ఆ రోజు... భయం... భయం!
అందమైన ప్రేమకథ నేపథ్యంలో, హారర్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఫిబ్రవరి 14’. బేబీ ప్రేమ, క్రిష్, ఈషా ముఖ్యతారలుగా సత్యరావ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.ఎస్. ఫణీంద్ర దర్శకుడు. ప్రవీణ్‌రెడ్డి స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ‘రసమయి’ బాలకిషన్ పాటలను ఆవిష్కరించారు. ‘‘గర్భంతో ఉన్న తన భార్యతో భర్త ఎలా ప్రవర్తించాడనే హారర్ కథాంశంతో సాగే సినిమా ఇది. ఫిబ్రవరి 14న ఏం జరిగింది? ఎలాంటి భయానక సంఘటనలు చోటు చేసుకున్నాయనేది ఈ చిత్రంలో ప్రధాన అంశం’’ అని దర్శకుడు తెలిపారు. హారర్ చిత్రాల హవా నడుస్తున్న ఈ రోజుల్లో ఈ సినిమా మంచి విజయం సాధించాలని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ‘రోషం’ బాలు, దిలీప్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.