Young farmer suicide
-
ఆవేదనతో యువరైతు ఆత్మహత్య
గొల్లపల్లె (తర్లుపాడు): పంటలు ఎండిపోతున్నాయన్న ఆవేదనతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని గొల్లపల్లెలో సోమవారం వెలుగులోకి వచ్చింది. తాడివారిపల్లె ఎస్సై లకా్ష్మరెడ్డి కథన ప్రకారం.. గ్రామానికి చెందిన పొడతరపు కాశయ్య, కనకమ్మలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విజయవాడలో ముఠా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండో కుమారుడు ఏడుకొండలు తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈ ఏడాది తన నాలుగు ఎకరాల్లో వరి, మిరప పంటలను బోరు బావి కింద సాగు చేశాడు. గతంలో ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న బోరుబావి ఒట్టిపోవటంతో సొంతంగా బోరు ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న బోరుబావి కోసం ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. నూతనంగా నిర్మించిన బోరుబావికి ట్రాన్స్ఫార్మర్ లేకపోవటంతో పక్కన ఉన్న రైతుల ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా చేసుకుంటున్నాడు. ఏడుకొండలు దాయాదులైన వెంకటేశ్వర్లు, వెంకట కాశయ్యలు తాము అదే ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా చేసుకుంటామని, లేదంటే ఏడుకొండలు వైర్లు కూడా తొలగించాలని సంబంధిత రైతులతో చెప్పారు. ఆ రైతులు ఏడుకొండలు విద్యుత్ వైర్లను తొలగించారు. ఈ నేపథ్యంలో బోరు పనిచేయకపోవటంతో పంటలు ఎండిపోయాయి. తీవ్ర ఆవేదన చెందిన ఏడుకొండలు కూల్‌డ్రింక్‌లో పొలానికి తెచ్చుకున్న గుళికల మందు కలుపుకుని తాగాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించటంతో మార్కాపురం ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఏడుకొండలు మృతి చెందాడు. మృతుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ తన పొలం పనులు పర్యవేక్షిస్తుండేవాడని బంధువులు తెలిపారు. ఎస్సై లకా్ష్మరెడ్డి కేసు నమోదు చే సి దరాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
అప్పు ఎలా తీర్చాలో తోచక..
♦ యువరైతు ఆత్మహత్య ♦ ఎండుతున్న పంటలతో మనస్తాపం మద్నూర్ : వర్షాలు కురవక వేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోవడంతో పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలి యక తీవ్ర మనస్తాపం చెందిన పాండ్రెవార్ మష్ణా (31) అనే యువరైతు శుక్రవారం తన పోలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మద్నూర్ మండ లం లింబుర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తు లు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. లింబుర్‌కు చెందిన మష్ణా తనకున్న రెండెకరాల్లో సోయూ, పెసరతో పాటు అంతర పంటగా కంది సాగుచేశాడు. నెల రోజుల క్రితం వర్షాలు సకాలంలో కురియడంతో పంటకు ఇబ్బంది లేదని సాగు చేశాడు. సాగు కోసం రూ. 35 వేలు అప్పు చేశాడు. నాటి నుంచి నేటి వరకు వర్షాలు కురియక పోవడంతో అప్పులు ఏలా తీర్చాలో అంటూ తరచూ ఇంట్లో బాధపడేవాడని మష్ణా తండ్రి గుండప్ప రోదిస్తూ తెలిపాడు. గత సంవత్సరం పంటలు పండక తీవ్ర అప్పుల్లో ఉన్న తన కొడుకుకు ఈ సారి కూడా అప్పులే మిగలడంతో మనస్థాపానికి గురయ్యేవాడని వాపోయూడు. అంతేకాకుండా మష్ణా మహరాష్ట్రలోని నాందేడ్‌లో కూలీ పని చేస్తూ వారానికి ఒకసారి వచ్చి పంటలు చూసి వెళ్లే వాడని మృతుడి భార్య అంజనీబాయి తెలిపింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నాందేడ్ నుంచి ఇంటికి వచ్చిన మష్ణా శుక్రవారం ఉదయం పంటలు చూసివస్తానని ఇంట్లో చెప్పి పొలానికి వెళ్లాడని వారు తెలిపారు. పొలంలో ఎండిపోతున్న పంటలు చూసి ఆందోళనకు గురై పురుగుల మందు తాగాడు. ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. పొలంలో అనుమానస్పద స్థితిలో పడిఉన్న మష్ణాను చూసిన పశువుల కాపరులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు పొలానికి చేరుకుని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై బన్సీ తెలిపారు. మష్ణాకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. -
అది బాబు చేసిన ఖూనీ
అనంతపురం యువ రైతు ఆత్మహత్యపై జగన్ * రైతుల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం * ప్రజాకంటక సర్కారుకు పోయే రోజులు దగ్గర పడ్డారుు * వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ధ్వజం సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురంలో యువరైతు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో రైతుల పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. ఇది నూటికి నూరుశాతం చంద్రబాబు చేసిన ఖూనీయేనని మండిపడ్డారు. కాకినాడలో శుక్రవారం తనను కలిసిన విలేకరులతో జగన్ కొద్దిసేపు మాట్లాడారు. రైతులకు లక్షలోపు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెబుతూ వచ్చిన చంద్రబాబు వారిని పచ్చిమోసం చేశారన్నారు. వడ్డీ మాఫీ కాకపోగా ఇప్పుడు 14 నుంచి 16 శాతం అపరాధ వడ్డీ కట్టాల్సిన పరిస్థితుల్లో రైతులు గత్యంతరం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో యువరైతు తీసుకున్న రుణంపై వడ్డీ చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి చంద్రబాబు కారణం కాదా? అని ప్రశ్నించారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి పైసా కూడా మాఫీ చేయకుండా అక్కచెల్లెళ్ళను నిలువునా దగా చేశారని చెప్పారు. ప్రజాకంటక పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కార్‌కు పోయే రోజులు దగ్గరపడ్డాయని ధ్వజమెత్తారు. ఈ విషయాలన్నింటిపైనా అన్ని వర్గాల పక్షాన తమ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. తప్పించుకోవడానికే తెర మీదకు సెక్షన్-8 పునర్విభజన చట్టంలోని ప్రతి అంశాన్నీ అమలు చేసి తీరాల్సిందేనని తమ పార్టీ తర ఫున అనేక పర్యాయాలు ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి నివేదించామని జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి తెలంగాణ లో ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు దాని నుంచి తప్పించుకునేందుకే సెక్షన్-8ని తీసుకొచ్చారని విమర్శించారు. జగన్ హెచ్చరికతో కదలిన ప్రభుత్వం సాక్షి, విశాఖపట్నం: ధవళేశ్వరం ప్రమాద బాధితులకు నాలుగు రోజుల్లో పరిహారం ఇవ్వకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హెచ్చరించడంతో సర్కారు దిగి వచ్చింది. మృతుల కుటుంబాలకు ప్రకటించిన రూ.2లక్షల పరిహారాన్ని శనివారం పంపిణీ చేయాలని నిర్ణయించింది. పొగాకు రైతులతో నేడు జగన్ భేటీ సాక్షి, ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి సందర్శించనున్నారు. అక్కడి పొగాకు వేలం కేంద్రంలో రైతులతో మాట్లాడతారు. ఈ రైతులు గిట్టుబాటు ధర లభించక నానాఅవస్థలు పడుతున్నారు. పాలకులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు జగన్ వెళ్తున్నారు. వెన్ను తట్టి.. ధైర్యం చెప్పిన జగన్ * వాయుగుండం, వ్యాన్ ప్రమాద బాధితులకు ఓదార్పు * బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా సాక్షి ప్రతినిధి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో వాయుగుండం వేళ సముద్రంలో చిక్కుకుని మరణించిన మత్స్యకారుల కుటుంబాలను, పెళ్లి వ్యాన్ బోల్తా పడ్డ ప్రమాదంలో మత్యువాత పడ్డ వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. వేట నిషేధ కాలం ముగిసిన వెంటనే అల్పపీడనం ఏర్పడినా ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు చేయకపోవడంవల్లే మత్స్యకారులు వేటకు బలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు పార్టీపరంగా అండగా నిలుస్తామని, ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం అందించేలా ఒత్తిడి చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి మృతుని ఇంటికీ వెళ్లి కుటుంబసభ్యులను పలకరించి వారికి కొండంత ధైర్యాన్నిచ్చారు.శుక్రవారం కాకినాడ పర్లోపేటకు చెందిన మత్స్యకారుడు కంటుముర్చి వెంకటేశ్వర్రావు కుటుంబాన్ని పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి -
అప్పుల బాధతోయువరైతు ఆత్మహత్య
రెంజల్ : అప్పుల బాధలు భరించలేక మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన ప్రవీణ్‌రెడ్డి(28) అనే యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.మంగళవారం రాత్రి కుటుంబీకులు పక్క ఇళ్లల్లో టీవీ సీరియల్ చూసేందుకు వెళ్లిన సమయంలో ప్రవీణ్‌రెడ్డి ఇంట్లో దూలానికి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య సుమలతతో పాటు కూతురు, కుమారుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పెట్టుబడులు దక్కక.. పంటలపై చేసిన అప్పులు తీర్చలేక యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతీ యోటా పెరుగుతున్న పెట్టుబడులు, దీనికి తోడు ప్రకృతి వైపరిత్యాలు రైతన్నలను వెం టాడుతుండటంతో చిన్నకారు రైతన్నలు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. గత సీజన్లో పంటలు పండక తీవ్రంగా నష్టపోయిన మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందన ప్రవీన్‌రెడ్డి (28) అనే రైతు మంగళవారం రాత్రి ఇంట్లో దూలానికి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగున్నర ఎకరాల భూమి కలిగిన ప్రవీణ్‌రెడ్డికి ఇటీవల పంటల పై చేసిన అప్పులు పెరిగాయి. తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పొలాల్లో వేసిన బోర్లు పడకపోవడంతో అప్పులు రూ. 2.75 లక్షల వరకు పెరిగాయని స్థానికులు వివరించారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పంట ఎండింది.. గుండె పగిలింది
కరెంట్ కోతలతో కళ్ల ముందటే పంట ఎండిపోవట్టే.. వేసిన బోర్ల అప్పులు ఎక్కువయ్యే. బ్యాంకుల రుణమేమో మాఫీ కాలే. భవిష్యత్తు అంతా అంధకారమే కనిపించే. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువరైతు బతుకు మీద ఆశ వదులుకున్నాడు. చేనులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబాన్ని అనాధను చేశాడు. భార్య, పిల్లలను వదిలి కానరాని లోకాలకు పయనమయ్యాడు. * పాల్వంచలో యువరైతు ఆత్మహత్య * అప్పులు ఎక్కువ కావడం * రుణం మాఫీ కాకపోవడంతో మనస్తాపం * పంట చేనులోనే ఉరికి వేలాడిన అన్నదాత మాచారెడ్డి: ఆరుగాలం శ్రమించిన పంట ఎండిపోయింది. బోర్లు తవ్వించిన అప్పు వేధించసాగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సం ఘటన సోమవారం మాచారెడ్డి మండలం పా ల్వంచ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాకలి నర్సింహులు (35) అనే రైతు తన సొంత చెరుకు తోట లో చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించాడు. మండల కేంద్రంలో ని స్టేట్ బ్యాంక్‌లో నర్సింహులకు రూ.45 వేల పంట రుణం ఉంది. సోమవారం బ్యాంకుకు వెళ్లిన ఆయన తన రుణం మాఫీ అయ్యిందా అని బ్యాంకు అధికారులను అడిగాడు. కాలేదని వారు సమాధానం చెప్పారు.దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.‘అప్పులైన యి.బ్యాంక్‌ల రుణంమాఫీకాలేదు.. కొత్త రుణం రాలేదు.. పంట ఎండిపోవట్టే.. పిల్లలు చిన్నగున్నరు ఏం చేద్దాం’ అంటూ తీవ్ర ఆందోళనకు గురయ్యాడని భార్య లక్ష్మి రోధిస్తూ చె ప్పింది. నర్సింహులు ఆయన సోదరుడు బాల్‌రాజు కలిసి నాలుగు ఎకరాల భూమిలో ఓ బోరు తవ్వించారు. ఆ బోరు నీరు తక్కువగా పోయడంతో నర్సింహులు మరో మూడుబోర్లు అదనంగా వేయించాడు. అవి వట్టిపోయాయి. రూ.లక్ష వరకు అప్పు అయ్యింది. ఎకరం చెరుకు, మరో ఎకరం వరి సాగుచేశాడు. కరెంట్ కోతలతో చెరుకుతోట సగం వరకు ఎండిపోయింది. సాగుచేసిన వరిపంట సైతం ఎండిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతు నర్సిం హులుకు ఉరి తాడే దిక్కయ్యింది. చనిపోతున్నానని చెప్పి... నర్సింహులు చనిపోవడానికి ముందు సమగ్ర సర్వేలో భాగంగా వచ్చిన తప్పు ఒప్పులను సరి దిద్దుకోవడానికి గ్రామపంచాయతీ వద్ద ఉన్న గ్రామస్తుడు పరశురాములుకు చూయించాడు. ఇదేమి సర్వేనో ఏమోనని మదనపడి, ఓ దిక్కు అప్పులు పెరిగిపోతున్నయి. రుణమాఫీ కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు పరశురాము లు తెలిపారు. గ్రామపంచాయతీ నుంచి నేరు గా గ్రామ శివారులో ఉన్న తన పొలం వద్దకు వెళ్లాడు. వెళ్లిన మరుక్షణమే గ్రామానికి చెందిన గ్రామసేవకుడు మశ్చందర్కు ఫోన్ చేశాడు. ‘‘కాకా నాకు బతకాల నిపిస్తలేదు చనిపోతు న్నా. రుణమాఫీ కాలేదు.. పంట ఎండిపోతుం ది. కరెంట్ ఎద్దెం మద్దెంగా ఉంది, నేను ఉరి వేసుకుని చచ్చిపోతున్నా. నా భార్య, పిల్లలు పయిలం’’ అంటూ నర్సింహు లు చెప్పడంతో మశ్చందర్ వద్దని వారించాడు. ‘ఎందుకు సచ్చిపోతావ్ బిడ్డా, అందరం బతక లేమా నువ్వుకూడా గట్లనే బతుకు, చిన్న చిన్న పిల్లలున్నరు అద్దు బిడ్డా’ అని బదులివ్వడంతో నర్సింహులు ఫోన్ కట్ చేశాడు. ఆందోళన చెం దిన ఆయన గ్రామస్తులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకునేలోగానే నర్సింహులు టేకు చెట్టుకు విగత జీవై కనిపిం చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న భార్య లక్ష్మి ‘‘చేనుకాడికి పోయివస్తానని శవమయ్యా వా’’ అంటూ బోరున విలపించింది. లోకం పోకడ తెలియని చిన్నారులు.. ‘‘నాయిన చెట్టు ఎక్కాడా అమ్మా’’ అంటూ అమాయకంగా అడగడంతో అక్కడ ఉన్న హృదయా లు కలచివేశాయి. నర్సింహులుకు భార్య లక్ష్మి, కూతురు అశ్విని(09), కుమారుడు నితిన్(06) ఉన్నారు. మాచారెడ్డి ఎస్ఐ ప్రసాద్‌రావు, ఏఎస్ఐ ముజీ బ్, హెడ్‌కానిస్టేబుల్ మురళి శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహంతో రైతుల ఆందోళన నర్సింహులు మృతదేహంతో శనివారం సాయంత్రం పాల్వంచ గ్రామం వద్ద కా మారెడ్డి-సిరిసిల్ల రహదారిపై రైతులు రా స్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్య తిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. రుణమాఫీ కాకపోవడం, కరెంట్ కొరత కారణంగా పంటలు ఎండిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రుణమాఫీ, విద్యుత్ సమస్య లు తీర్చాలని, లేకపోతే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామని రైతులు హెచ్చరించారు. పాల్వంచ ఎంపీటీసీ సభ్యుడు గ్యార చంద్రయ్య, ఉపసర్పంచ్ అంజియాదవ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నారాగౌడ్ రైతులకు సంఘీభావం తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.