కూతురు ఎందుకు అలా తింటుందని.. | 'The woman who eats everything': Mother investigated by police | Sakshi
Sakshi News home page

కూతురు ఎందుకు అలా తింటుందని..

Published Wed, Jun 8 2016 1:07 PM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

కూతురు ఎందుకు అలా తింటుందని..

కూతురు ఎందుకు అలా తింటుందని..

బీజింగ్: తన కూతురు ఇష్టమొచ్చిన వస్తువులన్నింటిని తింటుండంతో ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి వారితో దర్యాప్తు చేయించింది. అసలు ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకొని అవాక్కయింది. ఆ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. చైనాలోని ఒక అమ్మాయి బతికున్న చేపలను, వానపాములను, పాముల్లాంటి చేపలు(పాపెర్లు) తింటుంది. ఇంట్లో ట్యూబ్లైట్స్ తో సహా ఏ ఎలక్ట్రిక్ వస్తువులను వదల్లేదు.

దీంతో భయపడిన ఆమె తల్లి పోలీసులకు చెప్పి దర్యాప్తు చేయించింది. ఈ దర్యాప్తులో ఆ అమ్మాయికి ఒక ఆన్ లైన్ ఖాతా ఉందని, చైనాకు చెందిన ఓ వీడియో యాప్ ద్వారా వాటిని ఆన్ లైన్లో పెట్టింది. ఆన్లైన్ లో హిట్స్ కొట్టాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పనులు చేసిందని తేలింది. ఆమె ఇలా చేయడం ద్వారా మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఒకేసారి ఆమె ఖాతాలో పెరిగిపోయారంట. ఈ జుగుప్సకరమైన వీడియోలను ఇప్పటికీ ఆన్ లైన్ లో నుంచి ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement