మంచికి మంచి | One Night 999 Movie Poster And Trailer Launched | Sakshi
Sakshi News home page

మంచికి మంచి

Published Tue, Aug 4 2020 2:29 AM | Last Updated on Tue, Aug 4 2020 2:29 AM

One Night 999 Movie Poster And Trailer Launched - Sakshi

దిల్‌ ప్రీత్, కోనేటి వెంకటేష్, రత్న, దర్బార్, అమృత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వన్‌ నైట్‌ 999’.  నవ ఉదయం సమర్పణలో నేచర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో బాలరాజు ఎస్‌. స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేసి, మాట్లాడుతూ –‘‘మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. హెల్ప్‌ టు హెల్ప్‌ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది.

ఇలాంటి ఓ మంచి సందేశాత్మక చిత్రాన్ని తీసిన బాలరాజు, ఇతర చిత్రబృందానికి అభినందనలు’’ అన్నారు. ‘‘నేను గతంలో రెండు షార్ట్‌ ఫిల్మ్స్‌ తీశాను. వాటిలో ‘ఓ నిమిషం’ అనే షార్ట్‌ ఫిల్మ్‌కు ఉత్తమ సినిమా అవార్డు వచ్చింది. తాజాగా హెల్ప్‌ టు హెల్ప్‌ అనే కాన్సెప్ట్‌తో ‘వన్‌ నైట్‌ 999’ అనే సినిమా తీశాను’’ అన్నారు బాలరాజు ఎస్‌. ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్, ఎస్‌.ఎఫ్‌.ఎక్స్‌: జాకట రమేష్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement