పూరీ జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధం.. భారీగా తరలివచ్చిన భక్తులు | Lord Jagannath Rath Yatra In Odisha 1st Day Live Updates | Sakshi
Sakshi News home page

పూరీ జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధం.. భారీగా తరలివచ్చిన భక్తులు

Published Sun, Jul 7 2024 8:59 AM | Last Updated on Sun, Jul 7 2024 12:46 PM

Lord Jagannath Rath Yatra In Odisha 1st Day Live Updates

Live Updates..

🙏జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్‌.

🙏హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

🙏ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం అందరిది.. సర్వమతాలకు స్వేచ్ఛ, అవకాశాలను ఇస్తుంది. మా ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటిస్తుంది. ఇస్కాన్ సంస్థ ప్రార్ధనలతో రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా. మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు కూడా పాల్గొన​్నారు. 

🙏 నేడు ఒడిశాలోని పూరీ జగన్నాథుడి విశ్వప్రసిద్ద రథయాత్ర జరుగనుంది. ఈ వేడుకలను చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పూరీ చేరుకున్నారు. రథయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు.

 

 

🙏ఇంత వరకు భారత రాష్ట్రపతులు ఎవరూ పూరీ రథయాత్రలో పాల్గొనలేదు. తొలిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు. ఆమె గవర్నర్‌ రఘుబర్‌దాస్‌తో కలిసి సుభద్రమ్మ రథం లాగుతారు. ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. రెండురోజుల రథయాత్రలో 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకొని పూరీ పట్టణానికి మూడంచెల భద్రత కల్పించారు.

 

 

🙏కాగా, నేడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా వెళ్లి పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దివ్య(దారు) విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై మూడు కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి.

 

 🙏ఇక, ఈసారి రథయాత్రకు ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకేరోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. మూడు వేడుకలు ఆదివారం ఉండడంతో జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్‌ రథాలు ఆదివారం సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకొనే పరిస్థితి లేదు.

 

 

🙏మరోవైపు.. పూరీ రథయాత్ర నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని జగన్నాథుని ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. గుజరాత్‌లోని పూరీ ఆలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement