మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎన్నికపై ఈసీ నిర్ణయం
జూన్ 2న ఓట్ల లెక్కింపు.. 5 లోపు ప్రక్రియ పూర్తి
జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్‌కు ఈసీ ఆదేశాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన పక్షంలో దీని ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై చూపే అవకాశం ఉండటంతో కౌంటింగ్ చేపట్టొద్దని ఎన్నికల కమి షన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ రెండో తేదీన ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఐదో తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఎన్నికల కమిషన్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల రెండో తేదీన అంటే మంగళవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ చేప ట్టాల్సి ఉంది. జిల్లాకేంద్రంలోని బాలుర జూని య ర్ కళా శాలలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందుగా ఉప ఎన్నిక రావడం.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటాపోటీ వ్యూహాలతో క్యాంప్ రాజకీ యాలకు తెరలేపడం.. సీఎం రేవంత్ సొంత ఇలా కాలో జరుగుతున్న పోరు కావటంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఉమ్మడి మహబూనగర్ జిల్లాపైనే పడింది. ఫలితాల కోసం పార్టీలు ఆతృతగా ఎదురు చూస్తున్న క్రమంలో కౌంటింగ్ వాయిదా పడడంతో నాయకుల్లో నిరుత్సాహం అలుముకుంది.
Comments
Please login to add a commentAdd a comment