడారు. భైరాపురం గ్రామంలో సర్పంచ్ మౌనిక రమణ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అలంపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్ముని జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీటీసీ సదానందమూర్తి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రుక్ముద్దిన్, రామకృష్ణ, ఇంతియాజ్ అలీ, ఖాసీమ్ మియ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.