ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీయే కాదు.. అత్యల్ప మెజారిటీ కూడా నమోదైంది. మహారాష్ట్రలోని ముంబై వాయవ్య నియోజకవర్గంలో అనూహ్య ఫలితం వెలువడింది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్సెస్ శివసేన (సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీ) పోరు హోరాహోరీగా సాగింది.
ఈ పోరులో చివరి వరకు విజయం ఇరుపక్షాల మధ్య దోబూచులాడింది. చివరకు కేవలం 48 ఓట్ల అతితక్కువ మెజారిటీతో శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారాం వాయ్‌కర్ తన సమీప ప్రత్యర్థి అమోల్ కీర్తికర్‌పై గెలుపొందారు. వాయ్‌కర్‌కు 4,52,644 ఓట్లు లభించగా అమోల్‌కు 4,52,596 ఓట్లు లభించాయి. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం ఇరు పారీ్టల అభ్యర్థుల మధ్య మారుతూ వచి్చంది.
ఒక రౌండ్‌లో అయితే అమోల్ కేవలం ఒక ఓటుతో ఆధిక్యంలో కాసేపు కొనసాగారు. ఈ ఎన్నికల్లో కేరళలోని అత్తింగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాశ్ కేవలం 684 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. రాజస్తాన్‌లోని జైపూర్ రూరల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రావు రాజేంద్ర సింగ్ 1,615 ఓట్ల తేడాతో గెలిచారు. చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ నుంచి బీజేపీ అభ్యర్థి భోజ్‌రాజ్ నాగ్ 1,884 ఓట్ల తేడాతో విజయం కైవసం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ రాజ్‌పుత్ 2,678 ఓట్ల తేడాతో నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment