కుప్పంలో తప్పిన లెక్కలు.. వికటించిన వ్యూహాలు
ఇన్నాళ్లూ చంద్రబాబును గెలిపించింది 51 వేల దొంగ ఓట్లే
రెండు విడతలుగా ఆ ఓట్ల తొలగింపు
దీంతో ఓటమికి దగ్గరవుతూ వచ్చిన బాబు
స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం
35 ఏళ్లుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైనం
వైఎస్సార్‌సీపీ రాకతో ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ది
మారుతూ వచ్చిన ఓటర్ల తీర్పు.. గత ఎన్నికల్లో తగ్గిన మెజారిటీ
ఈ దఫా ఓటమి ఖాయం అని తేలడంతో కుటుంబ సమేతంగా పరుగులు
కుప్పంలో ఓటు, ఇల్లు లేని బాబు.. ఓటమి భయంతో ఇంటి నిర్మాణ పనులు
ఓటుకు రూ.2 వేలు పంపిణీ చేసినా విఫల యత్నమే అంటున్న స్థానికులు
చంద్రబాబు 35 ఏళ్ల కుప్పం ప్రస్థానంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లను బట్టి చూస్తే గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ గట్టి పట్టు సాధించిందని స్పష్టమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను, ఇటీవల తొలగించిన 33 వేల టీడీపీ దొంగఓట్లను పరిగణనలోకి తీసుకుంటే, మే 13న జరిగిన ఎన్నికలో కుప్పం అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భరత్ గెలుపు వాకిట నించున్నారని తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, మద్దతుదారులకు వచ్చిన ఓట్ల కంటే కేవలం 3–4 వేల ఓట్లు (0.02%) మాత్రమే అదనంగా అవసరం. అయితే భారీగా టీడీపీ దొంగ ఓట్లకు చెక్ పడటంతో కుప్పంలో చంద్రబాబు ఓడి పోబోతున్నారని స్పష్టమవుతోంది. ఇటు ఓటర్లు, అటు రాజకీయ విశ్లేషకులు, పలు సర్వే నివేదికలు చెబుతున్న వాస్తవం ఇది.
సాక్షి, తిరుపతి: ఐదేళ్ల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జరిగినంత మేలు చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ జరగలేదని, అందుకే కుప్పం ప్రజలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటెత్తారని స్పష్టమవుతోంది. 35 ఏళ్ల పాటు మాయ మాటలతో ప్రజలను నమ్మించి.. సీఎంగా, ఎమ్మెల్యేగా కొనసాగిన చంద్రబాబును కుప్పం ఓటర్లు ఈసారి శంకరగిరి మాన్యాలకు పంపుతున్నట్లు ఈవీఎంలలో ఫ్యాన్ గుర్తుపై గట్టిగా నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది.
2019 సాధారణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం వాసులు ఇచ్చిన తీర్పే.. ఇప్పుడూ పునరావృతం కాబోతోందని సమాచారం. నాటి చంద్రబాబు.. నేటి వైఎస్ జగన్ పాలనను బేరీజు వేసుకునే ఓటర్లు ఓటెత్తారని స్పష్టమవుతోంది. సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో డీబీటీ ద్వారా 4,32,067 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,400 కోట్లకుపైగా జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా మరో 3,03,080 మంది లబ్ధిదారులకు రూ.1,175.21 కోట్లు అందించారు.
కుప్పం వాసులకు కలగా మారిన కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు కృష్ణా జలాలు తీసుకొచ్చారు. చంద్రబాబు ఉన్నన్ని రోజులు అదిగో ఇదిగో అంటూ కాలం గడిపేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక హంద్రీ–నీవా సృజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొచ్చి కలను నిజం చేశారు.
కుప్పం బ్రాంచ్ కెనాల్ వివరాలు
» పలమనేరు నియోజకవర్గం అప్పిన పల్లి వద్ద 0 పాయింట్ నుంచి కుప్పం మండలం పరమసముద్రం వరకు సుమారు 124 కి.మీ వరకు హంద్రీ–నీవా కాలువ తవ్వారు.
» 5 కిలోమీటర్లలో పశు పత్తురు వద్ద, 39వ కిలోమీటర్ కృష్ణాపురం వద్ద లిఫ్ట్ ఏర్పాటు
» వి.కోట మండలం ఆదిరే పల్లి 54.కి.మీ వద్ద లిఫ్ట్‌ల ద్వారా హంద్రీ–నీవా కృష్ణా జలాలు అందించారు.
» కుప్పం నియోజకవర్గంలో 110 చెరువులకు నీళ్లివ్వడం ద్వారా 6,500 ఎకరాల ఆయకట్టుకు అండగా నిలిచారు.
» అనంతపురం జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి 300 క్యూసెక్కుల నీరు హంద్రీ–నీవా కాలువలు ద్వారా విడుదలవుతుంది. ఆవిరి, లీకేజీ పోగా 220 క్యూసెక్కుల నీరు కుప్పం చేరుతుంది. 4 లక్షల జనాభాకు తాగు నీరు అందుతుంది.
కుడి ఎడమల సంక్షేమం, అభివృద్ధి
» వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.
» కుప్పం మేజర్ పంచాయితీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి, పట్టణ అభివృద్ధి కోసం రూ.66 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు.
» నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయటంతో పాటు.. కుప్పం పోలీస్ డివిజన్ ఏర్పాటు చేశారు. ఆర్డీఓ, డీఎస్పీలను
నియమించారు.
» రూ.15 కోట్ల వ్యయంతో కుప్పం పట్టణ నడిబొడ్డు, డికే పల్లి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మించారు.
» నియోజకవర్గంలో ఏడు పురాతన దేవాలయాలు జీర్ణోద్ధరణకు సుమారు రూ.12 కోట్లు వెచ్చించారు.
» రూ.5 కోట్ల వ్యయంతో మున్సిపాలిటి పాలన వ్యవస్థ కోసం ప్రత్యేకంగా రెండు అంతస్తుల నూతన భవనాలు నిర్మించారు.
» శాంతిపురం మండలంలోని కేటీ పల్లి, పోడిచేన్లు, ప్రతిచామనూరులకు రూ 7.25 కోట్లతో తారు రోడ్లు, సిమెంట్ రోడ్డు వేయించారు.
» నియోజకవర్గంలో 78 సచివాలయాలకు రూ.87.55 కోట్లు ఖర్చు చేశారు. రూ.15.77 కోట్లతో 77 రైతు భరోసా కేంద్రాలు, రూ.7.9 కోట్లతో 58 వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
» కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మరో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.
»కుప్పంలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న వన్నె కులస్తుల కోసం క్షత్రియ భవనం ప్రారంభించారు.
బాబును గెలిపిస్తూ వచ్చింది దొంగ ఓట్లే
చంద్రబాబు 1989 నుంచి కుప్పంలో గెలుపొందుతూ వచ్చారు. కుప్పం వాసుల అమాయకత్వంతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడుకు చెందిన 52 వేల మంది పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చి.. దొంగ ఓట్లు వేయించుకోవడమే ఇందుకు కారణం. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఐఏఎస్ అధికారి చంద్రమౌళి.. బాబు దొంగ ఓట్ల బాగోతాన్ని బయటపెట్టారు.
ఎన్నికల సమయంలో కర్ణాటక, తమిళనాడు నుంచి జనం భారీగా తరలివచ్చి, ఓట్లు వేసి వెళ్లటం గమనించిన చంద్రమౌళి దొంగ ఓట్లపై విచారణ జరిపించారు. అధికారుల విచారణలో దొంగ ఓట్లు ఉన్నట్టు తేలడంతో ఇదివరకు 18 వేల ఓట్లు, ఈ ఎన్నికలకు ముందు 33 వేల ఓట్లు తొలగించారు. దొంగ ఓట్లను తొలగించటంతో పాటు కుప్పం వాసులు చైతన్య వంతులు కావటంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది.
కుటుంబ సమేతంగా కుప్పానికి పరుగు
» కుప్పంలో 2014 ముందు ఒక లెక్క. ఆ తర్వాత ఒక లెక్క అన్న చందంగా మారింది. వైఎస్సార్‌సీపీ రానంత వరకు అన్ని గ్రామాల్లో చంద్రబాబు చెప్పిందే శాసనంలా సాగింది. భయపెడుతూ.. బెదిరిస్తూ ప్రత్యర్థి లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. 2014లో వైఎస్సార్‌సీపీ అడుగు పెట్టడంతో షాక్‌ల మీద షాక్‌లు తగలటం మొదలయ్యాయి.
» బాబు అండ్ కో బ్యాచ్ అరాచకాలను జీర్ణించుకోలేని స్థానికులు ప్రతి గ్రామంలో టీడీపీకి పోటీగా వైఎస్సార్‌సీపీ జెండాను ఎగుర వేయటం ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మొదటి రెండు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి కంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థికే మెజారిటీ ఓట్లు నమోదవ్వటంతో చంద్రబాబు షాక్‌కు గురయ్యారు. 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థలకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మెన్ అంతా వైఎస్సార్‌సీపీ మద్దతు దారులే గెలుపొందటంతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయ్యింది.
» 35 ఏళ్లుగా కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనే చేయని చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ నేతల మాటలతో జ్ఞానోదయం అయింది. ఎట్టకేలకు ఇంటి నిర్మాణం చేపట్టారు. కుప్పానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లే చంద్రబాబు.. 2019 ఎన్నికల తర్వాత కుటుంబ సమేతంగా పరుగులు పెట్టారు. 2014–19 మధ్య కాలంలో సీఎం హోదాలో చంద్రబాబు 8 పర్యాయాలు మాత్రమే కుప్పానికి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. 2019–2024 మధ్య 14 సార్లు కుప్పం రావడంతో పాటు కనీసం రెండు, మూడు రోజులు ఉండి వెళ్తున్నారు.
» కుమారుడు లోకేశ్, సతీమణి భువనేశ్వరి సైతం కుప్పం దారిపట్టారు. ఓటమి భయంతోనే లోకేశ్ తన పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభించి అభాసుపాలయ్యారు. నారా భువనేశ్వరి ఇటీవలి కాలంలో రెండు పర్యాయాలు కుప్పానికి వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో చంద్రబాబు నామినేషన్ వేయటానిక్కూడా కుప్పానికి వచ్చిన దాఖలాలు లేవు. స్థానిక నాయకులే చందాలు వేసుకుని ఆయన తరుఫున నామినేషన్ వేసేవారు. అటువంటిది ఈసారి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేరుగా కుప్పానికి చేరుకుని, సొంత డబ్బులతో నామినేషన్ వేశారు. అనంతరం గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఓటుకు రూ.2 వేలు పంపిణీ
చంద్రబాబు గతంలో కుప్పంలో ఓటర్లకు పెద్దగా డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. స్థానిక నాయకులే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన సొమ్ములో నుంచి ఓటుకు రూ.200 లేదా రూ.300 పంపిణీ చేసేవారు. ఈ నగదు కూడా ఓటర్లందరికీ ఇచ్చేవారు కాదు. సగం ఓటర్లకు ఇచ్చి మిగిలిన సగం నగదు నొక్కేసి అందరికీ పంపిణీ చేశామని లెక్క చూపేవారని ఆరోపణలు ఉన్నాయి.
అటువంటి చంద్రబాబు ఈ ఎన్నికల్లో మే 10, 11, 12 తేదీల్లో ఒక్కో ఓటుకు రూ.2 వేలు చొప్పున డబ్బులు పంపిణీ చేశారు. ఈ నగదును చంద్రబాబే స్వయంగా పంపించారని స్థానిక టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకే డబ్బులు పంపిణీ చేసి మాయ చేయాలని చూస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
సీఎం వైఎస్ జగన్ 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చారని, ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాల ద్వారా కుటుంబ ఆర్థిక పురోభివృది్ధకి దోహద పడ్డారని, కుప్పాన్ని అభివృద్ధి చేసినందుకే తాము ఫ్యాన్ గుర్తుకు ఓటేశామని అత్యధికులు స్పష్టం చేస్తున్నారు.
బాబు కుప్పం ప్రస్థానం
1989లో పోలైన ఓట్లు: 95,157
చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 50,098 (52.65%)
మెజారిటీ: 6,918
1994లో పోలైన ఓట్లు: 1,07,582
చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 81,210 (75.49%)
మెజారిటీ: 56,588
1999లో పోలైన ఓట్లు: 1,25,357
చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 93,288 (74.42%)
మెజారిటీ: 65,687
2004లో పోలైన ఓట్లు: 1,40,153
చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 98,123–
(70%– 4.42% తగ్గాయి.. 6,195 ఓట్లు కోల్పోయారు)
మెజారిటీ: 59,588
2009లో పోలైన ఓట్లు: 1,45,287
చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 89,954 (61.9% – 8.1% తగ్గాయి.. 11,770 ఓట్లు కోల్పోయారు)
మెజారిటీ: 46,066
2014లో పోలైన ఓట్లు: 1,64,071
చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 1,02,953 (62.5% –0.6% పెరిగాయి. 985 ఓట్లు అదనంగా వచ్చాయి)
మెజారిటీ: 47,121
2019లో పోలైన ఓట్లు: 1,79,329
చంద్రబాబుకు వచ్చిన ఓట్లు: 1,00,146 (55.18% – 7.32% తగ్గాయి. 13,127 ఓట్లు
కోల్పోయారు)
మెజారిటీ: 30,722
మే 13న జరిగిన ఎన్నికలో కుప్పంలో
మొత్తం ఓటర్లు: 2,13,145
పోల్ అయిన ఓట్లు: 1,83,027 (85.87%)
గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు
2014 – 55,839 ఓట్లు (33.9%)
2019 – 69,424 ఓట్లు
(38.25% – 4.35% పెరుగుదల
Comments
Please login to add a commentAdd a comment