
ఓట్ల కోసం ముస్లింలను మోసగిస్తున్నాయి
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు ఓట్ల కోసం ముస్లింలను మోస గిస్తున్నాయని, ఈ పార్టీల మాటలను నమ్మొద్దని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లపై బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు ఓట్ల కోసం ముస్లింలను మోస గిస్తున్నాయని, ఈ పార్టీల మాటలను నమ్మొద్దని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా అఫ్సర్ పాషా బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడారు. ముస్లింల ట్రిపుల్ తలాఖ్, రిజర్వేషన్లపై తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని, ఏ మతానికి సంబంధించిన మహిళలకూ అన్యాయం జరగవద్దనేది తమ పార్టీ విధానమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు పాల్గొన్నారు.