కోట్లు చూసి ఓట్లు వేయరు | Quotes by the lack of votes | Sakshi
Sakshi News home page

కోట్లు చూసి ఓట్లు వేయరు

Published Thu, Nov 5 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

కోట్లు చూసి ఓట్లు వేయరు

కోట్లు చూసి ఓట్లు వేయరు

ప్రజా చైతన్యానికి ఓరుగల్లు పురిటిగడ్డ అని.. ఇక్కడి ప్రజలు కోట్లను చూసి ఓట్లు వేయరని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

ఓటర్లకు నిజమేంటో తెలుసు
భారీ నీటిపారుదల శాఖ
మంత్రి తన్నీరు హరీష్‌రావు

 
హన్మకొండ :   ప్రజా చైతన్యానికి ఓరుగల్లు పురిటిగడ్డ అని.. ఇక్కడి ప్రజలు కోట్లను చూసి ఓట్లు వేయరని  భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని హయగీవ్రచారి మైదానం లో బుధవారం టీఆర్‌ఎస్ ఎన్నికల బహిరంగ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా  మంత్రి  హరీ ష్‌రావు  హాజరై మాట్లాడారు. వరంగల్ జిల్లా ప్రజలు ఆత్మగౌరవం కలిగినవారని.. ఈ ప్రాం త  ఓటర్లకు నిజమేంటో తెలుసని చెప్పారు. బీజేపీ కోట్లను చూసి, పార్టీ సభ్యుడు కాని వారి కి టికెట్ ఇచ్చిందని విమర్శించారు. ఉప ఎన్నిక లో విపక్షాల నోళ్లు మూయించే విధంగా  ఫలి తాలుండాలన్నారు.   తెలంగాణ  ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న  టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూ రి దయాకర్‌ను గెలిపించాలన్నారు.   హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇప్పటికే పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఎస్సారెస్పీ కాలువ నిర్వీర్యమైందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని కోణాల్లో ఆలోచించి, జిల్లా నేతల అభిప్రాయాలు సేకరించి పసునూరి దయాకర్‌కు టికెట్ ఇచ్చారన్నారు.

ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాం గ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించి మిద్దెలు కట్టుకోవడంపై నే దృష్టిపెడతారని ఆరోపించారు. అధికారం లో ఉన్న సమయంలో వారికి  పేదల కష్టాలు  పట్టవన్నారు. వ్యవసాయశాఖ మంత్రి పోచా రం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను  ప్రజలకు తెలియ జేయాలన్నారు.  గతంలో వచ్చిన మెజారిటీకి వడ్డీ కలిపి అదనపు మెజారిటీ సాధించాలన్నా రు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు 60 ఏళ్లలో చేయని అభివృద్ధి సీఎం కేసీఆర్ 16 నెలల్లో చేసి చూపించారన్నారు.  టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ మాట్లాడుతూ పార్టీ కోసం బాధ్యతగా పనిచేసినందుకు గుర్తింపు దక్కిందన్నారు. ఎన్నికల్లో తనను  ఆదరించి గెలిపించా లని కోరారు. సభలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షు డు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్, జెడ్పీ చైర్‌పర్సన్  పద్మ, ఎంపీలు బో యినిపల్లి వినోద్‌కుమార్, అజ్మీరా సీతారాంనాయక్, గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు బోడకుంట్ల వెంకటేశ్వ ర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య,  దాస్యం వినయ్ భాస్కర్, కొండా సురేఖ, రెడ్యానాయక్, అరూరి రమేష్, శంకర్‌నాయక్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల భిక్షపతి, నాయకుల కన్నెబోయిన రాజయ్య యాదవ్, గుడిమల్ల రవికుమార్, సత్యవతి రాథోడ్, ఎన్.సుధాకర్‌రావు, ముద్దసాని సహోదర్‌రెడ్డి, మార్నేని రవీందర్‌రావు, యాదవరెడ్డి, వాసుదేవరెడ్డి, రమేష్, వెంకటేశ్వర్లు, భరత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

 ర్యాలీ రద్దు...
 కలెక్టరేట్ సమీపంలోని రెవెన్యూ కాలనీలో మాజీ ఎంపీ రాజయ్య నివాసంలో చోటుచేసుకున్న దుర్ఘటన నేపథ్యంలో పోలీసులు టీఆర్‌ఎస్ నామినేషన్ ర్యాలీని రద్దు చేశారు. కాగా, సభ అనంతరం ర్యాలీగా వెళ్లి  అభ్యర్థి పసునూ రి దయాకర్ నామినేషన్ వేయాలని ముందు గా నిర్ణయించారు. అయితే కలెక్టరేట్ సమీపం లో మృతిచెంది విషాదఛాయలు అలుముకున్న నేపథ్యంలో డప్పు చప్పుళ్లతో వెళ్లడం బాగుండదని  డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పా రు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పసునూరి దయాకర్ కలెక్టరేట్‌కు  వెళ్లి మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement