పొత్తు కాదు..ముప్పు | doubt on BJP,TDP alliance | Sakshi
Sakshi News home page

పొత్తు కాదు..ముప్పు

Published Tue, Mar 18 2014 2:40 AM | Last Updated on Fri, Aug 10 2018 6:45 PM

doubt on BJP,TDP alliance

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కమలం, సైకిల్ పొత్తు వికసించనుందా? టీడీపీ-బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా? అంటే.. ఇప్పుడవుననే అంటున్నా రు ఆ పార్టీలకు చెందిన నేతలు. కొంత వర కు  పొత్తులపై ఇరుపార్టీల తెలంగాణ నా యకత్వం విముఖత వ్యక్తం చేసినా.. చివర కు ఆ రెండు పార్టీల అధిష్టానాలు ‘పొత్తు లు ఖాయం’ అన్న సంకేతాలు ఇచ్చాయి. తాజాగా శుక్రవారం బీజేపీ అగ్రనేత ప్రకా శ్ జవదేకర్ ‘ఇక కలిసి సాగాల్సిందే’ నం టూ నేతలకు సూచించారు. ఈ నేపథ్యం లో ‘ఒక వేళ అదే జరిగితే మన పరిస్థితేమిటి?’ అన్నది ఆ రెండు పార్టీల్లోని ఆశావహులు, నేతల్లో సందేహం నెలకొంది.

 టీడీపీ, బీజేపీ సిట్టింగ్ స్థానాలు తారుమారవుతాయేమోనన్న టెన్షన్ వారికి మొదలైంది. పొత్తులు ఖాయమైతే రెండు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఎలా సాగిపోవడమనేది చర్చనీయాంశంగా మారింది. కాగా తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు జిల్లా కంచుకోటగా ఉండేది. ఆ పరిస్థితి ఇప్పుడు తలకిందులై... సైకిల్ పంక్చర్ అయ్యింది. తెలంగాణ ఉద్యమం, మారిన రాజకీయ పరిస్థితులు.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, ఇవన్నీ టీడీపీ నీరుగారడానికి కారణాలయ్యాయి. ఈ నేపథ్యంలో  తెలంగాణ నినాదంతో సమర్థవంతంగా బీజేపీతో కలిసి నడవాలని ఆరాటపడుతున్నా.. ఎ వరికీ, ఏ మేరకు లాభిస్తుందనేది వేచి చూడాల్సిందే.

     జిల్లాలో ఒకప్పుడు టీ డీపీకి బలంగా ఉన్న కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బా న్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై  చెప్పి కారెక్కేశారు. అదేబాటలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక టీడీపీలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, ఆర్మూర్ ఎమ్మెల్యే అన్న పూర్ణమ్మ మిగిలారు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి కూడా బీజేపీకి చెందిన కేశ్‌పల్లి ఆ నందరెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, ఆలూరి గంగారెడ్డిలు టిక్కెట్‌లు ఆశిస్తున్నారు.

     బాల్కొండ నియోజకవర్గం నుంచి ఆర్మూరు ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కుమారుడు డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి టీడీపీ ఇన్‌చార్జిగా ఉ న్నారు. దాదాపుగా అక్కడ ఆయన అభ్యర్థేనని కూడ తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుం చో ఆశలు పెట్టుకున్న బీజేపీ నేతలు పెద్దోళ్ల గంగారెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్ టికెట్ వదులుకునే పరిస్థితుల్లో లేరు. బాల్కొండ నుంచి తెలంగాణ జాగృతిలో జిల్లా కన్వీనర్‌గా పని చేసి రాజీనామా చేసిన సునీల్‌రెడ్డి కూడ బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు.

కామారెడ్డి నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేసి రాజీనామా చేసి న నిట్టు వేణుగోపాల్‌రావు ఇటీవలే కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. బీజేపీ నుం చి ఆయన టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకొని..కేడర్ నంతా కారెక్కించేశారు. దీంతో టీడీపీకి దిక్కై న యూసుఫ్‌అలీ,పున్న రాజేశ్వర్ అశలు గల్లంతంటే ఊర్కుంటారా.

 ఆర్మూర్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ తనకొడుక్కి బాల్కొండ టిక్కెట్ వస్తుందన్న నేపథ్యంలో..పోటీకి దూరమవుతున్నట్లు సమాచారం.ఇక్కడ ఓయూ విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేసి టీడీపీలో చేరిన రాజారాం యాదవ్‌కు టీడీపీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ నుంచి సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుని గా పనిచేసి..రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆలూరు గంగారెడ్డి కూడా ఆ పార్టీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. అంటే ముగ్గురు లైన్ లో ఉన్నారు. టీడీపీకి అలయెన్స్ అయితే ఈ ముగ్గురి టిక్కెట్ గోవిందా.. ఒకవేళ బీజేపీకి పోతే..ఇప్పటికే చంద్రబాబు మాటతో బాల్కొండ నుంచి ఆర్మూరుకు వలస వెళ్దామనుకుంటున్న రాజారాం యాదవ్‌కు ఆర్మూరులోనూ...సీటు గల్లంతు కావాల్సిందేననే టెన్షన్ తప్పడం లేదు.

 భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బోధన్‌లో ఇప్పుడు టీడీపీ, బీజేపీ అభ్యర్థుల మధ్య ఆం దోళన కనిపిస్తుంది. బీజేపీ నుంచి కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి ఈసారి ఎలాగైనా గెలవాలనే ఆశల పల్లకీలో ఉన్నారు. ఇటు టీడీపీ నుంచి కూడా అమర్‌నాథ్ బాబు, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, సునీతా దేశాయిలు పోటీపడుతున్నా రు. ఎవరివైపు పొత్తు పొడుస్తుందోననే ఆం దోళన  రెండు పార్టీల నేతలను కలవరపెడుతోంది.

నిజామాబాద్ అర్బన్‌లో వింత పరిస్థితి ఉం ది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ నుంచి యెండల లక్ష్మినారాయణ ఉన్నారు. ఆయన చేతిలోనే కాంగ్రెస్ నేత డీఎస్, టీడీపీ నేత ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఓడిపోయారు. అందుకే ఖచ్చితంగా ఇది మళ్లీ బీజేపీకే వెళ్లే అవకాశం ఉంది. బీజేపీకి వెళ్తేనే టీడీపీ ఆశావహులు సంతోషపడే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఎందుకంటే ఎలాగో గెలిచే పరిస్థితులు లేవని, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల పోటీ నడుమ ఇక్కడి సీటు టీడీపీకి రాకపోతేనే మేలనే ఆలోచనలో సైకిల్ పార్టీ నేతలుండటం చెప్పుకోదగ్గ విషయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement