![Puri Jagannath Rath Yatra is Today - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/14/rath.jpg.webp?itok=-4wv9uaq)
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని రథయాత్ర శనివారం ప్రారంభం కానుంది. ప్రధాన దేవస్థానం నెలకొన్న పూరీ శ్రీ మందిరంలో యాత్ర నిర్వహణకు దేవస్థానం, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేశాయి. శుక్రవారం సాయంత్రం జగన్నాథుని దేవస్థానం నుంచి ఆజ్ఞామాల రథ నిర్మాణ ప్రాంగణానికి చేరటంతో రథాలను మలుపు తిప్పారు.
ప్రధాన దేవస్థానం నుంచి మూల విరాట్లను వరుస క్రమంలో రథాలపైకి తరలించేందుకు వీలుగా ముందురోజు రథాలను మలుపు తిప్పటం ఆచారం. కాగా, కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా సర్వ మానవాళి జగన్నాథుని యాత్రను తిలకిస్తున్నట్లుగా.. సైకత శిల్పి మానస్‌కుమార్ సాహు చిత్రీకరించిన దృశ్యం ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment