జిన్నారం/పటాన్‌చెరు టౌన్ న్యూస్‌లైన్ : ఒంటిపై ఉన్న బంగారు చైన్, ఉంగరం కోసం తోటి స్నేహితుడి తలపై రాయితో మోది పాశవికంగా హత్య చేశాడో మిత్రుడు. మెదక్ జిల్లా జిన్నా రం మండలం బొల్లారం శివారులోని ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కన గల దేవతలగుట్ట వద్ద జరిగిన హత్య కేసు మిస్టరీని పటన్‌చెరు పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వారి కథనం మే రకు.. పటాన్‌చెరులోని శాంతినగర్ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్న మల్లేశం.. అమీన్‌పూర్ వీఆర్‌ఓగా పనిచేస్తున్నారు.
మల్లేష్‌కు రెండో సంతానమైన అనిల్‌కుమార్ ఇం టర్‌లో ఓ సబ్జెక్టు తప్పి ఇంట్లోనే ఉంటున్నాడు. పటాన్‌చెరు మండలం ఇంద్రే శం గ్రామానికి చెందిన నరేందర్‌గౌడ్ పటాన్‌చెరు ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. ఇదిలా ఉండగా అనిల్, నరేందర్‌లు ఇ రువురూ స్నేహితులు. ఈ క్రమంలో వీరి ద్దరూ ఈ నెల 6న జిన్నారం మండలం బొల్లారం శివారులోని దేవతలగుట్ట వద్ద మద్యం సేవించారు. అయితే తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని, ఎలాగైనా డబ్బును సర్దాలని నరేందర్‌గౌడ్ మిత్రుడైన అనిల్‌కుమార్‌ను కోరా డు. అయితే తన వద్ద డబ్బు లేదని స మాధానం ఇవ్వగా మెడలో ఉన్న గొలుసు, చేతికి ఉన్న ఉంగరాన్ని ఇవ్వాల ని నరేందర్ కోరాడు. ఇందుకు అనిల్‌కుమార్ నిరాకరించాడు. దీంతో స్నేహితుడి తీరును ఆగ్రహిస్తూ నరేందర్ వాదనకు దిగాడు. అంతలోనే పక్కనే ఉన్న రాయితో అనిల్‌కుమార్ తలపై మోదా డు నరేందర్‌గౌడ్. అనంతరం అతడి మె డలో ఉన్న గొలుసు, చేతికున్న ఉంగరా న్ని తీసుకుని అనిల్‌కుమార్ మృతదేహా న్ని రాళ్ల మధ్యలో పడేసి వెళ్లిపోయాడు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 7న అని ల్‌కుమార్ కనిపించటం లేదని అతని సోదరుడు పటాన్‌చెరు పీఎస్‌లో ఫిర్యా దు చేశాడు. ఈ విషయమై అనిల్‌కుమార్ సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగాా వివరాలను పోలీసులు సేకరించారు. అనుమానంతో నరేందర్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెల్లైడె ంది. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. ఐదు రోజుల క్రితమే అనిల్‌ను హత్య చేయడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. దీంతో హత్య జరిగిన స్థలంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని రామచంద్రాపురం డీఎస్పీ మధుసూధన్‌రెడ్డి, పటాన్‌చెరు సీఐ శంకర్‌రెడ్డి, బొల్లారం ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి సందర్శించారు.
బంగారం కోసమే స్నేహితుడి హత్య
Published Tue, Nov 12 2013 12:10 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM
Advertisement
Advertisement