
కొండపి (సింగరాయకొండ): తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లను ఎలా నమోదు చేసింది, 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఓటర్ల జాబితాను ఏ విధంగా తారుమారు చేశారనే వాటిపై ఆధారాలతో సహా భారత ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లా కొండపి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
టీడీపీ ఓటర్ల జాబితాలో చేసిన అవకతవకలపై వైఎస్సార్‌సీపీ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించిందని, విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని చెప్పారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎటువంటి ఆవేదన, సమస్యలు లేవన్నారు. జిల్లాకు బాలినేని అత్యంత విలువైన నాయకుడని, పార్టీలో ఆయన ప్రాధాన్యత ఏ రోజూ తగ్గదని చెప్పారు. సీఎంకు అత్యంత సన్నిహితుడైన బాలినేని వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీచేస్తారన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు గెలుపే లక్ష్యంగా 3 జాబితాలను విడుదల చేశామని, త్వరలో నాలుగో జాబితా ఉంటుందని తెలిపారు. మాగుంట ఎన్నికల్లో పోటీ చేయాలంటే చంద్రబాబును తిట్టాలని, రూ.150 కోట్లు ఇవ్వాలని షరతులు పెట్టారని ప్రచారం జరుగుతుందని, ఇది వాస్తవం కాదా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఇది కేవలం మీడియా, టీడీపీ, చంద్రబాబు సృష్టిస్తున్న కథనం మాత్రమేనని చెప్పారు.
విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో సహజమన్నారు. ‘మా అధినాయకుడిని విమర్శిస్తే తిప్పికొట్టడం ఆయన అనుచరులుగా మా బాధ్యత. ఈ బాధ్యతను పార్టీలోని ప్రతి ఒక్కరు తప్పకుండా నిర్వర్తించాలి్సందే..’ అని ఆయన స్పష్టం చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment