భువనేశ్వర్: పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం లెక్కింపు ప్రక్రియ ఆదివారం ప్రారంభమవుతుందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శనివారం ప్రకటించారు. శ్రీ జగన్నాథ ఆలయ పాలక మండలి సమీక్షించిన నిర్ధారిత కార్యాచరణ (ఎస్‌వోపీ)ని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించగా, శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు.
జగన్నాథ ఆలయ అధికారిక వర్గం (ఎస్‌జేటీఏ) నిర్ణయించిన శుభ ముహూర్తంలో రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ఆదివారం ప్రారంభమవుతుందని తెలిపారు. దశలవారీగా ఈ పనులు సాగుతాయని మంత్రి పేర్కొన్నారు. ఆభరణాల జాబితా రూపకల్పనలో పారదర్శకతను నిర్ధారించడానికి, భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) సహాయం కోరామని, శ్రీ మందిరం పాలక మండలి బృందానికి సహకరించేందుకు ఆర్‌బీఐ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓఈకు అప్పగించినట్లు మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment