సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఎంపీలు, ఎమ్మెల్యేలంతా పల్లెబాట పట్టారు. ఐదేళ్ల తమ పదవీకాలం ముగుస్తుండడంతో ఉన్న కాస్త సమయంలో ప్రజలకు మరింత చేరువ కావడానికి అభివృద్ధి పనులను ఎత్తుకున్నారు. శరవేగంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ హడావుడి సృష్టిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు రేపో మాపో షెడ్యూల్ రానున్నందున కోడ్ అమలులోకి వస్తుందనే తొందరలో కేవలం నాలుగు రోజుల్లో జిల్లావ్యాప్తంగా సుమారు రూ.150 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈలోగా మున్సిపల్ ఎన్నికలు తెరమీదకు రావడం, సోమవారం షెడ్యూల్ వెలువడనుందనే సమాచారంతో ముందుగా పట్టణాలు, నగరాల్లో శంకుస్థాపనలపై దృష్టిసారించారు.
మొత్తానికి ఆఖరి రీలులో ప్రజాప్రతినిధులంతా గ్రామాల్లో సందడి చేస్తున్నారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు, కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పశువుల ఆసుపత్రి ఆవరణ లో రూ.4 కోట్లతో నిర్మించనున్న వెటర్నరీ పాలి క్లినిక్ భవనానికి ఆదివారం ఎంపీ పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. రూ.60 లక్షలతో నిర్మించిన హజ్‌హౌస్ భవనాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ప్రారంభించారు. రూ.3 కోట్లతో నిర్మించిన కేంద్ర సహకార బ్యాంక్ నూతన భవనాన్ని ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ ప్రారంభించారు. నాగులమల్యాలలో రూ.1.10 కోట్లతో సీసీ రోడ్డు, బాహుపేటలో రూ.4 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమిపూజ నిర్వహించారు. నగరంలో రూ.80 లక్షలతో కాపువాడ చౌరస్తా నుంచి వరాహస్వామి దేవాల యం రోడ్డు నిర్మాణానికి, 37 డివిజన్‌లో రూ.13 లక్షలతో సీసీ రోడ్డు నిరా్మాణ పనులకు కమలాకర్ శంకుస్థాపన చేశారు.
జగిత్యాల
రూ.18 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాల, వసతిభవన నిర్మాణ పనులకు ఎంపీ మధుయాష్కి, ఎమ్మెల్యే ఎల్.రమణ శంకుస్థాపన చేశారు. పొలాసలో రూ.6 కోట్లతో నిర్మించనున్న మంచినీటి పథకానికి, పొరండ్లలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కండ్లపల్లిలో నిర్మించిన మోడల్ స్కూల్ భవనం, రూ.1.50 కోట్లతో నిర్మించిన కస్తూరిబా భవనాన్ని ప్రారంభించారు. మొత్తంగా నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.30 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు.
హుస్నాబాద్
సైదాపూర్‌లో రూ.2 కోట్లతో చేపట్టిన రోడ్లు, మంచినీటి పథకాలు, కమ్యునిటీ హాళ్లకు ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.కోటితో కోహెడ, చిగురుమామిడిల్లో ఆర్‌అండ్‌బీ, పీఆర్, ఎమ్మెల్యే నిధులతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. సోమవారం రూ.2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు భీమదేవరపల్లిలో ఎమ్మెల్యే శంకుస్థాపన చేయనున్నారు.
హుజూరాబాద్
హుజురాబాద్ పట్టణంలో రూ.1.50 కోట్లతో సీసీ రోడ్డు పనులను, రూ.50 లక్షలతో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి, జమ్మికుంటలో రూ.2.25 కోట్లతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ శంకుస్థాపన చేశారు.
కోరుట్ల
కోరుట్ల పట్టణంలో ఐలాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి ధర్మారం వరకు రూ.7 కోట్లతో బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు భూమిపూజ నిర్వహించారు. మండలంలోని మూడు గ్రామాల్లో వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
పెద్దపల్లి
ఎంపీ నిధులు రూ.4 లక్షలతో చేపట్టిన రోడ్డుకు టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీ దాసరి మనోహర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
మానకొండూర్
తిమ్మాపూర్ ఎల్‌ఎండీ కాలనీలో రూ.3 కోట్లతో నిర్మించనున్న సమీకృత సంక్షేమ వసతిగృహ భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ శంకుస్థాపన చేశారు. ఒక్కోటి రూ.6.50 లక్షల వ్యయంతో దాచారం, చొక్కారావుపల్లి, వడ్లూరులో నిర్మించనున్న అంగన్‌వాడి భవన నిర్మాణాలకు,ఖాసీంపేట, గన్నేరువరంలో రూ.4.70 లక్ష లు, రూ.2 లక్షలతో చేపట్టిన రోడ్లకు శంకుస్థాపన చేశారు. మానకొండూరు అన్నారంలో వాటర్‌ట్యాంక్, యాదవ కమ్యునిటి హాల్ భవనం, అంగన్‌వాడి భవనం, ఊటూరులో శుద్దజల ప్లాంట్, కొండపల్కల పంచాయతి భవనాన్ని, ముంజంపల్లిలో ఎస్సీ కమ్యునిటీ హాల్ ప్రారంభించారు. లలితాపూర్‌లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి, వన్నారంలో తారురోడ్డుకు, గట్టుదుద్దెనపల్లి నుంచి వన్నారంకు తారురోడ్డు రెన్యువల్, మానకొండూరులో అంబేడ్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
చొప్పదండి
రుక్మాపూర్‌లో రూ.13 కోట్లతో హాస్టల్ భవన నిర్మాణానికి, రూ.3 కోట్లతో సమీకృత వసతి భవనానికి, రూ.కోటితో బహదూర్‌ఖాన్‌పేట నుంచి వెదురుగట్ట వరకు తారురోడ్డు నిర్మాణానికి ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యలు శంకుస్థాపన చేశారు. చివరలో కూడా రామగుండం, సిరిసిల్ల, వేములవాడ , ధర్మపరి నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగకపోవడం విశేషం.
వుంథని
వుుత్తారంలో రూ.1 కోటితో నిర్మించిన కస్తూరిబా హాస్టల్ భవనాన్ని, రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే, వూజీ వుంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. వుంథనిలో రూ.8 లక్షలతో నిర్మించిన ఎస్సీ వూల కవుు్యనిటీ హాల్‌ను ప్రారంభించారు. కవూన్‌పూర్ వుండల కేంద్రంలో రూ.18 లక్షల నాలుగు సీసీ రోడ్లు, రూ.1.50 లక్షతో ఒక వుంచినీటి పథకానికి, వుహాదేవపూర్‌లో రూ.11 లక్షలతో చేపట్టిన వుూడు వుసీదుల నిర్మాణానికి, రూ.4 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డుకు శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు.
వేములవాడ
చందుర్తి మండలంలో ఆదివారం ఒక్కరోజే రూ. 46.40 లక్షల అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మె ల్యే సిహెచ్.రమేష్‌బాబు భూమిపూజ నిర్వహించారు. రుద్రంగిలో రూ.5లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, రూ.6 లక్షలతో అంగన్‌వాడి భవనం, రూ.లక్షతో రజక కమ్యూనిటీ హాల్, మల్యాలలో సీసీ రోడ్డు, పెరక కమ్యునిటి భవన్, రూ.5 లక్షలతో రామారావుపల్లిలో సీసీ రోడ్డు, కిష్టంపేటలో రూ.1.50 లక్షలతో సీసీ రోడ్డు, రూ.4లక్ష లతో వాటర్‌ప్లాంట్, జోగాపూర్‌లో రూ.2లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.
చివరి చాన్స్..!
Published Mon, Mar 3 2014 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM
Advertisement
Advertisement