orisha
-
800 తాబేళ్ల మృతి.. కలెక్టర్‌కు హైకోర్టు నోటీసులు
భువనేశ్వర్: ఆలివ్ రిడ్లేల మృత్యువాతపై రాష్ట్ర హైకోర్టు చొరవ కల్పించుకోవడం విశేషం. గహీరమ తీరంలో లెక్కకు మించి ఆలివ్‌రిడ్లే రకం తాబేళ్లు మరణిస్తుండడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైంది. ఈ నేపథ్యంలో వివరణ కోరుతూ కేంద్రాపడ జిల్లా కలెక్టర్, అటవీ-పర్యావరణ విభాగం కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే గహీరమర మెరైన్ సాంక్చువరిలో ఆలివ్ రిడ్లేల సంరక్షణ మార్గదర్శకాల కార్యాచరణ సమీక్షించేందుకు హైకోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న డాక్టర్ కార్తీక్ శంకర్(బెంగళూరు), పర్యావరణ విభాగం డైరెక్టరు డాక్టర్ సుశాంత నొందొ, న్యాయవాది మోహిత్ అగర్వాల్ గహీరమ, రుసికుల్యా సాగర తీరాలను సందర్శిస్తారు. అనంతరం ఆలివ్ రిడ్లేల సంరక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మత్స్యకారులు, స్థానికులు ఇతర అనుబంధ వర్గాలతో కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా భేటీ అయి సంప్రదిస్తారు. మార్చి 10వ తేదీ నాటికి ఈ కమిటీ నివేదిక దాఖలు చేస్తుందని హైకోర్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలో ఆలివ్ రిడ్లేలు మరణాలు అత్యధికంగా చోటుచేసుకుంటుండగా, ఈ విషయంపై పలు వార్తా పత్రికల్లో వచ్చే కథనాల ఆధారంగా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం నమోదు కావడం విశేషం. ప్రస్తుతం ఈ కేసు విచారణ మార్చి 15వ తేదీ నాటికి వాయిదా పడగా, జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 800 తాబేళ్లు మృతి చెందినట్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనికి గహీరమ శాంక్చువరీ తీరంలో దాదాపు 30 కిలోమీటర్ల పొడవునా నీటిపై తేలిన తాబేళ్ల కళేబరాలు నిలువెత్తు సాక్ష్యంగా వ్యాజ్యంలో తెలిపారు. సియాలి నుంచి నాసి వరకు పలు తీరాల్లో తాబేళ్ల కళేబరాలు తారసపడ్డాయి. 1997లో గహీరమ-రూర్కీ ప్రాంతాన్ని మెరైన్ సాంక్చువరీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆలివ్‌రిడ్లే సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆంక్షలు కూడా జారీ చేసింది. గతేడాది నవంబరు 1వ తేదీ నుంచి ఈ ఏడాది మే 31వ తేదీ వరకు గహీరమ తీరంలో 20 కిలో మీటర్ల పొడవునా చేపల వేట కూడా ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా, గహీరమ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర తాబేళ్ల సంతతి ఉత్పత్తి తీరంగా వెలుగొందుతుండడం విశేషం. చదవండి: బాలాకోట్ ఆపరేషన్: లాంగ్ రేంజ్ స్టైక్ -
కట్టుదిట్టమైన భద్రత.. పూరీలో కంగనా
భువనేశ్వర్/పూరీ: బాలీవుడ్ నటీమణి కంగన రనౌత్ శుక్రవారం పూరీ జగన్నాథుని దర్శించుకున్నారు. శ్రీ మందిరం సింహద్వారం ఆవరణలో పతిత పావనుని దర్శించుకుని ప్రధాన ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ సముదాయంలోని గణపతి, విమలా దేవి వగైరా దేవతా మూర్తుల్ని దర్శించారు. రత్నవేదికపై తోబుట్టువులు బలభద్రుడు, దేవీ సుభద్రలతో జగన్నాథుడు కొలువుదీరడం విభిన్నమంటూ ఆనందం వ్యక్తం చేశారు. సినిమాల విషయానికి వస్తే.. ఆమె రజనీష్ ఘాయ్ దర్శకతంలో తెరకెక్కుతున్న ‘ధాకాడ్’ చిత్రంతలో కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ సినిమాలో కంగన ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: కంగనాపై ఆర్జీవీ ట్వీట్, ఆ వెంటనే డిలీట్! చదవండి: అసలు మెరిల్ స్ట్రీప్‌తో నీకు పోలికేంటి.. -
ఎలాగైనా గెలవాలని..
ఒడిశా అంటే నవీన్ పట్నాయక్.. నవీన్ పట్నాయక్ అంటే ఒడిశా అన్నట్టుగా 20 ఏళ్లుగా రాజకీయాలు మారిపోయాయి. ఒడిశా ఎన్నికల చరిత్రలో బిజూ జనతాదళ్ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రస్థానం తిరుగులేనిది. ఒడిశా.. రాష్ట్రంగా చూస్తే వెనుకబడిందే.. కానీ ఖనిజ సంపదలో చాలా విలువైనది. ఈ ఖనిజాల చుట్టూ జరిగే వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి నవీన్ పట్నాయక్ గత నాలుగు ఎన్నికల్లోనూ అందలాన్ని అందుకున్నారు. కానీ ఇప్పటివరకు బిజూ జనతాదళ్ అడుగు పెట్టలేకపోయిన ప్రాంతం ఏదైనా ఉందీ అంటే అది సుందర్‌గఢ్. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేడీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. అటవీ హక్కుల చట్టం అమలే ప్రధానాంశం ఒడిశాలో సుందరగఢ్ నియోజకవర్గం కీలకమైనది. ఇది ఎస్టీ రిజర్వుడు స్థానం. ప్రతీ ఐదుగురిలో ఒకరు గిరిజనుడే. 2014 ఎన్నికల్లో ఏకైక బీజేపీ ఎంపీగా జుయల్ ఒరమ్ ఇక్కడ గెలుపొంది రికార్డు సృష్టిం చారు. ఆ తర్వాత కేంద్ర గిరిజన మంత్రి పదవినీ అందుకున్నారు. జుయల్ ఒరమ్కి విజయం అంత సులభంగా లభించలేదు. చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో అప్పట్లోనే ఒమర్‌కి బీజేడీ అభ్యర్థి దిలీప్ కుమార్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈసారి మోదీ వేవ్ ఆ స్థాయిలో లేకపోగా కేంద్ర గిరిజన మంత్రిగా నియోజకవర్గానికి, ఆదివాసీల సంక్షేమానికి ఆయన చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. ఆదివాసీలకు భూ యాజమాన్య హక్కుల్ని కల్పిస్తూ 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఫ్రా) తీసుకువచ్చినా వారికి ప్రయోజనం కలగలేదు. ఆ చట్టంలో లొసుగుల ఆధారంగా ఎందరో ఆదివాసీలకు యాజమాన్య హక్కుల్ని తిరస్కరించారు. తమ నియోజకవర్గం ఎంపీ కేంద్రంలో గిరిజనుల మంత్రిగా ఉన్నప్పటికీ తమకు ఒరిగిందేమీ లేదన్న అసంతృప్తి ఆదివాసీల్లో నెలకొంది. ‘ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్రా కీలకపాత్ర పోషిస్తుంది. ఒడిశాలో పార్టీలన్నీ దీనిని సీరియస్‌గా తీసుకున్నాయి. మేనిఫెస్టోల్లో దీనినే ప్రధానంగా ప్రస్తావించాయి’ అని వసుంధర అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన గిరిరావు వ్యాఖ్యానించారు. జాతీయ సగటు కంటే ఒడిశాలో తక్కువ జాతీయ స్థాయిలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అటవీ హక్కుల గుర్తింపు చట్టంపై ఈ మధ్య కాలంలో ఆదివాసీల్లో అవగాహన పెంచుతున్నాయి. దీంతో ఎన్నికల్లో ఇదే ప్రధాన అస్త్రం కానుంది. ఈ చట్టం అమల్లో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు చాలా తక్కువగా ఉంది. ఈ చట్టం కింద భూ యాజమాన్య హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతించే జాతీయ సగటు రేటు 81 శాతంగా ఉంటే, ఒడిశాలో 71 శాతమే ఉంది. షెడ్యూల్ తెగలు మాత్రమే కాకుండా ఇతర సంప్రదాయ ఆదివాసీలు తవ్వకాల కోసం పెట్టుకున్న అనుమతుల్లో 2 శాతం మాత్రమే ప్రభుత్వం అంగీకరించింది. ఇది కూడా జాతీయ సగటు (13%) కంటే చాలా తక్కువ. కేంద్ర గిరిజన మంత్రిగా ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉన్నప్పటికీ ఫ్రా చట్టం అమలు ఇంత ఘోరంగా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలకు అదే ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. త్రిముఖ పోటీ సుందర్గఢ్లో ఒక్కసారి కూడా నెగ్గలేకపోవడంతో బీజేడీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 33 శాతం మహిళలకు టికెట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. సుందర్గఢ్లో మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్ కుమార్తె సునీతా బిశ్వాల్‌కు అవకాశం ఇచ్చారు. ఒడిశాకు మొదటి గిరిజన ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్‌కు మంచి పేరే ఉంది. అదే సునీతా బిశ్వాల్‌కు అనుకూలంగా మారుతుందన్న అంచనాలున్నాయి. ఒడిశా సుందర్‌గఢ్ నియోజకవర్గంలో 2000 సంవత్సరం నుంచి జుయల్ ఒరమ్, హేమానంద బిశ్వాల్ మధ్యే పోటీ ఉంటోంది. బిశ్వాల్ కుమార్తెను రంగంలోకి దింపడం ద్వారా నవీన్ తెలివిగా వ్యవహరించారన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇక, బీరమిత్రపూర్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న జార్జ్ తిర్కీ కాంగ్రెస్ గూటికి చేరుకొని ఈ లోక్‌సభ బరిలో సవాల్ విసురుతున్నారు. సుందర్‌గఢ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 2.6 లక్షల ఓట్లు సంప్రదాయంగా పడుతూ వస్తున్నాయి. దానికి తోడు తనకున్న వ్యక్తిగత ఇమేజ్ ద్వారా లక్ష ఓట్ల వరకు సంపాదించగలరని అంచనా. దీంతో జార్జ్ తిర్కీ బలమైన అభ్యర్థిగానే మారారు. అయితే అన్ని పార్టీల్లోనూ రెబెల్స్ బెడద ఉండటంతో ఈసారి వీరు ఏ పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీస్తారోనన్న ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని సాధించడం కోసం పార్టీ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా చాలామంది నాయకులపై వేటు వేసింది. వీరంతా సుందర్‌గఢ్ బరిలో నిలవడంతో అన్ని పార్టీలకు గండంగా మారింది. -
తప్పిన ఘోర రైలు ప్రమాదం
-
ఇకపై హెల్మెట్ ఉంటేనే పెట్రోల్..
బరంపురం(ఒడిశా): హెల్మెట్ లేని వాహనాలకు ఈ నెల 16వ తేదీ నుంచి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ సరఫరా చేయరాదని కలెక్టర్ ప్రేమ్‌చంద్ చౌదరి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జిల్లా హెడ్‌క్వార్టర్ ఛత్రపూర్‌లో గల డీఆర్డీఏ సమావేశం హాల్లో జిల్లాస్థాయి రహదారి రక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ ప్రేమ్‌చంద్ చౌదరి మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి పెట్రోల్ వినియోగదారులు వాహనాలతో పాటు హెల్మెట్ ధరించిన వారికే బంకుల్లో ప్రెట్రోల్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆశిష్ కుమార్ సింగ్‌ను ఆదేశించారు. ఇందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఈ వ్యవహార శైలిపై కఠినంగా వ్యవహరించాలని కూడా ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఇందుకోసం మిగిలి ఉన్న 14 రోజులు ప్రజలు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలను చైతన్యపరిచేందుకు జిల్లావ్యాప్తంగా చైత్యన్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. ట్రాఫిక్, పోలీసు, రోడ్డు రవాణా సంస్థలు ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. హెల్మెట్ లేని వాహనాలకు పెట్రోల్ సరఫరా చేసిన పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎటువంటి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అయా పోలీసు స్టేషన్ల ఐఐసీ అధికారులు ముఖ్య భూమిక పోషించాలని సూచించారు. అంతేకాకుండా ప్రతి పెట్రోల్ బంకులో సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. ప్రమాదాలు జరిగితే పెట్రోల్ బంకులదే బాధ్యత జాతీయ రహదారిలో సంభవిస్తున్న దుర్ఘటనలపై తగు చర్యలు కూడా వెంటనే తీసుకోవాలన్నారు. ఎస్పీ ఆశిష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ జాతీయ రహదారి లో గల పెట్రోల్ పంపుల్లో ఇంధనం పోసి బయలు దేరిన వాహనాలు దుర్ఘటనలకు గురైతే పెట్రోల్ బంకు యాజమాన్యాలదే బాధ్యతగా పరిగణిస్తామని హెచ్చరించా రు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ట్రాఫిక్ వ్యవహారంపై పూర్తిస్థాయిలో చర్యలు అమలు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులు, మినీ బస్సుల రవా ణా వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి తగు ఏర్పాట్లు చేపట్టాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, యాజ మాన్య కమిటీలను ఆదేశించారు. సమావేశంలో ట్రాఫిక్ డీఎస్పీ ఠాకుర్ ప్రసాద్, సంజయ్‌కుమార్ బిశ్వాల్, బరంపురం సబ్–కలెక్టర్ సిద్ధాంత్ స్వంయి, ఛత్రపూర్ సబ్–కలెక్టర్ సుదరక్ సబర్ తదితరులు పాల్గొన్నారు.