
పది పాక్ తలలు నరికి బదులివ్వాలన్నారుగా..
న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్జికల్ దాడిని త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమర వీరులైన సైనికుల కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. హేమ్ రాజ్ కుటుంబంతో సహా సర్జికల్ దాడిని నిలదీస్తున్నాయి. ఓట్ల కోసం సర్జికల్ దాడుల వంటివి ఉపయోగించరాదని హేమ్ రాజ్ కుటుంబం పేర్కొంది. 2013 జనవరిలో పాక్ ఉగ్రవాదులు సైనికుడు అయినటువంటి హేమ్‌రాజ్ తలను నరికేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురా జిల్లాలో శేర్‌నగర్ హేమ్‌రాజ్ గ్రామం. అతడి తల్లి తాజాగా స్పందిస్తూ ‘సర్జికల్ దాడులు జరిగినట్లు ఎక్కడ ఆధారాలు? హేమ్ రాజ్ తల నరికిన చంపిన వ్యక్తిని చంపేశామని భారత సైన్యం చెప్పుకుంది.
కానీ అది ప్రభుత్వం వర్షన్‌మాత్రమే. హేమ్ రాజ్‌కోసం ఇది అసలు బదులు తీర్చుకోవడమే కాదు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి భారతీయ సైనికుడికి ఒక్కో పాకిస్థానీ తలను ఇలా మొత్తం పది తలలతో బదులు తీర్చుకోవాలని సుష్మా స్వరాజ్ తెలిపారు. మధురలో శేర్‌నగర్ ప్రాంతానికి చెందిన సైనికుడు బబ్ల్యూ సింగ్ అనే వీర సైనికుడి భార్య కూడా ఘటుగా స్పందించారు. అసలు సర్జికల్ దాడులు ఎక్కడ జరిపిందని, ప్రభుత్వం మాత్రం వారంతా చనిపోయారని చెప్పిందని.. నిజంగా సర్జికల్ దాడులు జరిగాక కూడా వారు మళ్లీ ఎందుకు దాడులు చేస్తూనే ఉన్నారని ఆమె ప్రశ్నించింది. ఇలా చాలా మంది సర్జికల్ దాడులపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.