మహాత్ముడిని ఆదర్శంగా తీసుకోవాలి | ghandhiji role model for all | Sakshi
Sakshi News home page

మహాత్ముడిని ఆదర్శంగా తీసుకోవాలి

Published Mon, Oct 3 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

ghandhiji role model for all

 
అలంపూర్‌ : మహాత్మ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఎంఈఓ అశోక్‌ కుమార్‌ అన్నారు. నియోజకవర్గంలో గాంధీ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అలంపూర్‌ మండలంలోని లింగనవాయి గ్రామంలో మహ్మతుని జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మాజీ సర్పంచ్‌లను సర్పంచ్‌ వెంకటమ్మ, ఎంఈఓ అశోక్‌కుమార్‌లు సన్మానించారు. భీమవరం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేడుకులు జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్‌ నాగేశ్వరమ్మ, ఎంపీటీసీ గోపాల్‌రెడ్డిలు మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం ఉద్యమంలో మహాత్ముని త్యాగాలను కొనియాడారు. భైరాపురం గ్రామంలో సర్పంచ్‌ మౌనిక రమణ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అలంపూర్‌ పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మహాత్ముని జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీటీసీ సదానందమూర్తి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు రుక్ముద్దిన్, రామకృష్ణ, ఇంతియాజ్‌ అలీ, ఖాసీమ్‌ మియ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement