Durbar
-
మంచికి మంచి
దిల్ ప్రీత్, కోనేటి వెంకటేష్, రత్న, దర్బార్, అమృత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వన్ నైట్ 999’. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్లో బాలరాజు ఎస్. స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేసి, మాట్లాడుతూ –‘‘మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. హెల్ప్ టు హెల్ప్ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇలాంటి ఓ మంచి సందేశాత్మక చిత్రాన్ని తీసిన బాలరాజు, ఇతర చిత్రబృందానికి అభినందనలు’’ అన్నారు. ‘‘నేను గతంలో రెండు షార్ట్ ఫిల్మ్స్ తీశాను. వాటిలో ‘ఓ నిమిషం’ అనే షార్ట్ ఫిల్మ్‌కు ఉత్తమ సినిమా అవార్డు వచ్చింది. తాజాగా హెల్ప్ టు హెల్ప్ అనే కాన్సెప్ట్‌తో ‘వన్ నైట్ 999’ అనే సినిమా తీశాను’’ అన్నారు బాలరాజు ఎస్. ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్, ఎస్.ఎఫ్.ఎక్స్: జాకట రమేష్. -
దైవాదేశ పాలనకే ప్రాధాన్యం
మహమూద్ గజనవీ దర్బారులో అయాజ్ అనే మంత్రి ఉండేవాడు. అయాజ్ అంటే చక్రవర్తికి ఎంతోఇష్టం. దీంతో మిగతా మంత్రులకు కాస్త అసూయగా ఉండేది. ఒకసారి చక్రవర్తి తన చేతిలో ఉన్న ముత్యాల హారాన్ని కొలనులో విసిరేశాడు. దర్బారులోని కొలను స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతోంది. ముత్యాలహారం నీటి అడుగుభాగానికి చేరింది. అప్పుడుచక్రవర్తి, మంత్రులను పిలిచి,’మీలోఎవరైనా ఈ హారాన్ని బయటికి తీస్తారా?’అని అడిగాడు. దానికి అందరూ’ అదెంతపని చిటికెలో తీస్తాం.’ అన్నారు.‘సరే.. అయితే, ఒంటిపై వస్త్రాలు తడవకుండా హారాన్ని బయటికి తీయాలి.’ అన్నాడు చక్రవర్తి.‘అదెలాసాధ్యం?’ అంటూ అందరూ చేతులెత్తేశారు. బట్టలు తడవకూడదు అన్న షరతు లేకపోతే తీస్తామన్నారు.అప్పుడు చక్రవర్తి, అయాజ్‌ను పిలిచి ‘నువ్వు తీస్తావా?’అని అడిగాడు. అయాజ్ వెంటనే వెనుకాముందూ ఆలోచించకుండా కొలనులోకి దూకి ముత్యాల హారాన్ని బయటికి తీశాడు. అతని బట్టలు, శరీరమంతా నీటిలో తడిసి పొయ్యాయి. వణుకుతున్న చేతులతోనే హారాన్ని చక్రవర్తికి అందించాడు అయాజ్ .‘నేను బట్టలు తడవకుండా హారాన్ని తియ్యాలని చెప్పానుకదా..!’ అని ఆగ్రహించాడు చక్రవర్తి.‘అవును ప్రభూ! హారం తియ్యాలి.. వస్త్రాలు తడవద్దు.’ అన్న మీ ఆజ్ఞను శిరసావహించాలన్న ఆరాటంలో బట్టలు తడుస్తాయా.. తడవకుండా ఎలా తియ్యాలి..? అనే విషయాలేవీ నేను పట్టించుకోలేదు ప్రభూ..! మీ రెండు ఆజ్ఞల్లో ఒకదాన్ని పాలించాను. మరొకదాని విషయంలో నన్ను క్షమించండి’ అని చేతులు జోడించాడు అయాజ్ .అప్పుడు చక్రవర్తి, ‘చూశారా.. ఇదీ అయాజ్ ప్రత్యేకత. మీరంతా బట్టలు తడవకుండా ఎలా? తడుస్తాయి కదా.. ఆ షరతు తొలగించండి.. అదీ ఇదీ..’ అంటూ మీనమేషాలు లెక్కించారు. కాని అయాజ్ అదేమీ ఆలోచించలేదు. విలువైన హారాన్ని తీయడమే అతని దృష్టిలో ఉంది. ఆ క్రమంలో బట్టలు తడిస్తే శిక్షించబడతానని అతనికి తెలుసు. అయినా సరే నా విలువైన హారం కోసం తను శిక్షకు సిద్ధపడ్డాడు.మీరేమో హారం సంగతి తరువాత.. మేమెందుకు శిక్ష అనుభవించాలి?’ అని ఆలోచించారు.దైవాదేశపాలనలో మన పరిస్థితి కూడా ఇలాగే ఉండాలి. ఆయన ఆజ్ఞాపాలనలో మనం త్యాగానికి సిద్ధపడితే అల్లాహ్ మనల్ని తన సన్నిహితుడిగా చేసుకుంటాడు. మన పాపాలను క్షమిస్తాడు. ఇహలోకంలో గౌరవాన్ని ప్రసాదిస్తాడు. దైవదూతల ముందు మనల్ని గురించి గర్వంగా పొగుడుతాడు. ఆయన అమితంగా ప్రేమించేవాడు. అనన్యంగా కరుణించేవాడు. గొప్ప క్షమాశీలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మీరెక్కడున్నా సరే వచ్చి తీరుతుంది!
సులైమాన్ (అలైహిస్సలామ్) దర్బారులో ఒక వ్యక్తి కూర్చుని ఆయనతో మాట్లాడుతున్నాడు. అంతలోనే మృత్యుదూత ప్రత్యక్షమయ్యాడు. సులైమాన్ పక్కనే కూర్చుని ఉన్న వ్యక్తివంక పట్టి పట్టి చూశాడు. ఆ వ్యక్తి భయంతో వణకుతూ ‘‘ప్రవక్తా! ఆ మృత్యుదూత నన్నదోలా చూస్తున్నాడు. చూడబోతే అతను నా ప్రాణాలు తోడేసేలా ఉన్నాడు. మీ మహిమతో నన్ను ఈ దేశ సరిహద్దులు దాటించి ఓ నిర్మానుష్య అడవులకు పంపించండి’’ అని వేడుకున్నాడు. హజ్రత్ సులైమాన్ వాయువులతో ‘‘ఈ వ్యక్తిని భారతదేశ సరిహద్దుల్లోని ఫలానా అడవులకు తీసుకువెళ్లండి’’ అని ఆజ్ఞాపించిన క్షణాల వ్యవధిలోనే ఆ వ్యక్తి అడవుల్లో ఉన్నాడు. ఆ అడవుల్లో కాలుమోపిన కాసేపటికే అతను మృత్యువాతపడ్డాడు. కొన్నిరోజుల తరువాత హజ్రత్ సులైమాన్ తన దర్బారులోకి వచ్చిన మృత్యుదూతతో ‘‘ఆ రోజు ఆ వ్యక్తివంక ఎందుకలా చూశావు?’’ అని అడిగారు. దానికి మృత్యుదూత ‘‘తెల్లారితే ఆ వ్యక్తి ప్రాణాలు ఫలానా అడవిలో తోడేయాలని నాదగ్గర ఉన్న చిట్టాలో రాసి ఉంది. అతనేమో మీ సమక్షంలో కూర్చుని ఉండేసరికి ఆశ్చర్యమేసింది. అంతలోనే తను మీతో మొరపెట్టుకోవడం... తాను ఎక్కడైతే చావాలని ఉందో అక్కడికే అతను చేరడం తమరికి తెలిసిందే’’ మృత్యువు, మీరు ఎక్కడున్నాసరే అది మీకు వచ్చి తీరుతుంది, మీరు ఎంతటి దృఢమైన భవనాలలో ఉన్నా సరే... – ముహమ్మద్ ముజాహిద్ -
కలియుగదైవం కూడా రోజూ జమాఖర్చులు చూసుకుంటాడు!
గర్భాలయంలోని స్వయంవ్యక్త మూర్తి అయిన మూలవిరాట్టు అంశంగా భోగ శ్రీనివాసమూర్తికి నిత్యం ఆలయంలోని ఆదాయ, వ్యయాలకు సంబంధించిన జమాఖర్చుల లెక్కలన్నీ అప్పచెబుతారు. దీన్నే కొలువు లేదా దర్బార్ అని అంటారు. ఆలయంలో సుప్రభాత, తోమాల సేవలు ముగిసిన తర్వాత సన్నిధిలో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని బంగారు ఛత్ర చామరాలతో స్నపన మంటపంలో బంగారు సింహాసనంపై వేంచేపు చేసి దర్బారు నిర్వహిస్తారు. షోడశ ఉపచారాలు, ధూపదీప హారతులు సమర్పిస్తారు. ఆస్థాన సిద్ధాంతి శ్రీనివాస ప్రభువుకు పంచాంగ శ్రవణం చేస్తూ ఆ నాటి తిథివార నక్షత్రాదులు, ఉత్సవ విశేషాలు, వివిధ పథకాలకు విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు వినిపిస్తారు. రికార్డుల గది లెక్కల గుమస్తా (బొక్కసం సెల్ ఇన్చార్జి) వచ్చి ముందు నాటి ఆదాయం, ఆర్జిత సేవా టికెట్లు, ప్రసాదాల విక్రయం, హుండీ కానుకలు, బంగారు, వెండి, రాతి, ఇతర విలువైన లోహ పాత్రలు, నగదు నికర ఆదాయం పైసలతో సహా లెక్కకట్టి వడ్డీకాసులవాడైన శ్రీనివాసునికి వివరంగా అప్పగించి భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుంటాడు. స్వామికి నైవేద్యం పెట్టిన అనంతరం దర్బార్ ముగిసినట్లు భావించి, భోగశ్రీనివాస మూర్తిని తిరిగి సన్నిధిలోకి భక్తిపూర్వకంగా తీసుకెళతారు. ఈ కొలువు సూర్యోదయానికి ముందు స్నపన మండపం, ప్రత్యేక సందర్భాల్లో సూర్యోదయం తర్వాత బంగారు వాకిలిలోని తిరుమామణి (ఘంటామంటపం) మంటపంలో నిర్వహిస్తారు.