బుల్లి రథం తయారీలో ఈశ్వర రావు
భువనేశ్వర్/ఖుర్దారోడ్ : స్వామి పట్ల భక్తి శ్రద్ధల్ని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ప్రదర్శిస్తున్నారు. జగన్నాథుని రథయాత్ర అంటే విశ్వ వ్యాప్త భక్తులందరికీ పండగే. ఈ పంథాలో ఖుర్దారోడ్ గోపీనాథ్‌పూర్ ప్రాంతంలో ఉంటున్న లింగాల ఈశ్వర రావు అగ్గి పుల్లలతో చూడ చక్కని రథాన్ని ఆవిష్కరించాడు. ఆ రథానికి తగినంత పరిమాణంలో కనులకు ఆకట్టుకునే జగన్నాథుని విగ్రహం కూడా అగ్గి పుల్లలతోనే తయారు చేసి అమర్చాడు.
మహరణ సేవకులు నిర్మించే రథాల తరహాలో ఈ అగ్గి పుల్లల రథానికి సమ పరిమాణంలో చక్రాల్ని కూడా అమర్చాడు. దీంతో ఈ బుల్లి అగ్గి పుల్లల రథం చకచకా అటు ఇటు తిరుగుతోంది. ఈ రథం ఎత్తు 4.5 అంగుళాలు కాగా విగ్రహం 0.5 అంగుళాలు ఎత్తు ఉందని ఆవిష్కర్త పేర్కొన్నాడు. ఈ బుల్లి రథం, విగ్రహం తయారీలో మొత్తం 387 అగ్గి పుల్లలను వినియోగించాడు. రథం, విగ్రహాన్ని ఫ్యాబ్రిక్ రంగులతో చిత్రీకరించాడు. ఈశ్వరరావు కళకు అబ్బురపడిన స్థానికులు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment