ratna
-
గురువులకు నిర్బంధ శిక్షణా?
సాక్షి, అమరావతి/నూజివీడు/నూజివీడు, ఆగిరిపల్లి: నాయకత్వ లక్షణాల అభివృద్ధిపై ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో హెచ్ఎం టి.వి.రత్నకుమార్ (55) గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం, తోటపలి్లలోని హీల్ ప్యారడైజ్ స్కూల్లో బుధవారం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలం, ఉణుదుర్రు హైసూ్కల్ ఇన్చార్జి హెచ్ఎంగా పనిచేస్తున్న రత్నకుమార్ ఈనెల 4వ తేదీ నుంచి ఇక్కడ శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు.బుధవారం వేకువజామున రత్నకుమార్‌కు గుండెపోటు రాగా, తోటి ఉపాధ్యాయులు గన్నవరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. మృతుడి స్వగ్రామం గణపవరం మండలం, కేశవరం కాగా భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. రత్నకుమార్ ఆకస్మిక మృతితో సమగ్ర శిక్ష, అదనపు స్పెషల్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఏఎస్పీడీ) కేవీ శ్రీనివాసులరెడ్డి, సీమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య, హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి శిక్షణ తరగతులను రద్దు చేశారు. కాగా ఈనెల 4న ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు 9వ తేదీతో ముగియనున్నాయి. ఆగిరిపల్లిలో ప్రధానోపాధ్యాయుల ఆందోళనటీవీ రత్నకుమార్ మృతికి నిరసనగా హెచ్ఎంలు బుధవారం ఉదయం హీల్ ప్యారడైజ్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. తీవ్రమైన ఒత్తిడి, భయం, ఆందోళన, సమయానికి అందని వైద్యసాయం వల్లే రత్నకుమార్ మృతి చెందారని హెచ్ఎంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజులుగా ఉదయం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకూ నిర్విరామంగా, నిర్బంధంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని వాపోయారు. 200 మందికి పైగా హెచ్ఎంలు శిక్షణ పొందుతుంటే కనీసం వైద్య సదుపాయాలు కూడా కల్పించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎం మృతికి కారణమైన అధికారులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కంటే టీడీపీ కూటమి ప్రభుత్వంలో మరిన్ని యాప్‌లు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్బంధ శిక్షణ నిలిపివేయాలి: ఉపాధ్యాయ సంఘాల డిమాండ్కనీస మౌలిక వసతులు లేకుండా శిక్షణల పేరిట ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి హితవు పలికాయి. హెచ్ఎం రత్నకుమార్ మృతిపై ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నిర్బంధ శిక్షణలతో ఉపాధ్యాయులను ప్రభుత్వం శిక్షిస్తోందని షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సుధాకర్, కార్యదర్శి కె. కుమార్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని, జీవో 117 రద్దు చేస్తామని ఉపాధ్యాయులను నమ్మించి, మోసగించారని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి. మనోజ్‌కుమార్ తెలిపారు. రత్నకుమార్ మృతిని తమను కలచి వేసిందని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ రావు వెల్లడించారు. కుంటి సాకులతో నిర్లక్ష్యపూరితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) విమర్శించింది. విశ్రాంతి లేని పని ఒత్తిడి కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ స్పష్టం చేశారు. ఆగిరిపల్లి శిక్షణ కేంద్రంలో కనీస వైద్య సౌకర్యం కూడా లేదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ తెలిపారు. -
అత్తా, కోడలిపై గ్యాంగ్ రేప్ ఘటనలో ఐదుగురి అరెస్టు
హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం నల్లబొమ్మనపల్లి సమీపంలో అత్తాకోడలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వి.రత్న మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. వారి నుంచి రూ.5,200 నగదు, రెండు మోటార్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. హిందూపురం త్యాగరాజనగర్‌కు చెందిన ఎరికల కావడి నాగేంద్ర, సాకే ప్రవీణ్‌కుమార్, మరో ముగ్గురిని సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు హిందూపురం–పాలసముద్రం రోడ్డులోని బిట్ కాలేజీ వెనుక వైపున డంపింగ్ యార్డ్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. హిందూపురం త్యాగరాజనగర్ గుడ్డం ఏరియాలో ఉంటున్న చాకలి శ్రీనివాసులు అలియాస్ శ్రీనాథ్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ కేసుల్లో పట్టుబడ్డ నిందితులు కరడుగట్టిన నేరస్తులేనని, వారిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. ఎరికల కావడి నాగేంద్ర దోపిడీ, అత్యాచార కేసుల్లో నిందితుడని, అతనిపై అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 37కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. సాకే ప్రవీణ్‌కుమార్‌పై లేపాక్షి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైందన్నారు. పరారీలో ఉన్న చాకలి శ్రీనివాసులు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ కేసులో ముద్దాయని తెలిపారు. ఇతని స్వగ్రామం లేపాక్షి మండలం కల్లూరు కాగా.. ప్రస్తుతం హిందూపురం త్యాగరాజనగర్ గుడ్డం ఏరియాలో ఉంటున్నాడన్నారు.స్పెషల్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చూస్తాం: ఎస్పీనిందితులకు స్పెషల్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. ఘటన జరిగిన 48 గంటల్లోపే నిందితులను అరెస్టు చేశామన్నారు. ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కేసును ఛేదించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జిల్లా ఎస్పీ వి.రత్న, ఇతర పోలీస్ అధికారులను సీఎం, హోంమంత్రి, డీజీపీలు ప్రత్యేకంగా అభినందించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ వి.రత్న, డీఎస్పీ మహేష్ నగదు రివార్డులు అందజేశారు. -
రత్న భండార్‌లో రెండో సర్వే ప్రారంభం
పూరీ: భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) ఒడిశా పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్‌లో శనివారం మధ్యాహ్నం రెండో దఫా టెక్నికల్ సర్వే ప్రారంభించింది. మూడు రోజులపాటు ఈ సర్వే కొనసాగుతుందని, మధ్యాహ్నం ఒంటి నుంచి సాయంత్రం 6 గంటల ద్వారా భక్తులను ఆలయంలోకి అనుతించబోమని శ్రీజగన్నాథ్ ఆలయ పరిపాలనా విభాగం అధికారులు వెల్లడించారు. సర్వే జరుగుతున్న సమయంలో ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. రత్న భండార్‌లో రహస్య గది గానీ, సొరంగం గానీ ఉన్నా యా? అనేది తేల్చబోతున్నామని రత్న భండార్ ఇన్వెంటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. ఈ సర్వే కోసం అత్యాధునిక రాడార్‌ను ఉపయోగిస్తున్న ట్లు వివరించారు. రత్న భండార్‌లో మొదటి దఫా సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. -
Ratna Bhandar: తెరిచి ఉన్న చెక్క పెట్టెలు!
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం రత్న భాండాగారం స్థితిగతుల పట్ల సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రత్న భాండాగారం ఉన్నత స్థాయి తనిఖీ పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ విశ్వనాథ్ రథ్ తాజా ప్రకటన మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రత్న భాండాగారం లోపలి గదిలో ఓ ఇనుప పెట్టె ఉంది. దీనికి 2 తాళాలు వేసేందుకు సదుపాయం ఉంది. ఒక తాళం సరిగ్గా ఉండగా, మరొకటి వదులుగా వేలాడుతుందని పేర్కొన్నారు. అలాగే మరో 2 చెక్క పెట్టెలు తాళాలు లేకుండా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 1978లో రత్న భాండాగారంలోకి ప్రవేశించిన వారు ఇలా తాళాలు వేయకుండా బయటకు వచ్చారని తాను నమ్మలేకపోతున్నానని రథ్ పేర్కొనడం గమనార్హం. -
మరోమారు తెరుచుకున్న రత్న భాండాగారం
12వ శతాబ్దానికి చెందిన పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం నేడు (గురువారం) మరోమారు తెరిచారు. ఈ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. రత్న భాండాగారంలోని విలువైన ఆభరణాలను లోపలి ఛాంబర్ నుండి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌నకు తరలించనున్న నేపధ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (ఎస్జేటీఏ) చీఫ్ అరబింద పాధి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఉదయం 8 గంటల తర్వాత ఎవరినీ లోనికి అనుమతించడం లేదన్నారు. ఆలయ సింహద్వారం మాత్రమే తెరిచివుంచి, మిగతా తలుపులన్నీ మూసి వేశామని తెలిపారు. గత కొన్నేళ్లుగా భక్తులు స్వామివారికి సమర్పించిన విలువైన వస్తువులను ఆలయ సముదాయంలోని తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌లోనికి తరలించనున్నట్లు అరబింద పాధి తెలిపారు.ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టోర్‌హౌస్‌కు ఆభరణాలను తరలించేందుకుగాను రత్న భండాగారం లోపలి గదిని ఆలయ పరిపాలనా యంత్రాంగం (ఎస్జేటీఏ) తిరిగి తెరిచింది. ఎస్జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధి, జస్టిస్ విశ్వనాథ్ రథ్ (రత్నాల భాండాగారాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షక కమిటీ చైర్మన్), పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, ఇతర అధికారుల సమక్షంలో రత్న భాండాగారం లోపలి గదిని తెరిచారు. ఉదయం 9:51 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు అధికారులు రత్న భాండాగారంలో ఉండనున్నారు. ఇక్కడి విలువైన వస్తువులను తాత్కాలిక స్టోర్‌హౌస్‌కి తరలించనున్నారు.ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్నారు. -
Ratna Bhandar: నేడు మళ్లీ రత్న భాండాగారం ఓపెన్
భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథుని రత్న భాండాగారం మరోసారి తెరవనున్నారు. ఈసారి కూడా శుభ ఘడియల్లో తెరిచేందుకు నిర్ణయించారు. రత్న భాండాగారం తనిఖీ ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ నిర్ణయం మేరకు ఈనెల 18వ తేదీ ఉదయం 9.51 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల మధ్య ఈ సన్నాహాలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీ అత్యవసర సమావేశం శ్రీమందిర్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. కమిటీ సభ్యులందరూ సమావేశంలో పాల్గొని వివరంగా చర్చించారు. శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి (సీఏవో) డాక్టర్ అరవింద కుమార్ పాఢి సమావేశం వివరాలు మీడియాకు వివరించారు.సురక్షితంగా ఆభరణాల తరలింపురత్న భాండాగారంలో ఆభరణాలు వగైరా సురక్షితంగా తరలించడమే ప్రధాన అజెండాగా చర్చ కొనసాగింది. సమావేశ నిర్ణయం మేరకు ఈనెల 18న మళ్లీ ఆలయంలోని రత్న భాండాగారం తెరిచి లోపల ఉన్న ఆభరణాలను తరలిస్తారు. ప్రధాన ఆలయం సముదాయంలోని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లోపలికి పకడ్బందీ వ్యవస్థ మధ్య తరలిస్తారు. ఈ విధానాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీన తొలిసారిగా రత్న భాండాగారం తెరిచిన విషయం తెలిసిందే. వెలుపలి గది పర్యవేక్షణ ముగించి ఆభరణాలు వగైరా తొలగించి ఖాళీ చేశారు. లోపలి గది తాళాలు తెరిచేందుకు విఫలయత్నం చేశారు. నకిలీ తాళం చెవిలతో తాళాలు తెరవకపోవడంతో విరగగొట్టి, గదిలోనికి ప్రవేశించినట్లు సీఏవో మరోసారి గుర్తు చేశారు. కానీ సమయాభావం వల్ల ఆభరణాల తరలింపు ప్రక్రియ చేపట్టకుండా పొడిగించారు. లోపల గదికి 3 తాళాలు వేసినట్లు గుర్తించారు. వాటిలో ఒకటి సీల్ వేసి ఉండగా, మిగిలిన రెండు సీలు లేకుండా ఉన్నట్లు రత్న భాండాగారం తనిఖీ ఉన్నత స్థాయి పర్యవేక్షక కమిటి బృందం గుర్తించింది. పాత తాళాలు విరగ్గొట్టడంతో మేజిస్ట్రేట్ సమక్షంలో రెండు కొత్త తాళాలు వేసి సీల్ చేసి, వాటి తాళం చెవిలు ట్రెజరీలో జమ చేశారు.మరమ్మతులకు అప్పగింతరాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం వెలుపలి మరియు లోపలి గదుల్లో రత్నాల వస్తువుల తరలింపు పూర్తయ్యి, ఖాళీ చేసిన తర్వాత వాటి మరమ్మతుల కోసం భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)కి అప్పగిస్తారు. పురావస్తు శాఖ మరమ్మతులు పూర్తి చేశాక తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లోని ఆభరణాలన్నింటినీ తిరిగి రత్న భాండాగారంలో యథాతథంగా భద్రపరిచేందుకు తరలిస్తారు. తాజాగా జారీ అయిన మార్గదర్శకాల ప్రకారం రత్న సంపద అన్ని లెక్కలు మరియు అంచనాలు జరుగుతాయని శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి డాక్టర్ అరవింద్ కుమార్ పాఢి తెలియజేశారు. -
జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది.
-
Puri Jagannath: నేడు తెరుచుకోనున్న జగన్నాథుడి రత్న భాండాగారం
భువనేశ్వర్: పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం లెక్కింపు ప్రక్రియ ఆదివారం ప్రారంభమవుతుందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శనివారం ప్రకటించారు. శ్రీ జగన్నాథ ఆలయ పాలక మండలి సమీక్షించిన నిర్ధారిత కార్యాచరణ (ఎస్వోపీ)ని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించగా, శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. జగన్నాథ ఆలయ అధికారిక వర్గం (ఎస్జేటీఏ) నిర్ణయించిన శుభ ముహూర్తంలో రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ఆదివారం ప్రారంభమవుతుందని తెలిపారు. దశలవారీగా ఈ పనులు సాగుతాయని మంత్రి పేర్కొన్నారు. ఆభరణాల జాబితా రూపకల్పనలో పారదర్శకతను నిర్ధారించడానికి, భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) సహాయం కోరామని, శ్రీ మందిరం పాలక మండలి బృందానికి సహకరించేందుకు ఆర్బీఐ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓఈకు అప్పగించినట్లు మంత్రి చెప్పారు. -
జగన్నాథ రహస్యం!
లక్షలాది భక్తజనం పాల్గొనే విశ్వవిఖ్యాత రథయాత్రతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పూరీ జగన్నాథుని ఆలయం మరోమారు పతాక శీర్షికలకెక్కింది. రాజుల నుంచి మొదలుకుని సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథస్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. ఆదివారం ఆలయం దిగువన ఉన్న ఆభరణాల నిల్వ గది(రత్న భండార్)ని దాదాపు 40 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు. విషసర్పాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యయిక ఔషధాలను సిద్ధంచేసి వైద్యులు, పాములు పట్టే వాళ్లను వెంటబెట్టుకునిమరీ పురావస్తు, ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్లబోతున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాల బరువును తూచి, వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు. చాన్నాళ్ల క్రితం గది తాళం చెవులు పోగొట్టి ఒడిశాలోని బిజూజనతాదళ్ సర్కార్ ఆలయ సంపద సంరక్షణలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికలవేళ ఆరోపణలు గుప్పించడంతో గది తలుపులు తెరచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. అయితే గది తెరవడంపై శనివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శుక్రవారం చెప్పారు.180 రకాల ఆభరణాలు1978లో గదిని తెరచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గదిలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు సమాచారం. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కోటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలూ ఉన్నాయి. ‘‘ 1978లో సంపద లెక్కించారు. అయితే జీర్ణావస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ పనుల కోసం 1985 జూలై 14వ తేదీన గది తెరిచారు. అప్పుడు నేనూ వెళ్లా. 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 15 చెక్కపెట్టెల్లో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచారు. వెలకట్టలేని ఆభరణాలతోపాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు గదిలో దాచారు. పెద్ద సింహాసనం, ఉత్తరభారత భక్తులు జగన్నాథ, బలభద్రులకు సమర్పించిన అరటిపువ్వు ఆకృతి చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి. తర్వాత గది తలుపులు మూసి రెండు రకాల తాళాలు వేసి సీల్‌వేశారు. తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్‌కు అందజేశాం’ అని ఆనాటి ఆలయ నిర్వహణ అధికారి రవీంద్ర నారాయణ మిశ్రా రెండేళ్ల క్రితం ఒక టీవీచానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు, యుద్ధంలో గెల్చుకున్న విలువైన సొత్తునూ రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది.2018లో మరోసారి ప్రయత్నించి..పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యుల భారత పురావస్తుశాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది. అయితే తాళం చెవి అదృశ్యమయిందన్న వార్తల నడుమ వెనుతిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు, పైకప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు. ఈ తతంగం అంతా 40 నిమిషాల్లో ముగిసింది. చీకటిగదిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత తెరుస్తున్న నేపథ్యంలో ఈసారైనా అన్ని ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి శిథిల గదికి బదులు నూతన గదిలో సురక్షితంగా దాచాలని సగటు పూరీ జగన్నాథుని భక్తుడు కోరుకుంటున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్రైమ్ కథనాలే స్ఫూర్తి!
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు (టీఎస్–నాబ్) చిక్కిన ‘ఫిల్మ్ ఫైనాన్షియర్’కారుమూరి వెంకట రత్నారెడ్డికి సంబంధించి మరో వ్యవహారం బయటపడింది. క్రైమ్ కథనాలే స్ఫూర్తిగా నకిలీ ఐఆర్ఎస్ అధికారం ఎత్తాడని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీ కేసులో ఇతడిని కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించామని అధికారులు తెలిపారు. ఆ తర్వాతే నిందితులు ఎందరనే అంశంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. వెన్నెముక విరగడంతో కథ అడ్డం... గుంటూరు నగరానికి చెందిన కె.వెంకట రత్నా రెడ్డి అలియాస్ రత్నారెడ్డి అలియాస్ కేవీఆర్ రెడ్డి బీఎస్సీ పూర్తి చేశాడు. ఆపై కొన్ని కంప్యూటర్ కోర్సులు కూడా చేసి బిల్డింగ్ ఎలివేషన్స్ డిజైనర్ గా స్థిరపడ్డాడు. 2007 లో ఓ బిల్డింగ్ వర్క్ చేస్తుండగా... ప్రమాద వశాత్తూ జారి పడటంతో వెన్నుముకకు తీవ్ర గాయమైంది. ఈ గా యంతో చాలా కాలం పాటు మంచం పట్టిన రత్నారెడ్డి అప్పట్లో వార్తా పత్రికలు, చానళ్లలో వచ్చే క్రైమ్ కథనాలను ఆసక్తిగా చూసేవాడు. ఈ నేపథ్యంలోనే అనేక మంది ప్రభుత్వ అధికారులుగా చెప్పుకుంటూ అమాయకులను మోసం చేసి భారీగా దండుకుంటున్న వైనంపై వెలువడిన కథనాలు ఇతన్ని ఆకర్షించాయి. ఆ స్ఫూర్తితోనే తానూ అదే రకంగా మోసాలు చేసి తేలిగ్గా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. కేవీఆర్ రెడ్డిగా అవతారం... అనుకున్నదే తడవుగా మోసాలు ప్రారంభించేందుకు అవసరమైన సరంజామా సిద్ధం చేసుకున్నాడు. కేవీఆర్ రెడ్డి పేరుతో ఐఆర్ఎస్ అధికారిగా పేర్కొంటూ ఓ బోగస్ గుర్తింపుకార్డు తయారు చేశాడు. ఇదే పేరు, హోదాలతో కొన్ని విజిటింగ్ కార్డులు సైతం రూపొందించుకున్నాడు. తనకు తానే హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లోని కమిషనర్స్ ఫర్ డిపార్ట్మెంట్ ఎక్వయిరీస్‌లో సూపరెంటెండెంట్‌గా హోదా క్రియేట్ చేసుకున్నాడు. నగరంలోని కృష్ణనగర్ ప్రాంతానికి చెందిన నర్సింహ నుంచి రూ.6 వేలు వెచ్చించి ఓ బొమ్మ పిస్తోలు కొనుగోలు చేశాడు. గుంటూరులోని ఓ షోరూమ్‌లో ఫైనాన్స్‌పై కారు కొన్నాడు. దానిపై ప్రభుత్వ చిహ్నం ఏర్పాటు చేయడంతో పాటు నెంబర్ ప్లేట్లపై గవర్నమెంట్ వెహికిల్ అని రాయించడం ద్వారా ఉన్నతాధికారిగా ‘కలర్’ఇచ్చాడు. వీటి సాయంతో తాను ఐఆర్ఎస్ ఆఫీసర్ అని నమ్మిస్తూ ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉందని, అనేక ప్రాజెక్టులు ఇప్పిస్తానని మోసాలకు తెరలేపాడు. వరుస పెట్టి నేరాలు... తాను ఐఆర్ఎస్ అధికారినంటూ నగరానికి చెందిన పి.వెంకటరామ్ అలియాస్ భీష్మాజీతో పరిచయం చేసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆన్ లైన్’ అనే ప్రాజెక్టు ఇప్పిస్తానని, దీని విలువ రూ.5 కోట్లకుపైగా ఉంటుందని నమ్మబలికి ఆయన నుంచి రూ.11 లక్షలు వసూలు చేశాడు. వరంగల్‌కు చెందిన బాల్‌కిషోర్‌రెడ్డికి, ఆయన సంబందీకులతో ఉన్న సివిల్ వివాదాన్ని సెటిల్ చేయడానికి రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఓ ఆర్థిక వివాదంతో కూకట్‌పల్లికి చెందిన గోపి అనే వ్యక్తిని బెదిరించాడు. తాను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధికారినంటూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పైరవీలు చేయడం ప్రారంభించాడు. -
కుమార్తెకు లోకేషన్ షేర్... మిస్టరీగా రత్నభాస్కర్ ప్రమాదం
పెనమలూరు: విజయవాడ–అవనిగడ్డ కరకట్టపై వెళ్తున్న కారు కేఈబీ కెనాల్లోకి సోమవారం వేకువజామున దూసుకెళ్లింది. కాలువలో నాలుగడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో కారు సగ భాగం పైగా నీటిలో మునిగింది. కారులో ముందు డోర్ తెరిచి ఉండటంతో కారులో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడా లేక కాలువలో గల్లంతయ్యాడా అనే విషయంలో స్పష్టత లేదు. పోలీసులు తెలిపిన వివరాలు.. ముదినేపల్లికి చెందిన గాజుల రత్నభాస్కర్ (47) గత ఆరు నెలల క్రితం బ్యాంకు రుణం తీసుకుని ఐస్ ఫ్యాక్టరీ పెట్టాడు. అతను ఆదివారం అవనిగడ్డలో ఉన్న అత్తగారి ఇంటి వద్ద నుంచి సాయంత్రం బయలుదేరి మచిలీపట్నం వెళ్లాడు. అక్కడ కోనేరు సెంటర్లో టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రాత్రి 7 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు. మరలా పది గంటల ప్రాంతంలో మిత్రులతో కూడా ఫోన్లో మాట్లాడి మచిలీపట్నంలో పని ఉందని, అది ముగించుకొని ముదినేపల్లికి వస్తానని తెలిపాడు. అయితే అతను రాత్రి ముదినేపల్లికి చేరలేదు. చోడవరం వద్ద కాలువలో కారు.. గాజుల భాస్కర్‌కు చెందిన కారు అవనిగడ్డ వైపు నుంచి విజయవాడ వైపునకు వస్తుండగా చోడవరం వద్ద సోమవారం వేకువజామున 3.30 గంటలకు కాలువలోకి దూసుకెళ్లింది. కాలువలో కారు పడిందన్నా సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు వెళ్లారు. కాలువలో పడిన కారు ముందు డోర్ తెరుచుకొని ఉంది. పోలీసులు కారులో వెతకగా ఆధార్‌కార్డు దొరకటంతో గాజుల రత్నభాస్కర్ అని గుర్తించారు. కానీ కారులో ఎవ్వరు లేరు. డీఎస్పీ జయసూర్య ఘటనా స్థలం వద్దకు వచ్చి క్రేన్ సాయంతో కాలువలో ఉన్న కారును బయటకు తీయించారు. కారులో దుస్తులు, సెల్‌ఫోన్, కాగితాలు తప్ప ఏమి దొరకలేదు. కనిపించకుండా పోయిన రత్నభాస్కర్కు భార్య, కుమార్తె ఉన్నారు. మిస్టరీగా మారిన ఘటన.. కేఈబీ కెనాల్లో పడిన కారు ఘటన మిస్టరీగా మారింది. ముదినేపల్లికి వెళ్లాల్సిన రత్నభాస్కర్ అర్ధరాత్రి విజయవాడ వైపునకు ఎందుకు వచ్చాడనేది పెద్ద ప్రశ్నగా ఉంది. పైగా ప్రమాదం జరిగే ముందు తన ఫోన్‌తో కుమార్తెకు లోకేషన్ షేర్ చేశాడు. కాలువలో పడిన కారును పోలీసులు తనిఖీ చేయగా సెల్‌ఫోన్ కారులోనే ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు. కారు కాలువలో పడిన సమయంలో కాలువలో నీరు నాలుగడుగులు మాత్రమే ఉంది. కాలువలో నీరు తక్కువగా ఉండటంతో కాలువలో రత్నభాస్కర్ కొట్టుకు పోయాడా లేదా అనే విషయం తేలలేదు. పోలీసులు కేఈబీ కెనాల్లో గాలింపు చేపట్టారు. కరకట్టపై ఉన్న సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. రత్నభాస్కర్కు కొందరు సొమ్ము బాకీ పడటంతో ఆర్థిక గొడవలు ఏమైనా ఉన్నయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రుణం తీసుకుని ఐస్‌ఫ్యాక్టరీ పెట్టడంతో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే విషయమై పోలీసులు బ్యాంక్ స్టేట్మెంట్ పరిశీలించనున్నారు. బంధువు మేడిశెట్టి సూర్యప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మంచికి మంచి
దిల్ ప్రీత్, కోనేటి వెంకటేష్, రత్న, దర్బార్, అమృత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వన్ నైట్ 999’. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్లో బాలరాజు ఎస్. స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేసి, మాట్లాడుతూ –‘‘మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. హెల్ప్ టు హెల్ప్ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇలాంటి ఓ మంచి సందేశాత్మక చిత్రాన్ని తీసిన బాలరాజు, ఇతర చిత్రబృందానికి అభినందనలు’’ అన్నారు. ‘‘నేను గతంలో రెండు షార్ట్ ఫిల్మ్స్ తీశాను. వాటిలో ‘ఓ నిమిషం’ అనే షార్ట్ ఫిల్మ్‌కు ఉత్తమ సినిమా అవార్డు వచ్చింది. తాజాగా హెల్ప్ టు హెల్ప్ అనే కాన్సెప్ట్‌తో ‘వన్ నైట్ 999’ అనే సినిమా తీశాను’’ అన్నారు బాలరాజు ఎస్. ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్, ఎస్.ఎఫ్.ఎక్స్: జాకట రమేష్. -
అడ్డంకులెదురైనా పోరాడి గెలిచా
సమాజంలో స్త్రీల పట్లవివక్ష చూశాను. చదువుకోవడానికి కూడా ఆటంకాలు ఉన్నాయి.వేటికీ వెరవకూడదు. పోరాడితే మహిళలుఅనుకున్నది సాధిస్తారు.ఈ విషయంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. కుటుంబ వ్యవస్థలో కూడా మార్పు రావలసి ఉంది. ఆడపిల్లలుఅబలలు కాదని,సబలలని నిరూపించే సంఘటనలు అనేకం ఉన్నాయి. ఏలూరు టౌన్: ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో పోటీపడుతున్నా... అదేస్థాయిలో వివక్ష, దాడులు, హత్యలు, అత్యాచారాలు, వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి... మహిళగా అనేక ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించి విజయాలు అందుకోవటం అద్భుతమైన అనుభూతినిచ్చింది. ఎర్రచందనం మాఫియా భరతం పట్టినప్పుడు గానీ.. మహిళల అక్రమరవాణా ముఠాపై దాడులు చేసి కేసులు పెట్టిన పరిస్థితుల్లోనూ బెదిరింపులు, ఒత్తిళ్ళు ఎదురైనా చట్టం.. మనస్సాక్షితో పనిచేస్తూ ఆరాచక శక్తుల ఆటకట్టించాను. స్త్రీ ఎంత ఎదిగినా అనాదిగా సమాజంలో వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. నేను ఈ స్థాయికి చేరేందుకు బాల్యం నుంచీ వెన్నుతట్టి ప్రోత్సహించిన.. నా తల్లీదండ్రే నా మార్గదర్శకులు. నా రోల్‌మోడల్ అంటోంది జిల్లా అదనపు ఏఎస్పీ వెలిశెల రత్న. ఇంకా అనేక విషయాలు ఆమె మాటల్లోనే.. నేను చదువుకునే రోజుల్లో మహిళల చదువు పట్ల చిన్నచూపు ఉండేది. మా తండ్రి నా సోదరులతో సమానంగా చదివించటం కారణంగానే ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. చదువుకోవాలనే ఆశ ఉన్నా కొందరికి ఆ అవకాశమే ఉండేది కాదు. ఆడపిల్లకు చదువెందుకు అనేవారు. ఆడపిల్ల ధైర్యంగా బయటకు వస్తే నిందలు వేసే నీచమైన పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాడితేనే విజయం సాధించగలమనే నమ్మకం రావాలి. భవిష్యత్తులో సైబర్ క్రైం పెద్ద సవాల్‌గా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. టెక్నాలజీ పెరగటం అరచేతిలోనే ప్రపంచాన్ని చుట్టిరాగల పరిస్థితులు ఉన్నాయి. పరిజ్ఞానం ఎంత పెరిగిందో నేరాలు అంతేస్థాయిలో అధికం అయ్యాయి. స్త్రీ ఎంత ఎదిగినా సమాజంలో వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నా...ఆయా రంగాల్లో నేటికీ దారుణ పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉన్నారు. సామాజిక, ఆర్థిక, జీవన విధానంలో మార్పులు మహిళలపై దాడులు పెరిగేందుకు కారణంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లేకుంటే మహిళలు అభివృద్ధి సాధించటం సాధ్యం కాదనే చెప్పాలి. కుటుంబ వ్యవస్థలో మార్పులు ఒంటరి మహిళల సంఖ్యను పెంచింది. ఈ పరిస్థితుల్లో మహిళలపై దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళలు నేరస్తులుగా ఉన్న సంఖ్య స్వల్పమే కానీ.. బాధితులుగా వేలల్లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయం ఇలా అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తూ పట్టుదలతో పోరాడితేనే మహిళా సాధికారిత, స్వావలంబన సాధ్యమవుతుంది. మా తండ్రి నాగేంద్రరావు ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి వీఎంజే పిన్నమ్మ గృహిణి. మా నాన్న ఆర్మీలో పనిచేయటంతో దేశభక్తికి కొదవలేదు. నా తల్లీతండ్రిని చూస్తూ పెరగటంతో బాల్యం నుంచీ ప్రజలకు సేవ చేయాలనే కాంక్ష అధికంగానే ఉండేది. నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు. నాకు ఒక కుమారుడు, భర్త బిజినెస్ చేస్తారు. మాది కృష్ణాజిల్లా పెనుమలూరు మండలం తాడిగడప గ్రామం. పెనుమలూరులోనే టెన్త్ వరకూ చదివాను. విజయవాడ మేరీ స్టెల్లా కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తిచేసి, రాజమహేంద్రవరంలో బీఎడ్ చదివాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ, ఎంఫిల్ చేశాను. ఇక 2002లో జవహర్ నవోదయ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే గ్రూప్–2 పరీక్ష రాసి ఏసీటీఓగా 2005లో పనిచేశా. సామాజిక సేవ పట్ల ఉన్న ఆసక్తి కారణంగా గ్రూప్–1 పరీక్షలు రాసి డీఎస్పీగా 2007 బ్యాచ్‌లో ఉద్యోగంలో చేరాను. పోలీస్ శాఖలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి దశాబ్దకాలం పూర్తయింది. మొదట పోస్టింగ్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి, రెండో పోస్టింగ్ గుంటూరు అర్బన్ డీఎస్పీగా పనిచేశాను. మూడో పోస్టింగ్ గుంటూరు అర్బన్ ఓఎస్డీగా పనిచేశా. చిత్తూరు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పనిచేయటం మంచి గుర్తింపునిచ్చింది. 2016 డిసెంబర్ 5న పశ్చిమ అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించా. ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలు తీసుకున్నాను. సత్తుపల్లి, గుంటూరు, చిత్తూరులో పోలీస్ అధికారిగా పనిచేస్తోన్న కాలంలో అనేక కేసులు ఛాలెంజింగ్‌గా తీసుకుని ఛేదించాను. మహిళల అక్రమ రవాణా చేస్తోన్న ముఠాల ఆటకట్టించి, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయించా. ఒత్తిళ్ళకు లొంగిపోకుండా చట్టం, మనస్సాక్షి ఆధారంగా దోషులకు శిక్షలు పడేలా చేయటం ఆనందాన్ని ఇచ్చింది. చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్ల భరతం పట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బడా నేతల కనుసన్నల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తూ కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని కాపాడాను. గుంటూరులో పనిచేస్తోన్న సమయంలో ఘోరరోడ్డు ప్రమాదంలో 12మంది చనిపోయారు. వారిలో నిండు గర్భిణి కూడా ప్రాణాలు కోల్పోవటం బాధించింది. డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడపటంతో ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. -
'అప్పా' అధికారిణిపై రైల్లో దాడి
గూడూరు: ఓ ఐపీఎస్ అధికారిణిపై సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఓ దుండగుడు దాడి చేసి కొట్టడంతోపాటు ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పరారయ్యాడు. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని అప్పాలో పనిచేసే తమిళనాడు రాష్ట్రానికి చెందిన నాన్ కేడర్ ఐపీఎస్ అధికారిణి ఎస్.ఎం రత్న చెన్నై వెళ్లేందుకు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో సింహపురి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఆమె వికలాంగుల బోగీలో ఎక్కి కూర్చున్నారు. గూడురులో రైలు మారి చెన్నైకు మరో రైలులో వెళ్లాల్సి ఉంది. అయితే, రైలు శనివారం ఉదయం నెల్లూరు స్టేషన్‌కు రాగానే వికలాంగుల బోగీలో ఉన్న అందరూ దిగిపోయారు. బోగీలో రత్న ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి అదే బోగీలోకి ఎక్కాడు. రైలు స్టేషన్ దాటిన తర్వాత ఆమెపై దాడి చేసి కొట్టాడు. రత్నా వద్ద ఉన్న రెండు బంగారు ఉంగరాలు, గాజులు, గొలుసు, రూ.2 వేల నగదు, ఐడీ కార్డు తీసుకుని గూడురులో దిగి పరారయ్యాడు. దుండగుడి దాడిలో అధికారిణి ముఖంపై గట్టి దెబ్బలు తగిలాయి. తీవ్రంగా గాయపడిన ఆమె గూడురు రైల్వే స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు.