counting Updates
- మహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం
- బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై గెలుపొందారు.
- 111 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు.
- బీఆర్‌ఎస్ 763, కాంగ్రెస్ 652 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్-1 ఓటు వచ్చింది, 21 చెల్లని ఓట్లుగా నిర్ధారణ
- మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
- దీంతో సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
- తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.
- ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది.
హరీశ్ రావు శుభాకాంక్షలు
- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఘన విజయం సాధించిన బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ శుభాకాంక్షలు తెలిపారు.
గెలుపుకు కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఘన విజయం సాధించిన @BRSparty అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు.
గెలుపుకు కృషి చేసిన బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. pic.twitter.com/6ZWaoUZFxV— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2024
మహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి వి
- మహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
- మొత్తం 1437 మంది ఓట్లను ప్రాధాన్యత క్రమంలో లెక్కిస్తున్నారు.
- ముగ్గురు అభ్యర్దులు పోటీ పడుతున్నారు.
- పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
- మహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది.
- ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది.
- విస్త్రత ఏర్పాట్లు చేసిన అధికారులు
- పోటీలో ముగ్గురు అభ్యర్దులు
- బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి బరిలో నిలిచారు.
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
- దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
- గత మార్చి28న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- మొత్తం 1437 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 14 మంది ఎమ్మెల్యేలు, 83 మంది జడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 449 మున్సిపల్ కౌన్సిలర్లు ఓటేశారు.
- ఇద్దరు ఎంపీటీసీలు తమ వ్యక్తిగత కారణాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
- మార్చి 28నే పోలింగ్ జరిగినా.. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఫలితాలను నేటికి (జూన్ 2) వాయిదా వేసింది.
- దీంతో నేడు వెలువడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై ఇరు పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment