yendala lakshminarayana
-
ఫ్యాక్టరీని విక్రయిస్తే తరిమికొడతాం
రెంజల్(బోధన్): బోధన్‌లోని చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం విక్రయిస్తే తరమికొడతామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ హెచ్చరించారు. రైతులు, కార్మికులతో ప్రతిఘటిస్తామన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదులో భాగంగా రెంజల్ మండలం నీలాక్యాంపులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని సీఎం కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. ‘కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు’ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు ఉందన్నారు. కార్మికుల బకాయిలను చెల్లించి వందలాది మందికి ఉపాధినిస్తున్న ఫ్యాక్టరీని తెరిపించాలన్నారు. రూ.360 కోట్లు చెల్లించిన కేసీఆర్ రూ.500 కోట్లతో అసెంబ్లీ భవన నిర్మాణం చేపట్టడం సిగ్గుచేటన్నారు. జిల్లా కేంద్రంలోని నడిబోడ్డున ఉన్న కలెక్టరేట్‌ను తరలించడంలో అనుమానం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి ఎంపిక చేసిన భూమి విలువ మార్కెట్లో రూ.1.50 లక్షలకు గజం ఉండగా కేవలం రూ.వందకు గజం చొప్పున ధర కట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని దేశం సరిహద్దు, అంతర్గత భద్రత విభాగాల్లో సురక్షితంగా ఉందన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత కాశ్మీర్లో ఉగ్రవాద, తీవ్రవాదం పూర్తిగా తగ్గిందన్నారు. మానవబాంబులను మోదీ నిర్వీర్యం చేశారని ఫలితంగా ప్రపంచ దేశాల్లోని ఎన్ఆర్ఐలకు గౌరవం లభిస్తుందన్నారు. సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది.. సొమ్ము కేంద్రానిదైతే రాష్ట్ర ప్రభుత్వం సోకు చేస్తుందని యెండల ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు 2014–15లో ఒక్కొక్కరికి రూ.350 ఉండగా 2018–19కు రూ. 804కు కేంద్రం పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూపాయి కూడా విదల్చడంలేదన్నారు. ఉపాధిహామీ మొదటి విడతలో ఇచ్చిన హామీలు నెరవేరకుండారనే రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎంపీపీ లోలపు రజిని, జెడ్పీటీసీ మేక విజయ, ఎంపీటీసీలు యోగేశ్, గడ్డం స్వప్న, జల్ల రుక్మిణి, అంతయ్య, బీజేపీ నాయకులు సంతోష్, కిషోర్, కోయా సాంబశివరావ్, డాక్టర్ శివప్ప, సుభాష్, భాస్కర్‌రెడ్డి, రాజు, వెంకటేశ్వర్రావ్, రాంచందర్, పోచయ్య, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు. -
నిజాంను పొగుడుతారా?
-
నిజాంను పొగుడుతారా?
వినాయక్‌నగర్ : నిరంకుశ పాలనతో ప్రజలను వేధించిన నిజాం ప్రభువులను ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడడం ఎంతవరకు సబబని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజాం ప్రభువుల పాలన బ్రహ్మాండం అంటూ కేసీఆర్ పదేపదే పేర్కొనడాన్ని తప్పుపట్టారు. ‘‘కొమురం భీంను ఎవరు హతమార్చారు, ఎందుకు హతమార్చారు, జోడేఘాట్‌ను కేసీఆర్ ఎందుకు సందర్శించారు, వీరనారి చాకలి ఐలమ్మను హతమార్చింది ఎవరు’’ అన్న అంశాలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని యెండల డిమాండ్ చేశారు. నిజాం అరాచకాలను ఎదిరించి, రజకార్లతో పోరాడినవారికి పెన్షన్ ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. తుపాకీని పరీక్షించేందుకు బైరాన్‌పల్లిలో 84 మందిని కాల్చి చంపిన నిజాం చరిత్రను ప్రజలు మరచిపోలేదన్నారు. కేసీఆర్ చరిత్ర తిరగేసి అక్కడి మర్రిచెట్టుకు వెయ్యి ఉరిల మర్రి అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలన్నారు. నిజాం కాలంలో తెలంగాణ ఆడ బిడ్డలు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తే వివస్త్రలను చేసి ఆడించిన సంఘట నలు నిజాంచరిత్రలో ఉన్నాయన్నారు. అలాంటి నీచపాలన బాగుందని కేసీఆర్ పేర్కొనడం దురదృష్టకరమన్నారు. నిజాం ముక్కుపిండి పన్నులు వసూలు చేసి, ప్రపంచంలోనే ధనవంతుడిగా మారాడన్నారు. తన పాలనకు వ్యతిరేకంగా కథనాలను ప్రచురించిన జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ కాళ్లను నరికేయించిన చరిత్ర నిజాందని గుర్తు చేశారు. కేసీఆర్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శించారు. నిజాం నిరంకుశత్వం తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిందన్నారు. అలాంటి నిజాంను పొగడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నగర అధ్యక్షుడు గజం ఎల్లప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ గుప్తా, బాణాల లక్ష్మారెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శైలజ తదితరులు పాల్గొన్నారు. -
హ్యాట్రిక్ రేసులో ఐదుగురు వీరులు
నిజామాబాద్ : ఎన్నికలలో వరుసగా మూడుసార్లు గెలవడం అరుదు. ఇలా గెలిస్తే హ్యాట్రిక్ సాధించారంటాం. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నవారిలో పలువురు అభ్యర్థులు ఈ అరుదైన ఘనత సాధించటానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్థన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి రెండుసార్లు గెలిచిన యెండల లక్ష్మీనారాయణ సైతం హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సైతం ఈ ఘటన సాధించటానికి ఒక్క విజయం దూరంలోనే ఉన్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ నమోదు చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నాలుగో విజయం కోసం మరోసారి బోధన్ నుంచే బరిలో నిలిచారు. ఆయన 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. -
పొత్తు కాదు..ముప్పు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కమలం, సైకిల్ పొత్తు వికసించనుందా? టీడీపీ-బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా? అంటే.. ఇప్పుడవుననే అంటున్నా రు ఆ పార్టీలకు చెందిన నేతలు. కొంత వర కు పొత్తులపై ఇరుపార్టీల తెలంగాణ నా యకత్వం విముఖత వ్యక్తం చేసినా.. చివర కు ఆ రెండు పార్టీల అధిష్టానాలు ‘పొత్తు లు ఖాయం’ అన్న సంకేతాలు ఇచ్చాయి. తాజాగా శుక్రవారం బీజేపీ అగ్రనేత ప్రకా శ్ జవదేకర్ ‘ఇక కలిసి సాగాల్సిందే’ నం టూ నేతలకు సూచించారు. ఈ నేపథ్యం లో ‘ఒక వేళ అదే జరిగితే మన పరిస్థితేమిటి?’ అన్నది ఆ రెండు పార్టీల్లోని ఆశావహులు, నేతల్లో సందేహం నెలకొంది. టీడీపీ, బీజేపీ సిట్టింగ్ స్థానాలు తారుమారవుతాయేమోనన్న టెన్షన్ వారికి మొదలైంది. పొత్తులు ఖాయమైతే రెండు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఎలా సాగిపోవడమనేది చర్చనీయాంశంగా మారింది. కాగా తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు జిల్లా కంచుకోటగా ఉండేది. ఆ పరిస్థితి ఇప్పుడు తలకిందులై... సైకిల్ పంక్చర్ అయ్యింది. తెలంగాణ ఉద్యమం, మారిన రాజకీయ పరిస్థితులు.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, ఇవన్నీ టీడీపీ నీరుగారడానికి కారణాలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నినాదంతో సమర్థవంతంగా బీజేపీతో కలిసి నడవాలని ఆరాటపడుతున్నా.. ఎ వరికీ, ఏ మేరకు లాభిస్తుందనేది వేచి చూడాల్సిందే. జిల్లాలో ఒకప్పుడు టీ డీపీకి బలంగా ఉన్న కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బా న్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి కారెక్కేశారు. అదేబాటలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే టీఆర్ఎస్లో చేరారు. ఇక టీడీపీలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, ఆర్మూర్ ఎమ్మెల్యే అన్న పూర్ణమ్మ మిగిలారు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి కూడా బీజేపీకి చెందిన కేశ్‌పల్లి ఆ నందరెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, ఆలూరి గంగారెడ్డిలు టిక్కెట్లు ఆశిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి ఆర్మూరు ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కుమారుడు డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి టీడీపీ ఇన్చార్జిగా ఉ న్నారు. దాదాపుగా అక్కడ ఆయన అభ్యర్థేనని కూడ తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుం చో ఆశలు పెట్టుకున్న బీజేపీ నేతలు పెద్దోళ్ల గంగారెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్ టికెట్ వదులుకునే పరిస్థితుల్లో లేరు. బాల్కొండ నుంచి తెలంగాణ జాగృతిలో జిల్లా కన్వీనర్‌గా పని చేసి రాజీనామా చేసిన సునీల్‌రెడ్డి కూడ బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసి రాజీనామా చేసి న నిట్టు వేణుగోపాల్‌రావు ఇటీవలే కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. బీజేపీ నుం చి ఆయన టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని..కేడర్ నంతా కారెక్కించేశారు. దీంతో టీడీపీకి దిక్కై న యూసుఫ్‌అలీ,పున్న రాజేశ్వర్ అశలు గల్లంతంటే ఊర్కుంటారా. ఆర్మూర్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ తనకొడుక్కి బాల్కొండ టిక్కెట్ వస్తుందన్న నేపథ్యంలో..పోటీకి దూరమవుతున్నట్లు సమాచారం.ఇక్కడ ఓయూ విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేసి టీడీపీలో చేరిన రాజారాం యాదవ్‌కు టీడీపీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ నుంచి సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుని గా పనిచేసి..రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆలూరు గంగారెడ్డి కూడా ఆ పార్టీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. అంటే ముగ్గురు లైన్ లో ఉన్నారు. టీడీపీకి అలయెన్స్ అయితే ఈ ముగ్గురి టిక్కెట్ గోవిందా.. ఒకవేళ బీజేపీకి పోతే..ఇప్పటికే చంద్రబాబు మాటతో బాల్కొండ నుంచి ఆర్మూరుకు వలస వెళ్దామనుకుంటున్న రాజారాం యాదవ్‌కు ఆర్మూరులోనూ...సీటు గల్లంతు కావాల్సిందేననే టెన్షన్ తప్పడం లేదు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బోధన్‌లో ఇప్పుడు టీడీపీ, బీజేపీ అభ్యర్థుల మధ్య ఆం దోళన కనిపిస్తుంది. బీజేపీ నుంచి కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి ఈసారి ఎలాగైనా గెలవాలనే ఆశల పల్లకీలో ఉన్నారు. ఇటు టీడీపీ నుంచి కూడా అమర్నాథ్ బాబు, మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, సునీతా దేశాయిలు పోటీపడుతున్నా రు. ఎవరివైపు పొత్తు పొడుస్తుందోననే ఆం దోళన రెండు పార్టీల నేతలను కలవరపెడుతోంది. నిజామాబాద్ అర్బన్‌లో వింత పరిస్థితి ఉం ది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ నుంచి యెండల లక్ష్మినారాయణ ఉన్నారు. ఆయన చేతిలోనే కాంగ్రెస్ నేత డీఎస్, టీడీపీ నేత ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఓడిపోయారు. అందుకే ఖచ్చితంగా ఇది మళ్లీ బీజేపీకే వెళ్లే అవకాశం ఉంది. బీజేపీకి వెళ్తేనే టీడీపీ ఆశావహులు సంతోషపడే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఎందుకంటే ఎలాగో గెలిచే పరిస్థితులు లేవని, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ల పోటీ నడుమ ఇక్కడి సీటు టీడీపీకి రాకపోతేనే మేలనే ఆలోచనలో సైకిల్ పార్టీ నేతలుండటం చెప్పుకోదగ్గ విషయం. -
బిల్లు ఆపుతామని వెంకయ్య అనలేదు
యెన్నం వ్యాఖ్యలను ఆరోపణలుగా చూడొద్దు నష్టనివారణ చర్యలు చేపట్టిన బీజేపీ జైరాంతో ఒంటరిగా చర్చించాల్సిందికాదు: పేరాల హస్తినకు కిషన్‌రెడ్డి, రామచంద్రరావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి తమ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడుపై చేసిన వ్యాఖ్యలతో పార్టీ నాయకత్వం కంగుతింది. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పరిస్థితిని అంచనా వేసి నివేదికను పంపాల్సిందిగా జాతీయ కార్యవర్గసభ్యుడు పేరాల చంద్రశేఖరరావును ఆదేశించింది. అంతేకాక రాష్ట్ర పరిస్థితిని తెలుసుకునేందుకు మరో జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్.రామచంద్రరావును హస్తినకు పిలిపించింది. దీంతో ఢిల్లీ వెళ్లిన రామచంద్రరావు అక్కడ అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లతో భేటీ అయ్యారు. కాగా, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీ వెళుతున్నారు. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా పార్టీ నేతలకు చర్చలో సహకరించేవిధంగా 16 అంశాలతో నివేదికను కిషన్‌రెడ్డి తన వెంట తీసుకెళ్తున్నారు. ఇదిలాఉండగా, హైకమాండ్ ఆదేశంతో సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన పేరాల చంద్రశేఖరరావు అందుబాటులో ఉన్న నేతలతో ముచ్చటించారు. ఇది ‘టీ’ కప్పులో తుపాను లాంటిదని విలేకరులకు చెప్పి విషయం దాటవేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేల వ్యాఖ్యలను ఆరోపణలుగా చూడవద్దన్నారు. వెంకయ్యనాయుడు ఒంటరిగా కేంద్రమంత్రి జైరాం రమేశ్‌తో భేటీ కావడం అనేక అనుమానాలకు, అపార్థాలకు తావిచ్చిందన్నారు. వెంకయ్య ఒక బృందంతో వెళ్లి ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదన్నారు. ముఖ్యాంశాలు... వెంకయ్యనాయుడు ఎన్నడూ తెలంగాణ బిల్లును ఆపుతామని చెప్పలేదు. టీడీపీ, లోక్‌సత్తాలతో పొత్తు ఉండదన్నారు. లేనిపోనివి ప్రసారం చేసి, పత్రికల్లో రాసి తమను ఇబ్బందులు పెట్టవద్దు. రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతోనే రెండు ఉద్యమకమిటీలు వేశాం. తెలంగాణలో మా సహకారం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాకూడదన్నదే మా ఆరాటం. యెన్నంతో పాటు వెంకయ్యను కూడా కిషన్‌రెడ్డి వివరణ కోరతారని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. హుందాగా వ్యవహరించండి! ఇదిలాఉండగా, యెన్నం శ్రీనివాసరెడ్డిపై పరుషపదజాలంతో విమర్శలు గుప్పించిన బీజేపీ సీమాంధ్ర నేతల్ని వెంకయ్యనాయుడు మందలించినట్టు తెలిసింది. యువకుడయిన శ్రీనివాసరెడ్డి ఏదో ఆవేశంలో మాట్లాడితే సీనియర్లు అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరమేమొచ్చిందని ఢిల్లీలో తనను కలిసిన సీమాంధ్రనేతలతో అన్నట్టు సమాచారం. బీజేపీని బలిపశువును చేసే యత్నం: విద్యాసాగర్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు విషయంలో బీజేపీని బలిపశువును చేయడానికి కాంగ్రెస్ విఫలయత్నం చేస్తోందని బీజేపీ నేత విద్యాసాగర్‌రావు అన్నారు. పార్లమెంటులో సత్వరమే తెలంగాణ బిల్లు పెట్టాలని, బీజేపీ బేషరతుగా మద్దతు ఇస్తుందని చెప్పారు. ఢిల్లీలో సోమవారం ఆయన వెధిరె శ్రీరాంతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించి బిల్లులో చేయాల్సిన సవరణలను రాజ్యసభలో విపక్ష నేత అరుణ్‌జైట్లీకి అందజేశామని చెప్పారు. సీఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలపై చర్యలేవీ? తెలంగాణపై కాంగ్రెస్‌కు బీజేపీ సూటి ప్రశ్న సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయానికి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం కిరణ్‌పై, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలేదో కాంగ్రెస్ వివరణ ఇవ్వాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. పార్టీ విధానాన్ని వ్యతిరేకించే వారిని పార్టీనుంచి ఎందుకు బహిష్కరించడంలేదని ప్రశ్నించింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ సోమవారం ఢిల్లీలో పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. ‘సీఎం కిరణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీలు సభలకు అంతరాయం కలిగిస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి వారి ఎంపీలే నోటీసులిస్తున్నారు. అయినా, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు’ అని జవదేకర్ విమర్శించారు. సీఎం కిరణ్ నిర్వహించే కేబినెట్ మీటింగ్‌కు హాజరు కావాలంటూ దిగ్విజయ్ సింగ్ తెలంగాణ మంత్రులకు చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. బీజేపీ నేత వెంకయ్యనాయుడుపై సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన విమర్శల గురించి అడిగిన ప్రశ్నలకు జవదేకర్ సమాధానం దాటవేశారు. తెలంగాణ బిల్లుపై బీజేపీ వైఖరి గురించి అడగ్గా, ‘పతివ్రతకు రోజూ చెప్పాల్సిన అవసరం లేదు. తన భర్తతో కలిసి ఉన్నట్టు...’ అంటూ బదులిచ్చారు. తెలంగాణపై పార్టీ వైఖరిని ఇప్పటికే వెల్లడించామన్నారు. -
టీడీపీతో పొత్తు వద్దు: రాజ్‌నాథ్‌తో బీజేపీ తెలంగాణ కమిటీ
సాక్షి, హైదరాబాద్: టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో భారీగా నష్టపోతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు ఆ పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ విన్నవించింది. పార్టీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నాయకత్వంలో పార్టీ నేతలు ఎన్.వేణుగోపాల్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు గురువారమిక్కడ రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. 2004లో పొత్తులో భాగంగా పార్టీ 9 పార్లమెంటు, 27 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తే, రెండు అసెంబ్లీ సీట్లే వచ్చాయని పేర్కొన్నారు. అదే 2009లో ఎటువంటి పొత్తులు లేకుండా పోటీ చేసినా అవే రెండు అసెంబ్లీ సీట్లు గెలిచామని, అందువల్ల టీడీపీతో పొత్తు కన్నా లేకుండా ఉండడమే ప్రస్తుత పరిస్థితుల్లో మేలని తెలిపారు. తెలంగాణ సాధన కోసం పార్టీ చేసిన ఉద్యమాల వల్ల ఆ ప్రాంతంలో పార్టీ బలం పెరిగిందని వివరించారు. ఈనేపథ్యంలో ఒంటరి పోరుకే అనుమతించాలని కోరారు. అదే సమయంలో రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిచి గెలవలేకపోయిన పార్టీ అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వొద్దని కూడా సూచించారు. వీరి వాదనను విన్న రాజ్‌నాథ్ సింగ్ ఈ సూచనలు, సలహాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ భేటీకి రాజ్‌నాథ్, గడ్కరీ: రెండు రోజులుగా కీసరలోని ఓ రిసార్టులో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ కేంద్ర కమిటీ సమావేశానికి రాజ్‌నాథ్‌తో పాటు పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయడు, ప్రధాన కార్యదర్శులు సౌధాన్ సింగ్, మురళీధర్‌రావు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను, గత ఆరు నెలల్లో ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు చేపట్టిన కార్యక్రమాలను సమక్షించారు. సమావేశం వివరాలను గోప్యంగా ఉంచారు. ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ (అధినేత) మోహ న్భగవత్, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కొందరు ముఖ్యనేతలు మాత్రమే సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసింది. కాగా, అస్వస్థతతో ఉన్న పార్టీ నేత బంగారు లక్ష్మణ్‌ను రాజ్‌నాథ్‌సింగ్ పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని పలు బీసీ సంఘాలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాయి. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలోని ప్రతినిధి బృందం రాజ్‌నాథ్‌ను కలసి చర్చలు జరిపింది.