ఓట్లేయనోళ్లకు పనులెట్లా చేయాలె.. | how to do works in not vote for party | Sakshi
Sakshi News home page

ఓట్లేయనోళ్లకు పనులెట్లా చేయాలె..

Published Wed, May 13 2015 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

ఓట్లేయనోళ్లకు పనులెట్లా చేయాలె..

ఓట్లేయనోళ్లకు పనులెట్లా చేయాలె..

కన్నాయిగూడెం ప్రజలతో మంత్రి చందూలాల్

ములుగు: మాకు ఓట్లు వేయనోళ్లకు మేము ఎట్లా పని చేసి పెట్టాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వరంగల్ జిల్లా ములుగు మండలం కన్నాయిగూడెం ప్రజల ను ప్రశ్నించారు. కన్నాయిగూడెంలో మంగళవారం బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి మంత్రి వచ్చారు. నియోజకవర్గంలోని అన్నిరోడ్లు పూర్తయ్యాక ఈ పనులు ప్రారంభిస్తామని అన్నారు.

పంచాయతీ, పీఏసీఎస్, ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామస్తులు సహకరించలేదని గుర్తు చేశారు. తర్వాత తేరుకున్న మంత్రి గ్రామపెద్దలను పిలిపించుకొని తన ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. చివరికి ఆయన రోడ్డు పనులను ప్రారంభించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement