
భువనేశ్వర్/పూరీ: బాలీవుడ్ నటీమణి కంగన రనౌత్ శుక్రవారం పూరీ జగన్నాథుని దర్శించుకున్నారు. శ్రీ మందిరం సింహద్వారం ఆవరణలో పతిత పావనుని దర్శించుకుని ప్రధాన ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ సముదాయంలోని గణపతి, విమలా దేవి వగైరా దేవతా మూర్తుల్ని దర్శించారు. రత్నవేదికపై తోబుట్టువులు బలభద్రుడు, దేవీ సుభద్రలతో జగన్నాథుడు కొలువుదీరడం విభిన్నమంటూ ఆనందం వ్యక్తం చేశారు.
సినిమాల విషయానికి వస్తే.. ఆమె రజనీష్ ఘాయ్ దర్శకతంలో తెరకెక్కుతున్న ‘ధాకాడ్’ చిత్రంతలో కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ సినిమాలో కంగన ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: కంగనాపై ఆర్జీవీ ట్వీట్, ఆ వెంటనే డిలీట్!
చదవండి: అసలు మెరిల్ స్ట్రీప్‌తో నీకు పోలికేంటి..
Comments
Please login to add a commentAdd a comment