
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిది బాధపెట్టించే తత్వమే కానీ బాధపడే మనస్తత్వం కాదని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు కన్నీళ్లు పెట్టిస్తారే తప్ప.. పెట్టుకోరని ధ్వజమెత్తారు. తన భార్యను ఎవరో ఏదో అన్నట్లు చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని, ప్రజల సానుభూతి కోసమే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఒక్కరోజైనా చంద్రబాబు విలువతో కూడిన రాజకీయం చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎప్పుడూ పదవి కావాలని, పదవి కోసం ఆయన ఎవరినైన వాడుకుంటారని దుయ్యబట్టారు.
చదవండి: చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు: మంత్రి బాలినేని
‘టీడీపీ సభ్యులే వ్యక్తిగతంగా విమర్శించడం ప్రారంభించారు. బాబాయ్ గొడ్డలి అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశాచారు. టీడీపీ కామెంట్లకు మావాళ్లు స్పందించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి అసెంబ్లీలో ఎక్కడా చర్చలోకి రాలేదు. భువనేశ్వరి గురించి మాట్లాడినట్లు తప్పుడు చంద్రబాబు ప్రచారం మొదలు పెట్టారు. భువనేశ్వరిపై ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోం’ అని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.
చదవండి: ‘బాలకృష్ణ అమాయకుడు.. చంద్రబాబు ఏం చేప్తే అది నమ్ముతాడు’
Comments
Please login to add a commentAdd a comment