దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లను ఆకట్టకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 20 లోక్‌సభ స్థానాలున్న కేరళలో ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలో 24 శాతమున్న ముస్లింల ఓటింగ్ సరళిపైనే అందరి దృష్టి నెలకొంది. ఇది ఎన్నికల్లో గేమ్ చేంజర్ కానున్నదననే మాట వినిపిస్తోంది.
కేరళలోని 3.30 కోట్ల జనాభాలో ముస్లింల జనాభా 24 శాతం కాగా, క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినవారు 17 శాతం ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ 19 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ కమలం వికసించలేకపోయింది. 2019లో ముస్లింలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌కు ఓటు వేశారు. అయితే సీఎం విజయన్ ఈ ట్రెండ్‌ను తిప్పికొట్టి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ముస్లిం ఓట్లను దక్కించుకున్నారు.
ఈసారి కూడా ముస్లింల ఓటింగ్ సరళి నిర్ణయాత్మక అంశంగా మారనుంది. ఈ నేపధ్యంలో ముస్లిం సమాజాన్ని ప్రభావితం చేసేందుకు వామపక్షాలు, కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడో స్థానంలో నిలిచి, కేవలం 15.64 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది.
రాష్ట్రంలో అత్యధికంగా 19 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో 47.48 శాతం ఓట్లను దక్కించుకుంది. అదే సమయంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్‌కు కేవలం ఒక్క సీటు మాత్రమే లభించగా, 36.29 శాతం ఓట్లు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎంల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇదే సమయంలో బీజేపీ కూడా కొన్ని సీట్లు గెలవాలని ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment