ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపట్టాలి
ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపట్టాలి
Published Sat, Mar 18 2017 11:11 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
–వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు కార్యాక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓట్ల లెక్కింపునకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా సెంటరు ఏర్పాటు చేసి నిబంధనలు పాటించే విధంగా చూడాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్‌పోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, పెన్‌లను అనుమతించరాదన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
కర్నూలు నుంచి కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ టౌన్ మోడల్ స్కూల్‌లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ సిబ్బందికి మొదటి దఫా శిక్షణ ఇచ్చామని, రెండో దఫా శిక్షణ ఆదివారం ఇవ్వనున్నామన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ హరికిరణ్ మాట్లాడుతూ ఎన్నికల నియమావలిని అనుసరించి అర్హత ఓట్లను, అనర్హత ఓట్లను, నోటా ఓట్లను విభజించడంలో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, ఆదోని ఆర్‌డీఓ ఓబులేసు, ఎన్నికల సెట్ సూపరింటెండెంటు ఎలిజబెత్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement