ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, దండేపల్లి (మంచిర్యాల): ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)ల రంగ ప్రవేశంతో ఇక చెల్లని ఓట్లకు చెక్ పడింది. గతంలో ఈవీఎంలు లేకముందు బ్యాలెట్ పేపరుపై స్వస్తిక్ ముద్ర వేసి ఓటు హక్కు వినియోగించుకునేది. కొన్ని సందర్భాల్లో స్వస్తిక్ ముద్ర సరిగా పడకపోవడం, ఓటు మడిచే సమయంలో గుర్తు ఇద్దరు అభ్యర్థులపై పడడం, మరికొన్ని సందర్భాల్లో స్వస్తిక్ ముద్ర వేయకుండానే ఓటును బ్యాలెట్ బాక్సులో వేసేవారు. ఇలాంటి వాటన్నింటిని చెల్లని ఓట్లుగా పరిగణించేవారు. కానీ ఈవీఎంల రాకతో ఓటు వేయదలుచుకున్న అభ్యర్థి గుర్తు పక్కన మీట నొక్కాలి, లేదంటే నోటా మీట నొక్కాలి. దీంతో చెల్లని ఓట్లు అనే మాటేలేదు.
Comments
Please login to add a commentAdd a comment