కాషాయ పార్టీ ఓటింగ్ శాతం 35.08కు పెరుగుదల..
అసెంబ్లీ ఎన్నికల కంటే 21.08 శాతం వృద్ధి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఓటింగ్ శాతాన్ని బీజేపీ గణనీయంగా 35.08 శాతానికి పెంచుకుంది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14 శాతం ఓటింగ్‌తో 8 ఎమ్మెల్యే సీట్లలో గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 21.08 ఓటింగ్ శాతం పెంచుకొని మొత్తంగా 35.08 శాతాన్ని సాధించడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికలు అప్పటి అధికారపార్టీ బీఆర్‌ఎస్– ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీల మధ్య సాగడంతో బీజేపీ మూడోస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.
ప్రస్తుతం దేశంలో జాతీయ రాజకీయాలకు ఏర్పడిన ప్రాధాన్యత, మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అవుతారనే అంచనాల మధ్య లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి పక్షాల మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో... తెలంగాణలో ప్రధానంగా జాతీయపార్టీలైన బీజేపీ–కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోటీ ఏర్పడడంతో భారత రా్రïÙ్టయ సమితి (బీఆర్‌ఎస్) మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
జాతీయ రాజకీయాలకు ఏర్పడిన ప్రాధాన్యం దృష్ట్యా పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఓటింగ్ బీజేపీకి బదిలీ అయ్యిందనే అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు కావడంతో స్వతాహాగా బీజేపీ ఓటింగ్ శాతం పెరగడంతో పాటు, బీఆర్‌ఎస్ ఓట్లు కొంత మేర బీజేపీకి పడడంతో ఒక్కసారిగా ఓటింగ్‌శాతం 35.08 శాతానికి చేరుకుందని లెక్కలు కడుతున్నారు.
2.02 % ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ ఓటమి
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 39.4 శాతం ఓట్లను సాధించి అగ్రస్థానంలో నిలవగా, బీఆర్‌ఎస్ పార్టీ 37.35శాతం ఓట్లను సాధించింది. బీఆర్‌ఎస్‌తో పోల్చితే కేవలం 2.05 శాతం ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడం గమనార్హం. బీజేపీ 13.9శాతం, ఎంఐఎం 2.22 శాతం, బీఎస్పీ 1.37శాతం ఓట్లను దక్కించుకున్నాయి. ఎన్నికల్లో పోలై న మొత్తం 2,32,59,256 ఓట్లలో కాంగ్రెస్ 92,35,792, బీఆర్‌ఎస్ 87,53,924, బీజేపీ 32,57,511, ఎంఐఎం 5,19,379 ఓట్లను సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment