దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఓట్ల శాతాన్ని పెంచేందుకు ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్ ‘ఓటు వేయండి- డిస్కౌంట్ పొందండి’ పేరిట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఢిల్లీ ఓటర్లు మే 25 న ఓటు వేశాక, కొన్ని మార్కెట్లలో షాపింగ్ చేస్తే వారికి కొంతమేరకు రాయితీ ఇవ్వనున్నారు. అలాగే వివిధ వస్తువులపై ఆఫర్లు అందజేయనున్నారు. ఫలితంగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకుంటారని ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్ భావిస్తోంది.
ఢిల్లీలోని 50కి పైగా చిన్న, పెద్ద మార్కెట్లలోని వ్యాపారులు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచారాన్ని ప్రారంభించారు. కశ్మీర్ గేట్, కమలా నగర్, లజ్‌పత్ నగర్, చాందినీ చౌక్, రోహిణి, కరోల్ బాగ్, నెహ్రూ ప్లేస్ తదితర ప్రాంతాల్లోని పలు మార్కెట్‌లలో ఇటువంటి ఆఫర్లు అందించనున్నారు. ఓటర్లు తమ ఓటువేశాక, వారి వేలిపై పెట్టే సిరా గుర్తును చూపిస్తే ఈ మార్కెట్లలో కొనుగోళ్లపై 15 నుంచి 25 శాతం రాయితీ అందించనున్నారు.
ఇటువంటి ఆఫర్ ఆహారపానీయాలపై కూడా ఇవ్వనున్నారు. గత నాలుగు దశల ఓటింగ్ ట్రెండ్‌లను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ వ్యాపారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రత్యేక తగ్గింపు కేవలం ఢిల్లీ ఓటర్లకు మాత్రమే కాదని, ఐదవ దశలో ఓటు వేసిన సమీప ప్రాంతాల ఓటర్లు కూడా మార్కెట్‌లలో ఈ తగ్గింపు ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment