p.sudarshan reddy
-
సార్లు మెచ్చేనా?
నిజామాబాద్ అర్బన్ : జిల్లాలోని వైద్య కళాశాలకు మంగళవారం ఎంసీఐ బృందం రానుంది. మూడో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి కోసం కళాశాలను పరి శీలించనుంది. ఈ బృందం ఆదివారమే రావాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో ఇతర కళాశాలల పరిశీలన వల్ల పర్యటన మంగళవారానికి వాయిదా పడింది. ఈ విషయమై మెడికల్ కళాశాల అధికారులు కలెక్టర్‌ను కలిసి సమాచారం అందించారు. అనుమతిపై ఉత్కంఠ మెడికల్ కళాశాలకు ఎంసీఐ బృందం రాక నేపథ్యంలో అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. కళాశాలలో మూడో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి లభిస్తుందా అన్న విషయమై ఆందోళన కొనసాగుతోంది. గతంలో మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతికోసం ఎంసీఐ బృందం పరి శీలనకు వచ్చింది. మూడుసార్లు పరిశీలించి వెళ్లినా.. తరగతుల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు ఫలించి కళాశాలలో మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి లభించింది. రెండో సంవత్సరంలోనూ అదే పరిస్థితి కొనసాగింది. ఇద్దరు సభ్యుల ఎంసీఐ బృందం రెండుసార్లు కళాశాలకు వచ్చి వసతులను పరిశీలించింది. అయినా సంతృప్తి వ్యక్తం చేయలేదు. మూడోసారి పరిశీలన అనంతరం రెండో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కళాశాలలో వంద సీట్లున్నాయి. మూడో సంవత్సరం తరగతుల అనుమతికోసం కళాశాలను పరిశీలించడానికి ఎంసీఐ బృందం మంగళవారం జిల్లాకు వస్తోంది. దీంతో ఎంసీఐ బృందం ఎలా స్పందిస్తుందోనని అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎంసీఐ బృందం కళాశాలను సందర్శించినప్పుడు కళాశాలకు ఆసుపత్రిని అనుసంధానం చేయాలని, ప్రొఫెసర్ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని, పారామెడికల్ సిబ్బంది, పరిపాలన సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలని, సరిపోయేంత స్థలం, ఆటస్థలం కేటాయించాలని, ఆధునిక లైబ్రరీ ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే ఇవేవీ నేటికీ పూర్తికాలేదు. మరోవైపు ప్రొఫెసర్లను నియమించినా వారు ఆసుపత్రికి రావడం లేదు. తరచుగా 40 నుంచి 50 మంది ప్రొఫెసర్లు విధులకు గైర్హాజరవుతున్నారు. ఈ అంశం కూడా కళాశాలలో మూడో సంవత్సరం తరగతుల నిర్వహణకు అనుమతిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎంసీఐ బృందం ఎలా స్పందిస్తుంది అన్న విషయమై అందరిలో ఆసక్తి నెలకొంది. -
పొత్తు కాదు..ముప్పు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కమలం, సైకిల్ పొత్తు వికసించనుందా? టీడీపీ-బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా? అంటే.. ఇప్పుడవుననే అంటున్నా రు ఆ పార్టీలకు చెందిన నేతలు. కొంత వర కు పొత్తులపై ఇరుపార్టీల తెలంగాణ నా యకత్వం విముఖత వ్యక్తం చేసినా.. చివర కు ఆ రెండు పార్టీల అధిష్టానాలు ‘పొత్తు లు ఖాయం’ అన్న సంకేతాలు ఇచ్చాయి. తాజాగా శుక్రవారం బీజేపీ అగ్రనేత ప్రకా శ్ జవదేకర్ ‘ఇక కలిసి సాగాల్సిందే’ నం టూ నేతలకు సూచించారు. ఈ నేపథ్యం లో ‘ఒక వేళ అదే జరిగితే మన పరిస్థితేమిటి?’ అన్నది ఆ రెండు పార్టీల్లోని ఆశావహులు, నేతల్లో సందేహం నెలకొంది. టీడీపీ, బీజేపీ సిట్టింగ్ స్థానాలు తారుమారవుతాయేమోనన్న టెన్షన్ వారికి మొదలైంది. పొత్తులు ఖాయమైతే రెండు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఎలా సాగిపోవడమనేది చర్చనీయాంశంగా మారింది. కాగా తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు జిల్లా కంచుకోటగా ఉండేది. ఆ పరిస్థితి ఇప్పుడు తలకిందులై... సైకిల్ పంక్చర్ అయ్యింది. తెలంగాణ ఉద్యమం, మారిన రాజకీయ పరిస్థితులు.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, ఇవన్నీ టీడీపీ నీరుగారడానికి కారణాలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నినాదంతో సమర్థవంతంగా బీజేపీతో కలిసి నడవాలని ఆరాటపడుతున్నా.. ఎ వరికీ, ఏ మేరకు లాభిస్తుందనేది వేచి చూడాల్సిందే. జిల్లాలో ఒకప్పుడు టీ డీపీకి బలంగా ఉన్న కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బా న్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి కారెక్కేశారు. అదేబాటలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే టీఆర్ఎస్లో చేరారు. ఇక టీడీపీలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, ఆర్మూర్ ఎమ్మెల్యే అన్న పూర్ణమ్మ మిగిలారు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి కూడా బీజేపీకి చెందిన కేశ్‌పల్లి ఆ నందరెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, ఆలూరి గంగారెడ్డిలు టిక్కెట్లు ఆశిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి ఆర్మూరు ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కుమారుడు డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి టీడీపీ ఇన్చార్జిగా ఉ న్నారు. దాదాపుగా అక్కడ ఆయన అభ్యర్థేనని కూడ తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుం చో ఆశలు పెట్టుకున్న బీజేపీ నేతలు పెద్దోళ్ల గంగారెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్ టికెట్ వదులుకునే పరిస్థితుల్లో లేరు. బాల్కొండ నుంచి తెలంగాణ జాగృతిలో జిల్లా కన్వీనర్‌గా పని చేసి రాజీనామా చేసిన సునీల్‌రెడ్డి కూడ బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసి రాజీనామా చేసి న నిట్టు వేణుగోపాల్‌రావు ఇటీవలే కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. బీజేపీ నుం చి ఆయన టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని..కేడర్ నంతా కారెక్కించేశారు. దీంతో టీడీపీకి దిక్కై న యూసుఫ్‌అలీ,పున్న రాజేశ్వర్ అశలు గల్లంతంటే ఊర్కుంటారా. ఆర్మూర్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ తనకొడుక్కి బాల్కొండ టిక్కెట్ వస్తుందన్న నేపథ్యంలో..పోటీకి దూరమవుతున్నట్లు సమాచారం.ఇక్కడ ఓయూ విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేసి టీడీపీలో చేరిన రాజారాం యాదవ్‌కు టీడీపీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ నుంచి సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుని గా పనిచేసి..రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆలూరు గంగారెడ్డి కూడా ఆ పార్టీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. అంటే ముగ్గురు లైన్ లో ఉన్నారు. టీడీపీకి అలయెన్స్ అయితే ఈ ముగ్గురి టిక్కెట్ గోవిందా.. ఒకవేళ బీజేపీకి పోతే..ఇప్పటికే చంద్రబాబు మాటతో బాల్కొండ నుంచి ఆర్మూరుకు వలస వెళ్దామనుకుంటున్న రాజారాం యాదవ్‌కు ఆర్మూరులోనూ...సీటు గల్లంతు కావాల్సిందేననే టెన్షన్ తప్పడం లేదు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బోధన్‌లో ఇప్పుడు టీడీపీ, బీజేపీ అభ్యర్థుల మధ్య ఆం దోళన కనిపిస్తుంది. బీజేపీ నుంచి కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి ఈసారి ఎలాగైనా గెలవాలనే ఆశల పల్లకీలో ఉన్నారు. ఇటు టీడీపీ నుంచి కూడా అమర్నాథ్ బాబు, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, సునీతా దేశాయిలు పోటీపడుతున్నా రు. ఎవరివైపు పొత్తు పొడుస్తుందోననే ఆం దోళన రెండు పార్టీల నేతలను కలవరపెడుతోంది. నిజామాబాద్ అర్బన్‌లో వింత పరిస్థితి ఉం ది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ నుంచి యెండల లక్ష్మినారాయణ ఉన్నారు. ఆయన చేతిలోనే కాంగ్రెస్ నేత డీఎస్, టీడీపీ నేత ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఓడిపోయారు. అందుకే ఖచ్చితంగా ఇది మళ్లీ బీజేపీకే వెళ్లే అవకాశం ఉంది. బీజేపీకి వెళ్తేనే టీడీపీ ఆశావహులు సంతోషపడే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఎందుకంటే ఎలాగో గెలిచే పరిస్థితులు లేవని, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ల పోటీ నడుమ ఇక్కడి సీటు టీడీపీకి రాకపోతేనే మేలనే ఆలోచనలో సైకిల్ పార్టీ నేతలుండటం చెప్పుకోదగ్గ విషయం. -
రాష్ట్రపతి పాలనతో పోయిన పదవి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భారీ నీటిపారుదల శాఖా మంత్రి పి సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి అయ్యా రు. తెలంగాణ రాష్ట్ర విభజనతో పాటు రాష్ట్రపతి పాలనకు ప్రణబ్‌ముఖర్జీ శనివారం ఆమోదముద్ర వేయడంతో ఆయ న హవాకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. కేంద్ర కేబినెట్ సిఫారసు మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేయ గా... జిల్లాలో పాలనపగ్గాలు చేతులు మారాయి. రాష్ట్ర మంత్రి మండలిలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి కానుం డగా... ఇకపై కలెక్టర్ జిల్లా పాలనా వ్యవహారాల్లో మరింత కీలకపాత్ర పోషించనున్నారు. అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్లడంతో ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదే స్థితిలో ఉంటారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో శాసనసభను రద్దుచేసే అంశాన్ని పేర్కొనకపోవడంతో ఎమ్మెల్యే పదవులకు ఢోకా ఉండదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. బోధన్‌కు చెందిన సుదర్శన్ రెడ్డి మద్యం వ్యాపారంలో కొనసాగుతూ 1999లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే సంవత్సరంలో మొదటిసారిగా బోధన్ నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లలో సైతం గెలిపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బోధన్‌లో రికార్డు నెలకొల్పా రు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా మొదటిసారి ఛాన్స్ దక్కగా, కిరణ్‌కుమా ర్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ మంత్రి కొనసాగుతున్న తరుణంలో రాష్ట్రపతి పాలనతో మంత్రి పదవిని కోల్పోయారు. దీంతో సుదర్శన్ రెడ్డికి మంత్రి హోదాలో ఆయనకుండే ప్రొటోకాల్ రద్దయిపోతుంది. అయితే మంత్రి పదవికి దూరమైన ఆయన మాత్రం ఎమ్మెల్యేగా కొనసాగుతారు. పాలనపై అధికార ముద్ర... రాష్ర్టపతి పాలనకు ఆమోదముద్ర పడటంతో ఇకపై జిల్లా పాలనపై పూర్తిగా అధికార ముద్ర ఉంటుంది. ఇప్పటి వర కు మంత్రి, ఇన్చార్జి మంత్రులు, రాజ కీయ నాయకుల కనుసన్నల్లో సాగిన పాలనా వ్యవహారాలన్నీ పూర్తిగా ప్రభుత్వ యం త్రాంగం చూస్తుంది. గవర్నర్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పూర్తిగా జిల్లా పాలన సాగించనుండగా... రాజకీయ పలుకుబడులు, ఒత్తిళ్లకు ఇకపై బ్రేకులు పడనున్నాయి. జిల్లా పాలనా వ్యవహారాల్లో కలెక్టర్ నిర్ణయమే కీలకం కానుండటంతో ఆయనతో పాటు ఏ జిల్లా ఉన్నతాధికారిపైనా రాజకీయ పెత్తనానికి అస్కారం ఉండదు. అలా గే జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపైనా అధికార యంత్రాంగానిదే గురుతర బాధ్యత. -
సింగూరు నుంచి సాగర్‌కు నీరు
రెంజల్, న్యూస్‌లైన్ : సింగూరు ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీల నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేయనున్నట్లు భారీ నీటి పారుదల మంత్రి పి సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. సాగర్ ఆయకట్టు కింద వేసిన పంటలకు చివరి వరకు సాగు నీరందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చివరి ఆయకట్టు గ్రామాలకు నీరందని పక్షంలో త్రీఫేస్ కరెంట్‌ను 7 గంటల పాటు నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తామన్నారు. రెంజల్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాం జలి ఘటించారు. గ్రామంలో మంచినీటి ట్యాంకు పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడు తూ మార్చి వరకు పంటలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. రైతులు పంటల మార్పిడి విధానం పాటించాలని, తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే ఆరుతడి పం టలను సాగుచేయాలని సూచించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోందన్నారు. గతంలో టీడీపీతో పాటు కాంగ్రెస్‌కు చెందిన సీమాంధ్రులు అసెంబ్లీలో తీవ్రంగా వ్యతిరేకించడంతో తెలంగాణపై నిర్ణయంలో జాప్యం జరిగిందన్నారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు, సీమాం ధ్రలో 25 పార్లమెంటు స్థానాలున్నా... ఓట్లు, సీట్ల కోసం కాకుండా ఇక్కడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఇచ్చిందన్నారు. చదువుకునే రోజుల్లో తాను సైతం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెల్లినట్లు మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని పార్టీల నేతలను కలిసి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదన్నారు. ప్రజల మనిషినే ఎన్నుకోండి.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడి వారి బాగోగులు పట్టించుకునే వారినే గుర్తించి ఎన్నుకునాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు వచ్చే దిగుమతిదారులను ప్రజలు నిరాకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతో పాటు తాను కూడా సమస్యలు పరిష్కరించలేదని భావిస్తే ఆలోచించి ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సవిత, జావీద్, ఖలీంబేగ్, తెలంగాణ శంకర్, రమేష్, లక్ష్మణ్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం, విం డో చెర్మైన్లు సాయరెడ్డి, అహ్మద్‌బేగ్, నాయకులు మొబిన్‌ఖాన్, భూమన్న, మోహన్, ఎఖార్, హాజీఖాన్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరికి వారే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది తామే అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహించాలనుకున్నారు. అయితే దీనికి ఆదిలోనే అవాంతరం ఏర్పడింది. గ్రూప్ విభేదాలతో నేతలు ఎవరికి వారే సం బురాలు చేసుకుంటున్నారు. జిల్లాలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ వేర్వేరు కార్యక్రమాలకు తెరతీశారు. ఇద్దరు నేతల అనుచరులు సైతం వేర్వేరుగా సంబురాలు చేసుకున్నారు. జిల్లా కాంగ్రెస్‌లో గ్రూప్ విభేదాలకు ఇది తాజా ఉదాహరణ. 2009 ఎన్నికల తర్వాత అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు జిల్లా కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేస్తోంది. జిల్లాలోని తొమ్మి ది నియోజకవర్గాలపైనా ప్రభావం చూపుతోంది. 2009 ఎన్నికలలో అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డి.శ్రీనివాస్ ఓడిపోయారు. జిల్లా నుంచి కాంగ్రెస్ తరపున బోధన్ నుంచి పోటీచేసిన సుదర్శన్‌రెడ్డి ఒక్కరే విజయం సాధించడంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకు చోటు లభించింది. తర్వాతి పరిస్థితులలో జిల్లాపై పట్టు నిలుపుకోవడానికి ఒకరు, పట్టు సాధించడం కోసం మరొకరు ప్రయత్నించడంతో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. మరోవైపు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి పార్టీలో ప్రాబల్యా న్ని చాటుకునేందుకు యత్నిస్తూ వస్తున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో నాలుగు స్తంభాలాట నెలకొంది. ఇది పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. కార్యకర్తలను ఆయోమయానికి గురి చేస్తోంది. సంబురాలలోనూ కలవని నేతలు పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన సందర్భంగా నిర్వహించే ఉత్సవాల కోసమూ అగ్రనేతలు కలిసి సాగడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా జిల్లాలో సంబురాలు ఉమ్మడిగా, ఘనంగా నిర్వహించాలని అగ్రనేతలు పిలుపునిచ్చారు. పార్టీ హైకమాండ్ ఆదేశించిన మరుసటి రోజే సంబురాలకు సిద్ధమైన ఇద్దరు నేతలు హైదరాబాద్‌లో వేర్వేరుగా ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు. నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలతో డి.శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో మాట్లాడారు. మంత్రి సుదర్శన్‌రెడ్డి సైతం బోధన్ నియోజకవర్గం ముఖ్య నేతలతో పాటు నిజామాబాద్‌కు చెందిన కేడర్ తో హైదరాబాద్‌లో మాట్లాడారు. బుధవారం నిజామాబాద్ నుంచి బోధన్ వరకు మంత్రి ర్యాలీ తీశారు. విజయోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. డీఎస్ వచ్చే నెల రెండున నిజామాబాద్ రానున్నారు. ఆ రోజు సంబురాలు జరుపుకునేందుకు డీఎస్ వర్గం ఏర్పాట్లు చేస్తోంది. ఐక్యత కష్టమే! తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాలలో ఇప్పటికే ఉమ్మడిగా సదస్సులు నిర్వహించగా, జిల్లాలో మాత్రం గ్రూపు రాజకీయాల కారణంగా అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. బీజేపీ, టీఆర్ఎస్లు ఇప్పటికే ఘనంగా విజయోత్సవాలు నిర్వహించాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడినట్లే భావిస్తున్నారు. ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ రెండు రోజుల క్రితం బాల్కొండ నియోజకవర్గంలో సంబురాలు చేసుకోగా, మంత్రి సుదర్శన్‌రెడ్డి బుధవారం నిర్వహించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కొందరు ఆ సంబురాల ఊసే ఎత్తడం లేదన్న చర్చ పార్టీ వర్గాలలో సాగుతోంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ శాసనసభాపతి సురేశ్‌రెడ్డిలు తెలంగాణ సంబురాలపై స్పందించకపోవడం పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తోంది. పరిస్థితులను గమనిస్తున్నవారు కాంగ్రెస్‌లో ఐక్యత కష్టమే అని పేర్కొంటున్నారు.