reign
-
అయోవాలో ప్రారంభమైన నాట్స్ ప్రస్థానం
అమెరికాలో తెలుగుజాతి ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాన్ని ప్రారంభించి తెలుగు వారికి సేవలందిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా అయోవాలో నాట్స్ చాప్టర్ ప్రారంభించింది. అయోవా చాప్టర్ సమన్వయకర్తగా శివరామకృష్ణారావు గోపాళంకు నాట్స్ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. కృష్ణ ఆకురాతి, నవీన్ ఇంటూరి, జగదీష్ బాబు బొగ్గరపు, గిరీష్ కంచర్ల, డాక్టర్ విజయ్ గోగినేని, శ్రీని కాట్రగడ్డ తదితర సభ్యులు నాట్స్ అయోవా చాప్టర్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించనున్నారని తెలిపింది.నాట్స్ అయోవా చాప్టర్ ప్రారంభోత్సవంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టిపి రావు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ హరీష్ జమ్ముల, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మెంబర్షిప్ రామకృష్ణ బాలినేని తోపాటు చికాగో చాప్టర్ కోఆర్డినేటర్ వీర తక్కెళ్ళపాటి, షికాగో చాప్టర్ కమ్యూనిటీ సర్వీస్ లీడర్ అంజయ్య వేలూరు తదితరులు పాల్గొన్నారు.మనం పూర్వ జన్మలో చేసిన కర్మఫలం వల్ల, మన తల్లిదండ్రులు చేసిన మంచి పనుల వల్ల మనం ఈరోజు ఇక్కడ ఉన్నామని, అలాగే మనం చేసే ఈ సమాజ సేవ మరుసటి తరానికి, మన పిల్లల భవిష్యత్తుకి తోడ్పడుతుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. అయోవా నాట్స్ జట్టు సభ్యులకు చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలు, సాధించాల్సిన లక్ష్యాలను ప్రశాంత్ పిన్నమనేని నిర్థేశించారు. తెలుగు వారి అవసరాలకు అనుగుణంగా నాట్స్ కార్యకలాపాలను విస్తృతం చేయాలని, సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి పిలుపునిచ్చారు. నాట్స్ తన కార్యక్రమాల ద్వారా ఆర్థిక సహాయంతో పాటు సమాజంలో ఉన్న అందర్నీ ఒకటి చేయడానికి పలు కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. మన సంస్కృతిని భాషని కాపాడటం తో పాటు సంఘ సేవ, సమాజ సేవ అనేది నాట్స్ లక్ష్యాల్లో భాగమని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. డాక్టర్స్ హెల్ప్ లైన్ ద్వారా సెకండ్ ఒపీనియన్ ఎంతోమందికి ఉపయోగపడిందని, అనేక మంది డాక్టర్లు నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా సేవలందిస్తున్నారు అని తెలిపారు. నాట్స్ ద్వారా కొత్త స్నేహితులను పొందటంతో పాటు వృత్తిపరంగా కూడా అభివృద్ధి సాధించడానికి వీలు పడుతుందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టిపి రావు అన్నారు. కొత్త జట్టు సభ్యులందరూ నాట్స్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.శ్రీ హరీష్ జమ్ముల అయోవా టీంని పరిచయం చేసి, వారికి తన అభినందనలు తెలిపారు. నాట్స్ కార్యక్రమాలను, మహిళా సాధికారత కార్యక్రమాలను రామకృష్ణ బాలినేని వివరించారు. నాట్స్ సంస్థలో మహిళలు, పిల్లలు చురుకుగా పాల్గొనాలని అందరినీ కోరారు. దసరా పండుగనాడు అయోవా చాప్టర్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, అయోవా తెలుగు వారందరూ కలిసి అయోవా నాట్స్ చాప్టర్‌ని మరింత వృద్ధిలోకి తీసుకురావడానికి పాటుపడతామని శివరామకృష్ణ రావు గోపాళం హామీ ఇచ్చారు. అయోవా లో నాట్స్ తన కార్యకలాపాలను ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందని, అయోవాలో చాప్టర్‌ని ప్రారంభించిన మొట్టమొదటి తెలుగు సంస్థ నాట్స్ అని కృష్ణ ఆకురాతి తెలిపారు.గిరీష్ కంచర్ల,నవీన్ ఇంటూరి సభకు విచ్చేసిన అతిధులు అందరికీ భోజన సదుపాయాలు కల్పించారు.జగదీష్ బాబు బొగ్గరపు, డాక్టర్ విజయ్ గోగినేని, నవీన్ ఇంటూరి, శ్రీని కాట్రగడ్డ, గిరీష్ కంచర్ల మొదలైన వారు నాట్స్ లో భాగస్వామ్యం కల్పించినందుకు జాతీయ కార్యవర్గానికి తమ కృతజ్ఞతలు తెలిపారు. చాప్టర్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహాయ సహకారాలు అందించిన సమన్విత వర్మ, శ్రీనిధి కొంపెల్ల, సుమన్ ఒంటేరు, జయంత్ గద్దె, సురేష్ కావుల, డాక్టర్ సుందర్ మునగాల తోపాటు అయోవా తెలుగువారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. -
ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీలు.. ఎన్కౌంటర్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యమట.. ఆ రాజ్యంలో ఏం జరిగిందో మనకు తెల్వదా?, అంత తొందరగా మరచిపోతమా?. ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్కౌంటర్లు, ఎమర్జెన్సీలు.. జైలు పాలు చేసే బానిస బతుకులే కదా. తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డది ఆ పాలనలోనే కదా. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సంపదను పెంచుకుంటూ అభివృద్ధి పథంలో సాగే పాలన కావాలా? రైతుబంధు, ఉచిత విద్యుత్, ధరణిలపై అక్కసు వెళ్లగక్కుతూ దళారీల పాలన తెస్తామంటున్న ఇందిరమ్మ రాజ్యం కావాలా? మీరంతా ఆలోచించాలి. రాష్ట్ర సాధన తర్వాత తొమ్మిదేళ్లలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగాం. ఇలాంటి ప్రభుత్వాలను బలపరిస్తేనే భవిష్యత్ తరాలకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అధికార బీఆర్ఎస్ను బలపరచాలి..’ అని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా నస్పూర్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. తల్లులకు మొక్కినం..రాష్ట్రం సాధించుకున్నం ‘సమ్మక్క సారలమ్మ నేలకు వందనం. రాష్ట్రం కోసం తల్లులకు మొక్కినం. ఎన్నోసార్లు మా తెలంగాణ రావాలని బంగారం ఇచ్చాం. మొక్కులు చెల్లించినం. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం. 15 ఏళ్లు మడమ తిప్పకుండా పోరాటం చేసి సాధించుకున్నాం. అంతకుముందు ఈ జాతరకు అంత ఆదరణ లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లతో బ్రహా్మండంగా నిర్వహిస్తున్నాం. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. తొలుత ప్రజా సంక్షేమ సంకల్పంతో విధి వంచితులైన వితంతువులు, వృద్ధులు, వికలాంగుల లాంటి వారిని పరిగణనలోకి తీసుకొని బిర్యానీ కాకపోయినా పప్పు, చారుతోనైనా తినాలని, ఆసరా పింఛన్ రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచాం. ఈ ఎన్నికల తర్వాత రూ.5 వేల వరకు పెంచుతాం. చందూలాల్ ఉన్నప్పుడు ములుగు తండావాసీ బాధ చూసి కూతురి పెళ్లికి సాయం చేశాం. ఆ తర్వాత కల్యాణలక్ష్మి ప్రారంభించాం. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి పథకాలు ఒక్కటైన తెచ్చారా? పక్కన గోదావరి, కృష్ణానది ఉన్నా.. ఎక్కడా తాగునీటి కల్పనకు చర్యలు తీసుకోలేదు. కానీ బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లా ఆరోగ్య సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ పథకం అమలు చేశాం. 44,861 ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడమే గాకుండా కేసులు ఎత్తేసి, రైతుబంధు అమలు చేసి, త్రీఫేజ్ కరెంటు సరఫరా పనులు చేపట్టాం. పల్లె, బస్తీ దవాఖానాల్లో ఉచితంగా పరీక్షలు చేస్తున్నాం. కేసీఆర్ కిట్లు ఇస్తున్నాం. గిరిజనేతర పోడు భూమి రైతులకు కూడా పట్టాలు ఇప్పిస్తాం..’ అని కేసీఆర్ చెప్పారు. దొంగల చేతిలో రాష్ట్రాన్ని పెట్టొద్దు ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 80 నియోజకవర్గాల్లో పర్యటించా. ఇంకో ఇరవై తిరుగుతా. కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు.. తుస్సుమంది. వచ్చేది లేదు.. చచ్చేదీ లేదు. తప్పిదారి ఆ పారీ్టకి అధికారం ఇస్తే వైకుంఠం ఆటలో పెద్దపాము మింగినట్లే. తెలంగాణలోనూ కర్ణాటక తరహాలోనే దగా చేస్తారు. మళ్లీ దొంగల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టొద్దు. రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్ 3 గంటలు సరిపోతుందంటోంది. 30 లక్షల పంపుసెట్లను 10 హెచ్‌పీకి పెంచితే అయ్యే రూ.50 వేల కోట్లు ఎవరు ఇస్తారు?. భూ భద్రతతో పాటు రైతుబంధు డబ్బులు నేరుగా ఖాతాల్లో పడే సాంకేతికతతో కూడిన ధరణిని ఎద్దు ఎవుసం తెలియని రాహుల్‌గాంధీ బంగాళాఖాతంలో పడేస్తరట. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నాం. మొన్ననే సింగరేణి కారి్మకులకు బోనస్ కానీ, లాభాల్లో వాటా కానీ..రూ.1,000 కోట్ల వరకు పంచినం. సింగరేణి తెలంగాణకు సిరులతల్లి.. దీన్ని మరింత విస్తరిస్తాం. బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఇకపై దాని బాధ్యతలను సైతం సింగరేణి తీసుకుంటుంది. రాష్ట్రంలో ఎక్కడ మైనింగ్‌కు అవకాశాలున్నా సింగరేణి ఆధ్వర్యంలో చేపడతాం. బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్లే. దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే రాష్ట్రంలో పెట్టాలని వంద లేఖలు రాసినా పట్టించుకోలేదు. బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రతి జిల్లాకు నవోదయ, మెడికల్ కాలేజీ ఇయ్యని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?..’ అని కేసీఆర్ ప్రశ్నించారు. మంచి ఎమ్మెల్యే గెలిస్తే, మంచి గవర్నమెంట్ వస్తది ‘ఓటేసే ముందు పారీ్టల చరిత్ర, నడవడిక, దృక్పథం పరిగణనలోకి తీసుకోవాలి. మంచి ఎమ్మెల్యే గెలిస్తే, మంచి గవర్నమెంట్ వస్తది. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగా అభివృద్ధి చెందుతుందో ఆలోచించాలి. కాంగ్రెస్ 50 సంవత్సరాల్లో దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన తీరు, బీఆర్ఎస్ పాలన తీరు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎవరైతే న్యాయంగా అవసరమైన పేదలకు పని చేయగలుగుతారో చూసి ఓటెయ్యాలి..’ అని కేసీఆర్ కోరారు. ‘గతంలో ములుగులో ఓడించారు. మీమీద అలిగిన. ఇప్పుడు గెలిపించకుంటే మీతో పంచాయితీ పెట్టుకుంటా..’ అని అన్నారు. ఆయా సభల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బడే నాగజ్యోతి (ములుగు), గండ్ర వెంకటరమణా రెడ్డి (భూపాలపల్లి), నడిపెల్లి దివాకర్‌రావు (మంచిర్యాల), కోరుకంటి చందర్ (రామగుండం), మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కవిత, వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్ల చంద్రబాబు పాలన మోసం అంటున్న ప్రజలు
-
మార్కెట్ యార్డుల్లో సకల వసతులు
- రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు గజ్వేల్ యార్డులో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు గజ్వేల్: రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డుల్లో గోదాములు, ఇతర వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖామంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ మార్కెట్ యార్డులో రూ.5.85కోట్లతో చేపట్టిన రెండు 2,500 మెట్రిక్ టన్నుల గోదాములు, కవర్ షెడ్లు, రైతు విశ్రాంతి, సమావేశ భవనం, సీసీ రోడ్లు, ఆర్చ్ తదితర పనులను ప్రారంభించారు. అలాగే ములుగు మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. గజ్వేల్, సిద్దిపేట, మెదక్, నర్సాపూర్ మార్కెట్ యార్డుల్లో ఇప్పటికే వసతుల కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. కొత్తగా రూ.4కోట్లతో కొండపాక మార్కెట్‌యార్డు అభివృద్ధికి సంకల్పించామన్నారు. ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్ యార్డును అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. వర్గల్ మండలం పాతూరు రోడ్డు వద్ద కూరగాయలు, పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారుల కోసం షెడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం స్థల సేకరణ చేపట్టాలని ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావును ఆదేశించారు. ములుగు మండలం దామరకుంటలో 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను, ములుగులోని గురుకుల పాఠశాలలో డార్మెటరీ, ల్యాబ్‌లను మంత్రి ప్రారంభించారు. పాఠశాల ప్రహరీకి రూ.36లక్షలు, మరమ్మతులు, రంగులు వేయడానికి రూ.16 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మంత్రి హరీశ్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓట్లేయనోళ్లకు పనులెట్లా చేయాలె..
కన్నాయిగూడెం ప్రజలతో మంత్రి చందూలాల్ ములుగు: మాకు ఓట్లు వేయనోళ్లకు మేము ఎట్లా పని చేసి పెట్టాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వరంగల్ జిల్లా ములుగు మండలం కన్నాయిగూడెం ప్రజల ను ప్రశ్నించారు. కన్నాయిగూడెంలో మంగళవారం బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి మంత్రి వచ్చారు. నియోజకవర్గంలోని అన్నిరోడ్లు పూర్తయ్యాక ఈ పనులు ప్రారంభిస్తామని అన్నారు. పంచాయతీ, పీఏసీఎస్, ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామస్తులు సహకరించలేదని గుర్తు చేశారు. తర్వాత తేరుకున్న మంత్రి గ్రామపెద్దలను పిలిపించుకొని తన ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. చివరికి ఆయన రోడ్డు పనులను ప్రారంభించారు. -
వసతి గృహాలకు పెద్దపీట
కాళ్ల, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విద్యతోపాటు వసతిగృహాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. శిథిలావస్థకు చేరిక హాస్టళ్ల స్థానంలో అధునాతన సౌకర్యాలతో కూడిన భవనాలను నిర్మించారు. ఈ కోవకు చెందుతుంది కాళ్లలోని బాలికల సమీకృత వసతి గృహం (ఇంటిగ్రేటెడ్ హాస్టల్). కాళ్ల మండలంలో కాళ్ల, బొండాడలో బాలికల వసతి గృహాలు ఉండేవి. వీటిలో ఈ ప్రాంతంతో పాటు కృష్ణా జిల్లాలోని శివారు గ్రామాలకు చెందిన బాలికలు వసతి పొందేవారు. అయితే ఇక్కడ హాస్టళ్లకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థినులు అవస్థలు పడేవారు. 2007లో అప్పటి ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఈ విషయాన్ని మహానేత వైఎస్సార్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మహానేత కాళ్లలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి రూ.1.68 కోట్ల నిధులు మంజూరుచేశారు. 2008 జనవరిలో ఈ హాస్టల్ నిర్మాణ ప్రారంభమైంది. ఎనిమిది విశాలమైన గదులు, డైనింగ్‌హాల్, కిచెన్ హాల్, వెయిటింగ్ రూమ్, ఆఫీస్ రూమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో హాస్టల్ రూపుదిద్దుకుంది. ఇది గ్రామంలో వైఎస్ ముద్రగా నిలిచిపోయింది.