Puri Jagannath Ratha Yatra
-
మూడో గది రహస్యం.. 46 ఏళ్ల తర్వాత ఇలా! తెరుచుకున్న పూరీ రత్నభాండాగారం (ఫొటోలు)
-
విజయవాడ : శోభాయమానంగా శ్రీ జగన్నాథ రథయాత్ర (ఫొటోలు)
-
ఒడిశా జగన్నాథుడి రథయాత్రలో అపశృతి
ఒడిశా జగన్నాథుడి రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథం లాగుతుండగా ఒక్కోసారిగా తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం పూరీ శంఖారాచార్య స్వామి నిశ్చలనానంద సరస్వతిలు జగన్నాథుడిని,దేవీ శుభద్రను సందర్శించుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5.20 గంటలకు రథయాత్ర ప్రారంభమైంది. అయితే పూరీలోని గ్రాండ్ రోడ్ బారా దండాలో సంప్రదాయబద్ధంగా బలభద్ర స్వామి రథాన్ని లాగుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.#WATCH | Odisha | Devotees throng in large numbers to witness the two-day Lord Jagannath Yatra that begins today in Puri. pic.twitter.com/Z65j3iM2H1— ANI (@ANI) July 7, 2024 -
పూరీ జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధం.. భారీగా తరలివచ్చిన భక్తులు
Live Updates..🙏జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్.🙏హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.🙏ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం అందరిది.. సర్వమతాలకు స్వేచ్ఛ, అవకాశాలను ఇస్తుంది. మా ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటిస్తుంది. ఇస్కాన్ సంస్థ ప్రార్ధనలతో రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా. మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు కూడా పాల్గొన్నారు. 🙏 నేడు ఒడిశాలోని పూరీ జగన్నాథుడి విశ్వప్రసిద్ద రథయాత్ర జరుగనుంది. ఈ వేడుకలను చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పూరీ చేరుకున్నారు. రథయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. #WATCH | Odisha: Two-day Lord Jagannath Rath Yatra in Puri to commence today. Along with lakhs of devotees, President Droupadi Murmu will also attend the annual festival. pic.twitter.com/7Q9WYQCJw5— ANI (@ANI) July 7, 2024 🙏ఇంత వరకు భారత రాష్ట్రపతులు ఎవరూ పూరీ రథయాత్రలో పాల్గొనలేదు. తొలిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు. ఆమె గవర్నర్ రఘుబర్దాస్తో కలిసి సుభద్రమ్మ రథం లాగుతారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. రెండురోజుల రథయాత్రలో 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకొని పూరీ పట్టణానికి మూడంచెల భద్రత కల్పించారు. #WATCH | Odisha: Security around Lord Jagannath temple in Puri increased ahead of the Rath Yatra which will commence today. pic.twitter.com/ExMFCNfAuu— ANI (@ANI) July 7, 2024 🙏కాగా, నేడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా వెళ్లి పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దివ్య(దారు) విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై మూడు కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. #WATCH | Bhubaneswar: Odisha-based miniature artist L Eswar Rao crafts an eco-friendly chariot in connection with the Jagannath Puri Rath Yatra. (06.07) pic.twitter.com/Hgpxl8Eym2— ANI (@ANI) July 7, 2024 🙏ఇక, ఈసారి రథయాత్రకు ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకేరోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. మూడు వేడుకలు ఆదివారం ఉండడంతో జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్ రథాలు ఆదివారం సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకొనే పరిస్థితి లేదు. #WATCH | Ahmedabad, Gujarat: Union Home Minister Amit Shah along with his wife Sonal Shah at Jagannath Temple. pic.twitter.com/FQ6FeFytyz— ANI (@ANI) July 6, 2024 🙏మరోవైపు.. పూరీ రథయాత్ర నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని జగన్నాథుని ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని పూరీ ఆలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
జయజయధ్వానాల నడుమ పూరి జగన్నాథుని రథయాత్ర (ఫొటోలు)
-
జగన్నాథ రథయాత్ర జనసంద్రంగా మారిన పూరీ
-
పూరి జగన్నాథుడు: మూల విరాటుల అంగాలకు ముప్పు? వినకుంటే విపత్తే!
భువనేశ్వర్: మూల విరాటుల అంగాలకు ముప్పు వాటిల్లే విపత్కర చర్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. శ్రీమందిరం సింహద్వారం ఆవరణలో ఇటీవల తారు రోడ్డు పనులు చేపట్టారు. ప్రస్తుత నిర్మాణ శైలి రథయాత్ర ప్రక్రియలో రత్నవేదిక నుంచి యాత్రకు తరలివచ్చే మూలవిరాట్ల శ్రీఅంగాల (విగ్రహాల)కు భారీ ముప్పు కలిగించే రీతిలో తారస పడుతున్నాయి. సువిశాల బొడొదండొ మార్గం పొడవునా తారుపూత పూస్తున్నారు. ఈ సందర్భంగా స్వల్ప విభజనతో రెండు అంచెల రోడ్డుగా మలుస్తున్నట్లు వర్ధమాన నిర్మాణశైలి ప్రతిబింబిస్తుంది. ఈ విభజన రథాల కదలికకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. అలాగే శ్రీమందిరం గర్భగుడి రత్నవేదిక నుంచి మూలవిరాట్ లను రథాల పైకి తరలించే పొహొండి కార్యక్రమంలో కాలు జారడం వంటి చిరు ప్రమాదాలతో పెద్ద తప్పిదాలను ప్రేరేపిస్తాయని కలవర పడుతున్నారు. యాత్ర పొడవునా పలుమార్లు 3 భారీ రథాలను మలుపు తిప్పాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో నిర్మాణశైలి తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. యాత్ర నిర్వహణ దృష్టిలో పెట్టుకుని సింహద్వారం ఆవరణ, బొడొదండొ మార్గం తారుపూత పనులు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విభజన, ఎగుడు దిగుడులు తొలగించాలని శ్రీమందిరం పాలకమండలి సీనియర్ సభ్యుడు దుర్గాప్రసాద్ దాస్ మహాపాత్ర కోరారు. దీనిపై ప్రధాన పాలనాధికారి (సీఏఓ) దృష్టి సారించాలన్నారు. రథ వాకిలిలో భద్రత.. రథయాత్ర ఆద్యంతాల్లో మూల విరాట్ల రథాలు శ్రీమందిరం సింహద్వారం ముంగిట నిలుపుతారు. యాత్ర ప్రారంభం పురస్కరించుకుని ఈ వాకిలిలో రథ ప్రతిష్ట ముగించి మూల విరాట్లను గొట్టి పొహొండి ప్రక్రియలో ఒక్కొక్కటిగా రథాల పైకి తరలిస్తారు. అలాగే యాత్ర చిట్టచివరి ఘట్టం నీలాద్రి విజే పురస్కరించుకుని రథాలపై ఆసీనులైన మూర్తులను సురక్షితంగా శ్రీమందిరం రత్న వేదికకు తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రాంగణంలో సిద్ధం చేసిన తారురోడ్డు ఉపరితలమంతా ఎగుడు దిగు డుగా తయారైంది. ఈ పరిస్థితిని సవరించి పూర్తిగా చదును చేయకుంటే గొట్టి పొహండి, నీలాద్రి విజే పురస్కరించుకుని జరిగే మూల విరాట్ల తరలింపు సందర్భంగా కాలు జారుడు వంటి ప్రమాదాలతో మూల విరాట్ల భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం తలెత్తుతుంది. యాత్ర ఆద్యంతాలు మలుపు తిప్పే పరిస్థితుల్లో చకచకా తరలే రథాల కదలికకు ఆటంకం కలగవచ్చు. ఈ అభ్యంతరాల దృష్ట్యా రోడ్డు చదును చేసేందుకు సంబంధిత అధికారులు సుముఖంగా స్పందించారు. దశమహాపాత్ర నిర్మాణ సంస్థ అధికారులు ఈ నెలలోగా ఎగుడు దిగుడులు తొలగించి కొత్తగా నిర్మితం అవుతున్న రహదారి చదును చేసే పనులు పూర్తి చేస్తామని అనుబంధ అధికార వర్గాలు హామీ ఇచ్చారు. సర్దుబాటుకు ఆదేశాలు.. తారుపూతలో ఎగుడు దిగుడుల కారణంగా యాత్ర ఆద్యంతాల్లో రథాన్ని మలుపు తిప్పడంలో పలు ఇబ్బందులు తలెత్తుతాయని అనుబంధ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అభ్యంతరాలను ఆలయ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పూరీ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో నిర్మాణ శైలిలో స్వల్ప మార్పుతో అనుకూల రీతిలో సర్దుబాటు చేయాలని నిర్మాణ సంస్థ ఓబీసీసీని ఆదేశించారు. రథశాల ప్రాంగణంలో.. శ్రీమందిరం కార్యాలయం పరిసరాల్లో స్వామి వార్షిక రథయాత్ర కోసం కొత్త రథాల తయారీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రథాల పలు భాగాల నిర్మాణం అంచెలంచెలుగా పూర్తి కావడంతో క్రమ పద్ధతిలో అమర్చి, రథం రూపుదిద్దుతారు. అనంతరం ఈ ప్రాంగణం నుంచి మలుపు తిప్పి శ్రీమందిరం సింహద్వారం ఆవరణకు తరలించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాంగణంలో తారురోడ్డుపై రాళ్లు తేలుతున్నాయి. రథ భాగాల అమరిక పురస్కరించుకుని భారీ కొయ్య భాగాల తరలింపు, రథాల మలుపు పురస్కరించుకుని రోడ్డుపై తేలియాడుతున్న రాళ్లతో ఊహాతీత ప్రమాదాలు తలెత్తే అవకాశం లేకపోలేదని భొయి సేవకవర్గం ప్రముఖుడు సర్దార్ రవిభొయి తెలిపారు. ఈ ప్రాంగణంలో తారురోడ్డుపై రాళ్లు తొలగించి చదును చేయడం అనివార్యంగా పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు తెలియజేసినట్లు వివరించారు. -
అహ్మదాబాద్లో జగన్నాథ రథయాత్ర
-
వైభవంగా జగన్నాథుని రథయాత్ర
పూరీ (ఒడిశా): ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర వైభవోపేతంగా మొదలైంది. శుక్రవారం ఉదయం మొదలైన ఈ యాత్ర తొమ్మిది రోజులు సాగుతుంది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ యాత్రను నిర్వహించలేదు. దీంతో ఈ యాత్రకి భక్తులు వెల్లువెత్తారు. పూరీ పట్టణం భక్తజన సంద్రంగా మారింది. జై జగన్నాథ, హరిబోల్ నామస్మరణతో చుట్టుపక్కల ప్రాంతాలు మారుమోగాయి.అంతరాలయం నుంచి చతుర్థా మూర్తులు బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుడు, సుదర్శనునితో పాటు మదన మోహనుడు, రామ, కృష్ణ ఉత్సవ మూర్తులను వరుస క్రమంలో రథాలపైకి తరలించారు. మంగళస్నానాలు, సకలధూపం, హారతి వంటివి శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి, ఆయన శిష్యులు కొందరు జగన్నాథుడిని తొలి దర్శనం చేసుకున్నారు. పూరీ గజపతి వంశం మహారాజు దివ్యసింగ్ దేబ్ బంగారు చీపురుతో రథాలన్నీ శుభ్రం చేశారు. ఆ దేవదేవుడి ముందు అందరూ సమానమేనన్న సందేశాన్ని ఇవ్వడానికే మహరాజులే ఈ రథాలను ఊడుస్తారు. ఏడాదిపాటు పూరీ జగన్నాథ ఆలయ గర్భగుడిలో ఉండే సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు ఆషాఢ మాసం శుక్లపక్ష విదియనాడు ఈ యాత్ర మొదలవుతుంది. మొదట తాళధ్వజ రథంపై బలభద్రుడుని తీసుకువచ్చారు. ఆ తర్వాత దర్పదళన్ రథంపై సుభద్ర, చివరగా నందిఘోష్ రథంపై జగన్నాథుడిని ఊరేగింపుగా గుండిచా మందిరానికి బయల్దేరాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, గవర్నర్ గణేషిలాల్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరై లాంఛనంగా రథాల్ని లాగి యాత్రను ప్రారంభించారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథ రథయాత్ర దేశవ్యాప్తంగా పలు ఇతర నగరాల్లో కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. యాత్రను పురస్కరించుకుని మూల విరాటులను వరుస క్రమంలో రథాలపైకి ఎక్కించి, దించడం గొట్టి పొహొండిగా వ్యవహరిస్తారు. గుండిచా మందిరం అడపా మండపంపై కొలువు దీరిన జగన్నాథుని దర్శించుకుంటే జీవితం పావనం అవుతుందని భక్తులు విశ్వాసం. ఈ ప్రాంగణంలో స్వామికి నివేదించిన అన్న ప్రసాదాలు(ఒభొడా) లభించడం పుణ్యప్రదంగా భావిస్తారు. శ్రీమందిరానికి యథాతధంగా తరలి వచ్చేలోగా జరిగే ప్రత్యేక ఉత్సవాలు యాత్రికుల్ని మరింత ఉత్సాహపరుస్తాయి. వీటిలో హిరా పంచమి, సంధ్యా దర్శనం(నవమి), మారు రథయాత్ర(బహుడా), హరి శయన ఏకాదశి(స్వర్ణాలంకారం), అధర సేవ, గరుడ శయనసేవ, నీలాద్రి విజే ప్రధానమైనవి. -
పూరీ జగన్నాథుడికి జన నీరాజనం (ఫొటోలు)
-
నేడు పూరీ జగన్నాథుని రథయాత్ర
-
నేడు జగన్నాథుని రథయాత్ర.. వారికి నో ఎంట్రీ
సాక్షి, భువనేశ్వర్/పూరీ: జగన్నాథుని రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతం. జనసంద్రం నడుమ అత్యంత వైభవంగా జరగాల్సిన యాత్ర ఆద్యంతాలు ఈ ఏడాది కరోనా కారణంగా జనసంచారం లేని వీధుల గుండా సోమవారం జరగబోతోంది. శ్రీమందిరం నుంచి గుండిచామందిరం వరకు సాగే ఈ యాత్రలో బొడొదండొ దారి పొడవునా బలభద్ర, సుభద్ర, జగ న్నాథుని రథాలను లాగే గొప్ప కార్యక్రమం చోటుచేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు. కోవిడ్ నియంత్రణ చర్యల దృష్ట్యా గతేడాది తరహాలో లాగే ఈసారి కూడా యాత్రకు భక్తులకు ప్రవేశం నిషేధిస్తూ చర్యలు చేపట్టడం గమనార్హం. సింహద్వారం ప్రాంగణంలో శానిటైజ్ చేస్తున్న సిబ్బంది పరిమితమైన సిబ్బంది, సేవాయత్లతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలతో యాత్ర నిర్వహిస్తారు. ఇప్పటికే యాత్రలో పాల్గొనే వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అంతకుముందే ఆయా వర్గాల వారికి కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేశారు. పోలీస్ సిబ్బంది, సేవాయత్లు మినహాయిస్తే యాత్ర కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు దాదాపు 1000 మంది అధికారులు వరకు అందుబాటులో ఉంటారని పూరీ జిల్లా కలెక్టర్ సమర్థ వర్మ తెలిపారు. సుప్రీంకోర్టు ఆంక్షలకు అనుగుణంగా రథాలను లాగేందుకు సేవాయత్లు, పోలీసులను మాత్రమే నియమించారు. ఈ క్రమంలో ఒక్కోరథం లాగేందుకు గరిష్టంగా 500 మంది ఉంటారని అధికారులు తెలిపారు. యాత్రా స్థలంలో మోహరించిన భద్రతా బలగాలు భద్రత కట్టుదిట్టం.. కరోనా కట్టడిలో భాగంగా యాత్రలో జనసమూహం నివారణకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పూరీ జిల్లా రైల్వేస్టేషన్ని చేరుకునే రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో పాటు పట్టణంలో కర్ఫ్యూ విధించి, పట్టణ సరిహద్దుల్లో ఇతర ప్రాంతాల వారి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఈ నెల 13వ తేదీ వరకు కర్ఫ్యూ నిబంధనలు కొనసాగుతాయి. ఇదిలా ఉండగా, రథయాత్ర ఏర్పాట్లను ఆదివారం సమీక్షించిన అదనపు డీజీపీ ఆర్.కె.శర్మ మాట్లాడుతూ పూరీ పట్టణాన్ని 12 జోన్లుగా విభజించి, 65 ప్లాటూన్ల పోలీస్ బలగాలతో భద్రతా చర్యలు చేపట్టామన్నారు. భద్రతా బలగాల్లో 10 మంది అదనపు పోలీస్ సూపరింటెండెంట్లు, 31 మంది డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్లు, 64 మంది ఇన్స్పెక్టర్లు, 222 మంది సహాయ సబ్–ఇన్స్పెక్టర్లు, సబ్–ఇన్స్పెక్టర్లుని నియమించినట్లు పూరీ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె.వి.సింఘ్ తెలిపారు. నందిఘోష్ రథం వద్దకు ఆజ్ఞామాలను తీసుకువెళ్తున్న దృశ్యం ఆజ్ఞామాలలతో పూజలు.. రథ నిర్మాణ శాల శ్రీమందిరం ఆవరణకు చేర్చిన జగన్నాథ, సుభద్ర, బలభద్రుని రథాలకు మూలవిరాట్ల దగ్గరి నుంచి బాజాభజంత్రీలు, మేళతా ళాలు, ఘంటానాదంతో తీసుకువచ్చిన ఆజ్ఞామాలలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక గోవర్థన పీఠాధిపతి, ఆదిశంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతికి ఆలయ సంప్రదాయ రీతిలో అధికారిక పిలుపు చేశారు. రథాలపై యాత్రకు ఆసీనులైన మూలవిరాట్లను తొలుత ఆదిశంకరాచార్యులు ప్రత్యక్షంగా దర్శించుకుని, స్వామి తొలి దర్శనం స్వీకరిస్తారు. సూక్ష్మ రథాలు.. సూపర్! జగన్నాథుని రథయాత్ర పురస్కరించుకుని, నగరంలోని శ్రీరామ్నగర్కి చెందిన ప్రముఖ శిల్పి హరగోవింద మహరణ తన కళా నైపుణ్యం ఉపయోగించి, బియ్యం, గోదుమలతో తయారు చేసిన బలభద్ర, సుభద్ర, జగన్నాథుని సూక్ష్మ రథాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రోజుకు మూడు గంటలు చొప్పున కష్టపడగా, వారం రోజుల్లో ఇవి పూర్తయినట్లు సమాచారం. – బరంపురం -
పూరీ రథయాత్ర: ఖరారైన షెడ్యూల్
భువనేశ్వర్/పూరీ: విశ్వవ్యాప్తంగా భక్తజనం కలిగిన పూరీ శ్రీ జగన్నాథుని వార్షిక రథయాత్ర షెడ్యూల్ ఖరారు చేసినట్లు శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి (సీఏఓ) డాక్టర్ క్రిషన్ కుమార్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో సోమవారం ఆయన 36 నియోగులతో సమావేశం నిర్వహించారు. స్నాన యాత్ర నుంచి నీలాద్రి విజే వరకు యాత్ర కార్యాచరణపై సమావేశంలో తీర్మానించామని యాత్ర కార్యాచరణపై సేవాయత్లు పూర్తి అంగీకారంతో ఏకాభ్రిపాయం వ్యక్తం చేశారని సమావేశం వివరాలను శ్రీ మందిరం సేవల విభాగం అడ్మినిస్ట్రేటర్ జితేంద్ర సాహు తెలిపారు. యాత్ర కార్యకలాపాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు జగన్నాథ సంస్కృత విద్యా పీఠం ప్రాంగణంలో ప్రత్యేక కోవిడ్ టీకా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల 22వ తేదీ వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. కోవిడ్–19 నెగెటివ్ నమోదైన వారిని మాత్రమే సేవలకు అనుమతిస్తారు. స్నానయాత్రకు 48 గంటలు ముందుగా కోవిడ్ పరీక్షల నిర్వహణ పూర్తి చేస్తారని తెలిపారు. స్నానయాత్ర ఈ నెల 24వ తేదీ పౌర్ణమి తిథి సందర్భంగా శ్రీ జగన్నాథుని స్నానయాత్ర జరగనుంది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి స్నానోత్సవం సన్నాహాలు ప్రారంభి స్తారు. ఉదయం 4 గంటలకు పొహండి కార్యక్రమం ముగిస్తారు. శ్రీ మందిరం రత్న వేదిక నుంచి మూల విరాట్లు (సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుడు) ఒక్కోటిగా బహిరంగ స్నాన మండపానికి తరలించడమే పొహండి కార్యక్రమం. 108 కలశాలతో మూల విరాట్లకు సుగంధ జలాభిషేకం నిర్వహించి గజానన అలంకరణ చేస్తారు. ఈ అలంకరణ ఉదయం 11 గంటలతో పూర్తి చేయాలని నిర్ణయించారు. తిరుగు పొహండి స్నాన మండపం నుంచి శ్రీ మందిరం లోనికి మూల విరాట్ల తరలింపు కార్యక్రమానికి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమయం నిర్ధారించారు. గుండిచా యాత్ర గండిచా యాత్రగా జగన్నాథుని రథయాత్ర ప్రసిద్ధి. ఈ ఏడాది జూలై 12వ తేదీన దీనిని నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటల నుంచి మూల విరాట్లను రథాలపైకి తరలించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. రథాలపై పూరీ గజపతి మహా రాజా దివ్య సింగ్ దేవ్ ఆలయ సంప్రదాయ రీతుల్లో ఛెరా పొంహరా (చీపురుతో రథాలు తుడిచే కార్యక్రమం) సేవలో పాల్గొంటారు. ఈ సేవకు మధ్యాహ్నం 2 గంటలకు సమయం కేటాయించారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి రథాలు లాగేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. బహుడా యాత్ర గుండిచా మందిరం నుంచి మూల విరాట్లు శ్రీ మందిరానికి తరలి వచ్చే యాత్ర బహుడా యాత్ర. దీనినే మారురథయాత్రగా పిలుస్తారు. జూలై 20వ తేదీన ఈ యాత్ర జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 గంటల వరకు పొహండి సేవలు నిర్వహించి మూలవిరాట్లు రథాలపైకి చేరగానే సాయంత్రం 4 గంటల నుంచి ఈ యాత్ర ప్రారంభిస్తారు. స్వర్ణాలంకారం ఏటా రథ యాత్రను పురస్కరించుకుని రథాలపై మూల విరాట్లకు స్వర్ణాలంకారం చేస్తారు. ఈ అలంకారం జూలై 21వ తేదీన నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించి 5.30 గంటల మధ్య స్వర్ణాలంకారం పూర్తి చేయాలని నిర్ణయించారు. నీలాద్రి విజే రథాలపై సేవలు, ఉత్సవాలు ముగియడంతో మూల విరాట్లు చివరగా శ్రీ మందిరం రత్నవేదికకు యథావిధిగా చేరుతాయి. రథాలపై నుంచి రత్న వేదికకు మూల విరాట్లు చేరే ఉత్సవం నీలాద్రి విజే. జూలై 23వ తేదీన ఈ ఉత్సవం జరుగుతుంది. రథాలపైకి తరలించే మూలవిరాట్లను తరలించడంతో మొదలై రత్న వేదికపైకి చేర్చడంతో వార్షిక రథయాత్రకు తెర పడుతుంది. చదవండి: పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి సిక్కు వర్గం నుంచే.. -
మరోసారి భక్తులు లేకుండానే పూరి జగన్నాథ రథయాత్ర!
భువనేశ్వర్: వచ్చే నెలలో జరగనున్న పూరి రథయాత్ర మరోసారి భక్తులు లేకుండానే జరగనుంది. కోవిడ్-19 కారణంగా భక్తులు లేకుండా రథయాత్ర జరగడం ఇది రెండోసారి. ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పి కె జెనా మాట్లాడుతూ.. పూర్తిగా టీకా డోసులు వేసుకున్న వారు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ రథయాత్రలో కోవిడ్ నెగటివ్ వచ్చిన సేవకులను మాత్రమే వాడనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ఏడాది సుప్రీంకోర్టు జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను ఈసారి కూడా పాటించనున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్పవాలకు కచ్చితంగా కోవిడ్-19 ప్రోటోకాల్స్ అమలయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. కాగా జగన్నాథ రథయాత్రకు కేవలం 500 మంది సేవకులు మాత్రమే రథాన్ని లాగేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఉత్సవాలను భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చునని తెలిపారు. కాగా ప్రస్తుతం పూరి ప్రాంతంలో ప్రతిరోజూ సుమారు 300 వరకు కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని జిల్లా కలెక్టర్ సమర్త్ వర్మ పేర్కొన్నారు. చదవండి: భంవురి ఉత్సవంతో మొదలైన రథం పనులు -
ప్రజల్లేకుండానే రథయాత్ర
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథోత్సవం నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనరాదని షరతు విధించింది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర సవ్యంగా సాగేందుకు ఆలయ యాజమాన్య కమిటీదే బాధ్యతని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మంచి రికార్డును పరిగణనలోకి తీసుకున్నాం. అదే జాగ్రత్త, అప్రమత్తతను రథయాత్ర విషయంలోనూ కనబరుస్తారని ఆశిస్తున్నాం. 18, 19వ శతాబ్దంలో ప్రబలిన ప్లేగు, కలరా ఇలాంటి ఉత్సవం వల్లే ప్రబలిందని మనకు చరిత్ర చెబుతోంది. దానిని దృష్టిలో ఉంచుకునే 18వ తేదీ నాటి తీర్పులో ఈ ఉత్సవంపై స్టే విధించాం. యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోకుంటే అలాంటి పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదముంది’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు ఒడిశాలోని పూరీ యాత్రపైనే తప్ప, ఆ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కాదని పేర్కొంది. గతంలో విధించిన స్టేను ఎత్తేయాలంటూ జగన్నాథ్ సంస్కృతి జన జాగరణ మంచ్, బీజేపీ నేత సంబిత్ మహాపాత్ర తదితరులు పిటిషన్లు వేయడం తెల్సిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బొపన్నల బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నాగ్పూర్లోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ ట్రస్టు సహకారంతో ప్రజారోగ్యంపై ఏ మాత్రం రాజీపడకుండా రథ యాత్రను చేపడతామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ హామీ ఇచ్చారు. కేంద్రం, ఆలయ యాజమాన్యంతో సమన్వయం చేసుకుని రథయాత్రను నిబంధనలకు లోబడి సజావుగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ రథయాత్ర 10 నుంచి 12 రోజుల పాటు కొనసాగనుంది. సుప్రీంకోర్టు నిబంధనలివీ ► రథయాత్ర సమయంలో పూరీ నగరంలో కర్ఫ్యూ విధించాలి. ► ప్రజలు ఇళ్లలోంచి బయటకురావద్దు ► ఒక్కో రథాన్ని 500 మంది (పోలీసులు, సిబ్బంది కలిపి) మాత్రమే లాగాలి. ► ఒక్కో రథం గంట సమయం తేడాతో ముందుకు కదలాలి. ► నగరంలోకి ప్రవేశించే అన్ని దారులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను మూసివేయాలి. ► తీర్పు వెలువడిన సోమవారం రాత్రి 8 గంటల నుంచే కర్ఫ్యూ అమలు. ► వీలైనంత ఎక్కువగా ఈ కార్యక్రమం కవరయ్యేలా మీడియాకు అనుమతి. ► రథాన్ని లాగే వారందరికీ కరోనాæ పరీక్షలు చేయాలి. రథయాత్రకు ముందు, రథయాత్ర సమయంలో, తర్వాతా వారు భౌతిక దూరం పాటించాలి. వారందరి ఆరోగ్య రికార్డులను నిర్వహించాలి. -
జగన్నాథుడి రథయాత్ర నిలిపివేత
న్యూఢిల్లీ/భువనేశ్వర్: జూన్ 23న ప్రారంభం కానున్న చారిత్రక పూరి జగన్నాథ్ రథయాత్ర, దాని అనుబంధ కార్యకలాపాలను కోవిడ్ కారణంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ‘ఒక వేళ రథయాత్ర జరిపితే జగన్నాథుడు మనల్ని క్షమించడు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యం కోసం ఈ ఏడాది ఒడిశాలోని పూరిలో రథయాత్రకు అనుమతించడం లేదని చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలోని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. రథయాత్రకు అనుమతిస్తే ఆ దేవుడు క్షమించడని చీఫ్ జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తి కారణంగా పూరీసహా రాష్ట్రంలో మరెక్కడా రథయాత్రలు నిర్వహించకుండా కట్టడిచేయాలని ఒడిశా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి రథయాత్రకు అనుమతిస్తే పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడతారనీ, ఈ కరోనా సమయంలో ఇది అత్యంత ప్రమాదకరమని వాదించారు. ఇది చాలా సీరియస్ అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై స్పందించేందుకు రేపటి వరకు సమయం కావాలని కోర్టును కోరారు. అయితే ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం జూన్ 30 వరకు ఎక్కువమంది ప్రజలు ఒక చోట హాజరు కాకూడదని ప్రకటించింది. ఎట్టకేలకు జూన్ 23న ప్రారంభం కానున్న రథయాత్రను కోర్టు నిలిపివేసింది. -
పూరీ జగన్నాథ్ రధయాత్ర కు సర్వం సిద్ధం
-
జన జగన్నాథుని రథయాత్ర
భగవంతుడు భక్తుల నడుమకు వచ్చి అంగరంగ వైభవంగా జరుపుకొనే అరుదైన అపురూపమైన వేడుక రథయాత్ర. ఏడాది పొడవునా గర్భాలయంలో కొలువుండే జగన్నాథుడు ఏడాదికోసారి సోదరీ సోదరులైన సుభద్ర, బలభద్రులతో కలసి రథాలను అధిరోహించి, జనం మధ్యకు వచ్చి జరుపుకొనే అపురూపమైన వేడుక రథయాత్ర. జగన్నాథుడు కొలువుతీరిన పూరీ క్షేత్రంలో రథయాత్ర వేడుకలు నేత్రపర్వంగా జరుగుతాయి. జగన్నాథుని రథయాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఒడిశాలోని పూరీ పట్టణంలో జరిగే రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత భారీస్థాయిలో జరిగే రథయాత్ర జగన్నాథునిదే. అక్షయ తృతీయ నాటితో నాంది జగన్నాథ రథయాత్ర ఏటా ఆషాఢ శుక్ల విదియ రోజున జరుగుతుంది. అయితే, రథయాత్ర వేడుక కోసం సన్నాహాలు మాత్రం వైశాఖ శుక్ల తదియ నాడు జరిగే అక్షయ తృతీయ పర్వదినం నుంచే మొదలవుతాయి. వేసవి తీవ్రత మొదలవడంతో విగ్రహాలకు చందన లేపనాన్ని పూస్తారు. దీనినే ‘గంధలేపన యాత్ర’ అని కూడా అంటారు. అక్షయ తృతీయ రోజున పూరీ క్షేత్రంలో రథాల తయారీ మొదలవుతుంది. పూరీ రాజు నివాసం ఎదుట ఆలయ ప్రధాన కార్యాలయానికి చేరువలో రథాల తయారీ కొనసాగుతుంది. అక్షయ తృతీయ నాటి నుంచి జగన్నాథుని చందనయాత్ర కూడా మొదలవుతుంది. చందనయాత్ర 42 రోజుల పాటు కొనసాగుతుంది. అక్షయ తృతీయనాడు మొదలయ్యే చందనయాత్రను రథయాత్ర వేడుకలకు నాందీ ప్రస్తావనగా చెప్పుకోవచ్చు. చందనయాత్ర ప్రథమార్ధాన్ని ‘బాహొరొ చందనయాత్ర’ (బహిర్ చందనయాత్ర) అంటారు. ఇది అక్షయ తృతీయ మొదలుకొని 21 రోజులు కొనసాగుతుంది. బహిర్ చందనయాత్రలో మదనమోహనుడైన జగన్నాథుడిని శ్రీదేవి భూదేవీ సమేతంగా పూరీ ఆలయ సింహద్వారం నుంచి ఊరేగింపుగా బయటకు తీసుకొచ్చి నరేంద్రతీర్థంలో పడవల్లో ఊరేగిస్తారు. చందనయాత్రలో బయటకు తీసుకొచ్చేవి ఉత్సవ విగ్రహాలు మాత్రమే. శ్రీదేవీ భూదేవీ సమేతుడైన మదనమోహనుడితో పాటు రామ కృష్ణులను, నంద భద్ర అనే వారి ధనుస్సులను, పంచపాండవుల స్వరూపాలుగా భావించే ఐదు శివలింగాలను కూడా నరేంద్రతీర్థంలో పడవల్లో ఊరేగిస్తారు. చందనయాత్ర ద్వితీయార్ధాన్ని ‘భితొరొ చందనయాత్ర’ (అంతర్ చందనయాత్ర) అంటారు. ద్వితీయార్ధంలోని 21 రోజుల్లో కేవలం నాలుగుసార్లు మాత్రమే– అమావాస్య, షష్టి, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకొస్తారు. మిగిలిన రోజుల్లో ఆలయం లోపలే వేడుకలను నిర్వహిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిగే ‘స్నానయాత్ర’తో చందనయాత్ర వేడుకలు పూర్తవుతాయి. జ్యేష్ఠపౌర్ణమి నాడు ఆలయ పూజారులు మంత్రోక్తంగా జగన్నాథునికి స్నాన వేడుకను నిర్వహిస్తారు. అందుకే జ్యేష్ఠపౌర్ణమిని ‘స్నానపూర్ణిమ’గా వ్యవహరిస్తారు. జగన్నాథుని అభిషేకించడానికి ఆలయంలోని ‘సునా కువొ’ (బంగారు బావి) నుంచి తెచ్చిన 108 కుండల పవిత్ర జలాలను వినియోగిస్తారు. జగన్నాథునికీ తప్పని జ్వరబాధ స్నానపూర్ణిమలో ఏకంగా 108 కుండల నీటిలో జలకాలాడిన జగన్నాథునికి జ్వరం వస్తుంది. ఆనాటి నుంచి రెండువారాల పాటు పూరీ ఆలయంలో భక్తులకు మూలవిరాట్టుల దర్శనం ఉండదు. మూలవిరాట్టుల స్థానంలో సంప్రదాయక ‘పొటొచిత్రొ’ పద్ధతిలో పెద్దవస్త్రంపై చిత్రించిన విగ్రహాల రూపాలనే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండువారాల కాలంలో జగన్నాథుని మూలవిరాట్టుకు ఛప్పన్న (యాభై ఆరు) భోగాల నైవేద్యం కూడా నిలిచిపోతుంది. జ్వరపీడితుడైన జగన్నాథునికి ఔషధ మూలికలు, ఆకులు, కషాయాలు, కొన్ని పండ్లను మాత్రమే దైతాపతులు సమర్పిస్తారు. జగన్నాథుని తొలుత ఆరాధించిన గిరిజన రాజు విశ్వవసు కూతురు లలిత, బ్రాహ్మణ పూజారి విద్యాపతిల వారసులే దైతాపతులు. జగన్నాథుని ఆరాధనలో వీరికి విశేష అధికారాలు ఉంటాయి. జ్వరపీడితుడైన జగన్నాథునికి పథ్యపానాలు సమర్పించే ప్రత్యేక అధికారం ఈ దైతాపతులకు మాత్రమే పరిమితం. రథయాత్ర వేడుకలు ముగిసేంత వరకు వీరి ఆధ్వర్యంలోనే జగన్నాథుని పూజాదికాలు జరుగుతాయి. జగన్నాథునికి జ్వరం తగ్గేలోగా రథాల తయారీ, వాటి అలంకరణ పూర్తవుతుంది. స్థలపురాణం పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని కూడా అంటారు. ఇక్కడ వెలసిన జగన్నాథుడిని నీలమాధవుడి ఆరాధిస్తారు. గిరిజన రాజు విశ్వవసు నీలమాధవుడిని తొలుత ఆరాధించాడని చెబుతారు. నీలమాధవుని విగ్రహం నీలమణితో తయారై ఉండేదని, అది కాలగర్భంలో కలసిపోయిన కొన్నాళ్లకు ఇంద్రద్యుమ్నుడనే రాజు తనకు కలలో కనిపించిన దారువును (కొయ్యదుంగ) విగ్రహాలుగా తయారు చేయించాలని సంకల్పించి, ఈ పని కోసం ఒక వృద్ధ శిల్పిని నియమించాడు. దారువుతో శిల్పాలను మలచేందుకు అంగీకరించిన వృద్ధ శిల్పి రాజుకు ఒక షరతు విధించాడు. తనకు ప్రత్యేకంగా ఒక గదిని ఇవ్వాలని, పని పూర్తయ్యేంత వరకు తనను ఎవరూ కదిలించరాదని చెప్పాడు. రాజు అంగీకరించాడు. ఎన్నాళ్లయినా, శిల్పి ఉన్న గది తలుపులు తెరుచుకోక పోవడం, కనీసం శిల్పాలు చెక్కుతున్న అలికిడైనా వినిపించకపోవడంతో వృద్ధుడైన శిల్పికి ఏమైనా జరిగి ఉండవచ్చని కీడు శంకించిన రాజు గది తలుపులు తెరిచాడు. మొండెం వరకు మాత్రమే చెక్కిన శిల్పాలు అక్కడలా ఉండగానే, శిల్పి అంతర్ధానమయ్యాడు. రాజు తన పొరపాటుకు దుఃఖించగా, జగన్నాథుడు ప్రత్యక్షమై, ఆ విగ్రహాలను అలాగే ప్రతిష్ఠించమని చెప్పి అదృశ్యమయ్యాడు. రాజు వాటిని అలాగే ప్రతిష్ఠించి, పూజలు చేయడం ప్రారంభించాడు. తర్వాతి కాలంలో ముగ్ధమనోహరమైన ఈ దారు విగ్రహమూర్తులను ఆదిశంకరాచార్యలు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు సహా ఎందరో ఆధ్యాత్మిక గురువులు దర్శించుకుని, పూజలు జరిపారు. పూరీక్షేత్రంలో వారి వారి పీఠాలను, మఠాలను కూడా ఏర్పాటు చేసుకుని మరీ జగన్నాథుని సేవించి, తరించారు. ఆదిశంకరాచార్యులు జగన్నాథుని స్తుతిస్తూ జగన్నాథ అష్టకాన్ని రచించారు. ప్రస్తుతం పూరీలో ఉన్న జగన్నాథ ఆలయాన్ని పదో శతాబ్దికి చెందిన తూర్పు గంగవంశపు రాజులు నిర్మించారు. అనంతవర్మ చోడగంగదేవ్ ఆధ్వర్యంలో ఈ ఆలయం ప్రారంభమైంది. గుండిచా మందిరం రథయాత్రలో రాజు కూడా సామాన్యుడే రథయాత్ర నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను రథాలపైకి ఎక్కిస్తారు. విగ్రహాలను రథాలపైకి చేర్చే ముందు పూరీ రాజు సామాన్య సేవకుడిలా చీపురు పట్టి, రథాలను శుభ్రం చేస్తారు. రాజు శుభ్రం చేసి వచ్చిన తర్వాత మూడు విగ్రహాలనూ మూడు రథాలపైకి చేరుస్తారు. ఈ తతంగాన్ని ‘పొహాండి’ అంటారు. పూజారుల మంత్రాలు, మేళతాళాల నడుమ విగ్రహాలు రథాలపైకి చేరుకున్న తర్వాత పెద్దసంఖ్యలో భక్తులు వాటికి కట్టిన తాళ్లను పట్టుకుని రథాలను ముందుకు లాగుతారు. పూరీ జగన్నాథ ఆలయం ఎదుట ఉండే ‘బొడొదండొ’ (పెద్దవీధి) మీదుగా మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరం వరకు రథయాత్ర సాగుతుంది. జగన్నాథుని రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన రథయాత్ర. బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం, కపిల సంహిత వంటి ప్రాచీన పురాణగ్రంథాల్లో జగన్నాథుని రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. తిరుగు రథయాత్ర మూడు రథాలూ ‘గుండిచా’ మందిరం వద్దకు చేరుకున్నాక, జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను ఆ మందిరంలో ఆషాఢ శుద్ధ దశమి వరకు కొలువుదీరుస్తారు. ‘గుండిచా’ మందిరంలో జగన్నాథుడు దశావతారాల రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. తోటలో వెలసిన ‘గుండిచా’ మందిరాన్ని జగన్నాథుని ‘వేసవి తోట విడిది’గా పరిగణిస్తారు. జగన్నాథుడు కొలువు తీరిన తొమ్మిదిరోజుల రథయాత్ర వేడుక సమయంలోనే ‘గుండిచా’ మందిరం భక్తులతో కళకళలాడుతుంది. ఏడాదిలో మిగిలిన రోజుల్లో ఇది ఖాళీగా ఉంటుంది. రథయాత్ర మొదలైన ఐదో రోజున గుండిచా మందిరంలో ‘హీరా పంచమి’ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆరోజు జగన్నాథుడు నరసింహావతారంలో దర్శనమిస్తాడు. గుండిచాలో జరిగే వేడుకల్లో ఇది చాలా ప్రధానమైన వేడుక. జగన్నాథుని ప్రధాన ఆలయంలోనికి విదేశీయులను అనుమతించరు. రథయాత్ర వేడుకల్లోను, గుండిచా మందిరంలో కొలువుండే సమయంలోను విదేశీయులను కూడా జగన్నాథుని దర్శనానికి అనుమతిస్తారు. ఆషాఢ శుద్ధ దశమి నాడు గుండిచా మందిరం నుంచి ‘తిరుగు రథయాత్ర’ ప్రారంభమవుతుంది. దీనినే ‘బాహుడా’ అంటారు. మార్గమధ్యంలోని ‘అర్ధాసిని’ (మౌసి మా–పినతల్లి) మందిరం వద్ద ఆగి, అక్కడ నివేదించే మిఠాయిలను జగన్నాథుడు ఆరగిస్తాడు. ‘బాహుడా’ మరుసటి రోజున ఏకాదశి నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు స్వర్ణాలంకారాలతో రథాలపై కొలువుదీరి భక్తులకు నేత్రపర్వం చేస్తారు. దీనినే ‘సునాబేసొ’ (స్వర్ణ వేషధారణ) అంటారు. స్వర్ణవేషధారణలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలు చతుర్భుజాలతో, పాదాలతో పరిపూర్ణంగా దర్శనమిస్తారు. ‘మౌసి మా’ మందిరం వద్ద విరామం తర్వాత రథాలు తిరిగి ప్రధాన ఆలయం వైపు ముందుకు సాగుతాయి. చతుర్దశి ఘడియల్లో రాత్రివేళ జగన్నాథుని ఆలయ ప్రవేశ ఉత్సవం జరుగుతుంది. తనను తీసుకుపోకుండా సోదరీ సోదరులతో కలసి రథాలపై ఊరేగి తిరిగి వచ్చిన జగన్నాథునిపై లక్ష్మీదేవి అలకబూనడం, రసగుల్లాలు ఇచ్చి జగన్నాథుడు ఆమెను ప్రసన్నం చేసుకోవడం వంటి వినోదభరితమైన ఘట్టాలను పూజారులు నిర్వహిస్తారు. దాదాపు పక్షంరోజుల పాటు జగన్నాథుడు లేక చిన్నబోయిన పూరీ శ్రీక్షేత్రంలో ఆషాఢ పూర్ణిమ నాటి నుంచి యథాప్రకారం భక్తుల కోలాహలం మొదలవుతుంది. మూడు రథాల విశేషాలు చాలా పుణ్యక్షేత్రాల్లోని మూలవిరాట్టు విగ్రహాలన్నీ శిలా విగ్రహాలు. పూరీక్షేత్రంలోనివి మాత్రం దారు విగ్రహాలు. రథయాత్రలో వీటిని ఊరేగించే మూడు రథాలను కూడా కలపతోనే తయారు చేస్తారు. మూడు రథాలకు నిర్ణీత ప్రమాణాలు ఉన్నాయి. శిల్పులు శాస్త్రప్రామాణికంగా ఈ మూడు రథాలను తయారు చేస్తారు. జగన్నాథుని రథం పేరు ‘నందిఘోష్’, బలభద్రుని రథం ‘తాళధ్వజ’, సుభద్ర రథం ‘దర్పదళన్’. వీటిలో జగన్నాథుని రథం ‘నందిఘోష్’ అన్నింటి కంటే పెద్దగా ఉంటుంది. నందిఘోష్కు 16 చక్రాలు ఉంటాయి. దీని ఎత్తు 44.2 అడుగులు, పొడవు 34.6 అడుగులు, వెడల్పు 34.6 అడుగులు. దీని తయారీకి చిన్నా పెద్దా కలుపుకొని 832 కలప ముక్కలను ఉపయోగిస్తారు. దీనిని ఎరుపు, పసుపు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ‘నందిఘోష్’ కావలి దైవం గరుత్మంతుడు, సారథి దారుకుడు. పతాకంపై కొలువుదీరే దైవం ‘త్రైలోక్యమోహిని’. ప్రతీకాత్మకంగా ఈ రథానికి పూన్చిన అశ్వాలు: శంఖ, బలాహక, శ్వేత, హరిదాశ్వాలు, ఈ రథానికి కట్టిన తాడును సర్పజాతికి చెందిన శంఖచూడునిగా భావిస్తారు. బలభద్రుని రథం ‘తాళధ్వజ’ను 14 చక్రాలతో నిర్మిస్తారు. దీని ఎత్తు 43.3 అడుగులు, పొడవు 33 అడుగులు, వెడల్పు 33 అడుగులు. దీని తయారీకి 763 కలప ముక్కలను ఉపయోగిస్తారు. దీనిని ఎరుపు, నీలం ఆకుపచ్చ కలగలసిన రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ‘తాళధ్వజ’ కావలి దైవం వాసుదేవుడు. సారథి మాతలి. పతాక దైవం ‘ఉన్నని’. ప్రతీకాత్మకంగా ఈ రథానికి పూన్చిన అశ్వాలు: తీవ్ర, ఘోర, దీర్ఘశర్మ, స్వర్ణనాభ. ఈ రథానికి కట్టిన తాడును సర్పజాతికి చెందిన వాసుకిగా భావిస్తారు. సుభద్ర రథం ‘దర్పదళన్’ను 12 చక్రాలతో నిర్మిస్తారు. దీని ఎత్తు 42.3 అడుగులు, పొడవు 31.6 అడుగులు, వెడల్పు 31.6 అడుగులు. దీని తయారీకి 593 కలప ముక్కలను ఉపయోగిస్తారు. ఈ రథాన్ని ఎరుపు, నలుపు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ‘దర్పదళన్’ కావలి దైవం జయదుర్గ. సారథి అర్జునుడు. పతాక దైవం నాదాంబిక. ప్రతీకాత్మకంగా దీనికి పూన్చిన అశ్వాలు: రోచిక, మోహిక, జిత, అపరాజిత. దీనికి కట్టిన తాడును సర్పజాతికి చెందిన స్వర్ణచూడునిగా భావిస్తారు. ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు ఆరగించే జగన్నాథుని వైభోగం వర్ణనాతీతం. పూరీ ఆలయంలోని నైవేద్యాలను సిద్ధం చేసే భోగమంటపం (వంటశాల) ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. జగన్నాథునికి ఛప్పన్న (56) ప్రసాదాలను, రోజుకు ఆరుసార్లు నివేదిస్తారు. జగన్నాథునికి నివేదన పూర్తయిన తర్వాత క్షేత్రపాలిక అయిన విమలాదేవికి నివేదించి, ఆ ప్రసాదాలను ఆలయ ఈశాన్యభాగాన ఉండే ‘ఆనంద బజార్’లో భక్తులకు విక్రయిస్తారు. ప్రసాదాలను వండటానికి ఎప్పటికప్పుడు కొత్త మట్టి కుండలనే ఉపయోగిస్తారు. కట్టెల పొయ్యిలపై వండుతారు. భోగ మంటపానికి చేరువలోని ‘గంగ’, ‘యమున’ అనే రెండు బావుల్లోని నీటిని మాత్రమే వంటకాలకు ఉపయోగిస్తారు. ప్రతిరోజూ ఏకకాలంలో యాభైవేల మందికి సరిపోయేలా ఇక్కడ ప్రసాదాలను తయారు చేస్తారు. పర్వదినాల్లోనైతే లక్షమందికి సరిపోయేలా తయారు చేస్తారు. ఏకకాలంలో లక్షమంది కూర్చుని భోజనం చేయగలిగేంత విశాలమైన భోజనశాల ఇక్కడి ప్రత్యేకత. జగన్నాథునికి నివేదించే ప్రసాదాలను ‘మహాప్రసాదం’గా పరిగణిస్తారు. మహాప్రసాదాన్ని ఆరగిస్తే మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. పూరీలో నివేదించే ఛప్పన్న భోగాలేమిటంటే... 1. అన్నం 2. కనికా (బియ్యం, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు) 3. దొహి పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు) 4. ఒద్దా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు) 5. తీపి కిచిడీ (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 6. నేతి అన్నం 7. కిచిడీ 8. మిఠా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు) 9. ఒరియా పొఖాళొ (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు) 10. కాజా 11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి) 12. లడ్డు 13. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు) 14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు) 15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి) 16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు) 17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు) 19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 20. లుణి ఖురుమా (గొధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు) 21. సువార్ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 22. చొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 23. ఝిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 27. పూరీ 28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు) 30. దొహిబొరా (పెరుగు గారెలు) 31. అరిసె 32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 33. రొసాపాయిక (గోధుమలతో చేస్తారు) 34. ఖిరి (పాయసం) 35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు) 36. కోవా 37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు) 38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు) 39. ఛెనాఖాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు) 40. బపుడి ఖొజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు) 41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి) 43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 44. ముగొడల్లి (పెసరపప్పు వంటకం) 45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 46. ఉరద్ డల్లి (మినప్పప్పు వంటకం) 47. దాల్మా (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం) 48. మవుర్ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం) 49. బేసొరొ (కలగూర వంటకం) 50. సగొ (తోటకూర వంటకం) 51. పొటొలొ రొసా (పొటల్స్/పర్వల్ కూర) 52. గొటి బైగొణొ (గుత్తివంకాయ కూర) 53. ఖొటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం) 54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు) 55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె) 56. బైగని (వంకాయలతో చేసే వంటకం) పూరీ ఆలయ విశేషాలు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పూరీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో నూట ఇరవై ఉపాలయాలు ఉంటాయి. ఆలయ శిఖరంపై అల్లంత దూరం నుంచే కనిపించే అష్టధాతు సుదర్శనచక్రాన్ని జగన్నాథుని ప్రతిరూపంగా భావిస్తారు. దీనినే ‘నీలచక్రం’ అని, ‘పతితపావన’ అని కూడా అంటారు. దూరం నుంచి ఇది నీలికాంతులతో కనిపిస్తుంది. ఆలయ శిఖరంపైనున్న ఈ సుదర్శన చక్రాన్ని తిలకించినంత మాత్రానే పాపాలను హరించి వేస్తుందని భక్తులు నమ్ముతారు. పూరీ ఆలయానికి తూర్పు వైపున సింహ ద్వారంతో పాటు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశలలో మరో మూడు ప్రవేశ మార్గాలు ఉన్నాయి. పూరీ జగన్నాథుని ఆలయం మీదుగా విమానాలు, పక్షులు ఎగురుతూ వెళ్లడం కనపించదు. ఇదొక అరుదైన విశేషం. సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు వినిపించే సాగరఘోష ఆలయంలోకి అడుగుపెడుతూనే వినిపించడం మానేస్తుంది. ఆలయం నీడ ఏ సమయంలోనూ కనిపించని విధంగా నాటి శిల్పులు దీనిని నిర్మించడం మరో విశేషం. ఎక్కడైనా సముద్రతీరం వద్ద సముద్రం మీదుగా నేలవైపు గాలులు వీస్తాయి. పూరీ తీరంలో మాత్రం సాయంత్రం వేళ పట్టణం మీదుగా గాలులు సముద్రం వైపు వీస్తాయి. పూరీ మహాప్రసాదం ప్రతిరోజూ ఒకే పద్ధతిలో, పరిమాణంలో తయారు చేస్తారు. పర్వదినాల్లో రెట్టింపు పరిమాణంలో చేస్తారు. వచ్చే భక్తుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నా, ఇంతవరకు అక్కడ తయారైన ప్రసాదం వృథా అయిన దాఖలాలు గాని, భక్తులకు చాలని సందర్భాలు గాని లేవు. -
అగ్గి పుల్లలతో రథం తయారీ
భువనేశ్వర్/ఖుర్దారోడ్ : స్వామి పట్ల భక్తి శ్రద్ధల్ని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ప్రదర్శిస్తున్నారు. జగన్నాథుని రథయాత్ర అంటే విశ్వ వ్యాప్త భక్తులందరికీ పండగే. ఈ పంథాలో ఖుర్దారోడ్ గోపీనాథ్పూర్ ప్రాంతంలో ఉంటున్న లింగాల ఈశ్వర రావు అగ్గి పుల్లలతో చూడ చక్కని రథాన్ని ఆవిష్కరించాడు. ఆ రథానికి తగినంత పరిమాణంలో కనులకు ఆకట్టుకునే జగన్నాథుని విగ్రహం కూడా అగ్గి పుల్లలతోనే తయారు చేసి అమర్చాడు. మహరణ సేవకులు నిర్మించే రథాల తరహాలో ఈ అగ్గి పుల్లల రథానికి సమ పరిమాణంలో చక్రాల్ని కూడా అమర్చాడు. దీంతో ఈ బుల్లి అగ్గి పుల్లల రథం చకచకా అటు ఇటు తిరుగుతోంది. ఈ రథం ఎత్తు 4.5 అంగుళాలు కాగా విగ్రహం 0.5 అంగుళాలు ఎత్తు ఉందని ఆవిష్కర్త పేర్కొన్నాడు. ఈ బుల్లి రథం, విగ్రహం తయారీలో మొత్తం 387 అగ్గి పుల్లలను వినియోగించాడు. రథం, విగ్రహాన్ని ఫ్యాబ్రిక్ రంగులతో చిత్రీకరించాడు. ఈశ్వరరావు కళకు అబ్బురపడిన స్థానికులు అభినందిస్తున్నారు. -
జగన్నాథ రథచక్రాల్..!
-
నేడే పూరీ రథయాత్ర
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని రథయాత్ర శనివారం ప్రారంభం కానుంది. ప్రధాన దేవస్థానం నెలకొన్న పూరీ శ్రీ మందిరంలో యాత్ర నిర్వహణకు దేవస్థానం, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేశాయి. శుక్రవారం సాయంత్రం జగన్నాథుని దేవస్థానం నుంచి ఆజ్ఞామాల రథ నిర్మాణ ప్రాంగణానికి చేరటంతో రథాలను మలుపు తిప్పారు. ప్రధాన దేవస్థానం నుంచి మూల విరాట్లను వరుస క్రమంలో రథాలపైకి తరలించేందుకు వీలుగా ముందురోజు రథాలను మలుపు తిప్పటం ఆచారం. కాగా, కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా సర్వ మానవాళి జగన్నాథుని యాత్రను తిలకిస్తున్నట్లుగా.. సైకత శిల్పి మానస్కుమార్ సాహు చిత్రీకరించిన దృశ్యం ఆకట్టుకుంటోంది. -
పూరీ జగన్నాథునికి జ్వరమా?
ఔను స్వామికి జ్వరమే. ఒళ్లంతా నొప్పులు, తల బరువు, రొంప వంటి సంకట పరిస్థితుల్లో స్వామి అల్లాడిపోతాడు. మూలిక ఔషధాలు, తైల మర్దన, పత్యపు నైవేద్యాలు, కషాయం సేవన వంటి ఉపచారాలతో స్వామి తెర చాటున 15 రోజులపాటు భక్తులకు దూరంగా ఉంటాడు. పండ్లు, తేలికపాటి పొడి పదార్థాల్ని స్వామికి పక్షం రోజులపాటు నిరవధికంగా నివేదిస్తారు. భువనేశ్వర్: జగన్నాథుని సంస్కృతి, ఆచార–వ్యవహారాలు పరికిస్తే చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది. సామాన్య మానవుని వాస్తవ జీవనంలో చవి చూసే సరదా సంతోషాలతో అనారోగ్యం వంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి అధిగమించే అద్భుత ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. జగన్నాథుడు యాత్ర ప్రియుడు. ఈ హడావిడిలో భారీగా స్నానం ఆచరించడంతో శారీరక పరిస్థితి అదుపు తప్పుతుంది. చీకటి మండపానికి తరలి వెళ్లి తెర చాటున గోప్య సేవల్ని అందుకుని నిత్య యవ్వన రూపంతో పక్షం రోజుల తర్వాత ప్రత్యక్షమవుతాడు. ఏటా నిర్వహించే స్నానోత్సవ సంక్షిప్త సారాంశం ఇది. జగన్నాథుని వార్షిక రథయాత్ర తొలి ఘట్టానికి గురువారం అంకురార్పణ జరిగింది. శ్రీ మందిరం ప్రహరి మేఘనాథ్ ప్రాంగణం బహిరంగ వేదికపై రత్న వేదికపైకి మూల విరాట్లను తరలించి భారీ స్నానం చేయించారు. సుభాషిత జలంతో బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుడు, సుదర్శనుడు ఈ జలాభిషేకంతో తడిసి ముద్దయ్యారు. అనంతరం గజానన అలంకారంతో ముస్తాబు అశేష భక్త జనానికి బహిరంగ వేదికపై దర్శనం ఇవ్వడం స్నానోత్సవ విశిష్టత. 15వ శతాబ్దంలో మహా రాష్ట్ర నుంచి విచ్చేసిన గణపతి భక్తుని అభీష్టం మేరకు ఏటా స్వామి గజానన అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నట్లు కథనం ప్రచారంలో ఉంది. స్నానోత్సవంలో మఠాల పాత్ర జగన్నాథునికి సేవలు కల్పించడం మహాభాగ్యం. శ్రీ మందిరం పరిసరాల్లో దశాబ్దాలుగా నెలకొల్పిన మఠాలు స్వామి ఉత్సవాదుల్లో ప్రత్యేక పాత్ర పోషి స్తాయి. ఆలయ సంప్రదాయాల మేరకు రాఘవ దాసు మఠం, గోపాల తీర్థ మఠం స్వామి స్నానోత్సవానికి అవసరమైన సరంజామా అందజేస్తాయి. పక్షం రోజులు పొట్టా చిత్రాలే శ్రీ మందిరం రత్న వేదికపై రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం జగన్నాథుని మూల విరాట్ దర్శనం పక్షం రోజులపాటు కనుమరుగవుతుంది. ప్రతినిధి దేవుళ్ల చిత్ర పటాలు (పొట్టా చిత్రొ) భక్తులకు దర్శనమిస్తాయి. మహా అభిషేకం చేసుకున్న స్వామి చీకటి మండపానికి తరలివెళ్తాడు. పక్షం రోజులు ఈ మండపంలోనే సేవాదులు నిర్వహిస్తారు. ఈ వ్యవహారం నేపథ్యంలో భక్త జనంలో పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. జగన్నాథుని ప్రతి ఆచారం భిన్నాతిభిన్నమైన సందేశాల్ని ప్రసారం చేస్తుంది. మానవుని నిత్య జీవన శైలిని జగన్నాథుని సంస్కృతిగా పేర్కొంటారు. ప్రకృతి ప్రభావ ప్రతిబింబం జగతి నాథుడు జగతిలో చిత్ర విచిత్రాలపట్ల సర్వ మానవాళిని చైతన్య పరిచేందుకు ఉత్సవ రీతిలో అపురూపమైన సందేశాన్ని ప్రచారం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. స్వామి స్నానోత్సవం తర్వాత వానా కాలం పుంజుకుంటుంది. ఈ వానల్లో తడిస్తే సామాన్య మానవుని పీడించే జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తల్ని జగన్నాథుని గోప్య సేవలు, ప్రత్యేక నైవేద్యాలు సూచిస్తాయి. లంకణం ఆరోగ్య దాయకం జ్వరంతో నలిగిన శరీరానికి పత్యపు ఆహార సేవన కొత్త యవ్వనం ప్రదానం చేస్తుందనే స్పృహను జగన్నాథుని స్నానోత్సవ ఘట్టం చివరి అంకం స్పష్టం చేస్తుంది. విశ్వవ్యాప్త భక్త జనం కంటిలో పడకుండా (ఐసీయూ) కట్టుదిట్టంగా ఆరోగ్య నియమాల్ని పాటించిన జగన్నాథుడు 15 రోజులయ్యేసరికి నవ యవ్వనుడుగా ప్రత్యక్షమవుతాడు. స్నాన పూర్ణిమను పురస్కరించుకుని అనారోగ్యం బారిన పడి చీకటి గదికి తరలి వెళ్లిన స్వామి ఒక్క సారిగా సరికొత్త మూర్తిగా ప్రత్యక్షమవుతాడు. ఈ ప్రత్యక్ష దర్శనమే నేత్రోత్సవం, నవ యవ్వన ఉత్సవం. రథయాత్ర ముందు రోజు ఈ వేడుక నిర్వహిస్తారు. జాగ్రత్త – పటిష్టత ఆరోగ్యమే మహా భాగ్యం సందేశాన్ని జగన్నాథుని స్నానోత్సవం ప్రసారం చేస్తుంది. ప్రధాన దేవాలయం రత్న వేదికపై చతుర్థా దారు (కలప) మూర్తులు నిత్యం ధూప దీపాదులతో సేవల్ని అందుకుని మసకబారుతాయి. వన్నె కోల్పోతాయి. సమయం, సందర్భోచితంగా స్నానాదులు ఆచరించి నిత్యం తేజోవంతంగా వెలుగొందే విధి విధానాలు ఈ ప్రక్రియలో తారసపడతాయి. మహా స్నానం పురస్కరించుకుని భారీ దారు విగ్రహాలు సుభాషిత జలంతో శుభ్రమవుతాయి. అభిషేకం ప్రభావంతో మసకతో బాటు దారు విగ్రహాల రంగుల కళ కడుక్కు పోతుంది. ఈ కళల్ని అద్దడం బృహత్తర ప్రక్రియ. దీనిని గోప్యంగా నిర్వహించాలి. ఈ వ్యవధిలో సాధారణ ధూపదీపాదులు, నైవేద్యాల నివేదన సాధ్యం కాదు. ఈ ప్రక్రియను నియంత్రించి మూల విరాట్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ప్రధాన వ్యవహారంగా చిట్ట చివరగా స్పష్టమవుతుంది. కొత్త వస్త్రాలు, రంగులు అద్దుకుని స్వామి ప్రత్యక్షం కావడం నూతన కళాకాంతుల్ని విరజిమ్మి కనులకు (నేత్రాలు) ఉత్సవ శోభను ప్రదర్శిస్తుంది. -
ఘనంగా జగన్నాథ రథయాత్ర
భువనేశ్వర్(పూరీ): ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ఈ యేడు ఆలయ ప్రధాన మందిరం నుంచి మూలవిరాట్ల తరలింపు(పొహండి)లో జాప్యం వల్ల యాత్ర గంట ఆలస్యంగా మొదలైంది. ఓవైపు వర్షం కురుస్తున్నప్పటికీ లక్షలాది మంది భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు. సుదర్శనుడు, సుభ ద్ర, బలభద్రుడు, శ్రీజగన్నాథుని విగ్రహాలు వరుస క్రమంలో రథాలపైకి చేరాయి. పూరీ మహారాజు దివ్యసింఘ్దేవ్ బంగారు చీపురుతో మూడు రథాల్ని శుద్ధి చేసి చందనపుష్పాలతో పూజలు నిర్వహించారు. తర్వాత స్థానిక గోవర్ధన పీఠాధిపతి శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి రథాలపై దేవదేవుళ్లని దర్శించుకున్నారు. అనంతరం రథాలపై సంప్రదాయ పూజలు ముగించి సీఎం నవీన్ పట్నాయక్ సహా భక్తజనం రథాలను లాగారు. తొలుత బలభద్రుని రథం ‘తాళధ్వజం’ కదిలింది. ఆ తర్వాత దేవీ సుభద్ర రథం ‘దర్పదళనం’ కదలగా, చివరగా జగన్నాథుని ‘నందిఘోష్’ రథం కదిలింది. పెద్ద సంఖ్యలో విదేశీయులు కూడా 3 రథాలను లాగారు. ఉగ్రవాదులు దాడి చేసే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో యాత్రకు మూడంచెల గట్టి భద్రత కల్పించారు.