
‘బీబీనగర్’ రిసార్ట్‌లో నయీమ్ కేసు విచారణ
బీబీనగర్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో నల్లగొండ జిల్లా భువనగిరి, పరిసర ప్రాంతాలకు చెందిన అనుచరులను, నిందితులను, అతడితో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇందుకోసం వారు బీబీనగర్ మండలంలోని ఓ రిసార్టును వేదిక చేసుకున్నట్లు సమాచారం. పాశం శ్రీనుతోపాటు, మరి కొంతమందిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని ఈ రిసార్టుకు తీసుకువచ్చి విచారిస్తునట్లు తెలిసింది. అలాగే, బీబీనగర్ మండలంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులకు నయీమ్‌తో ఎమైనా సంబంధాలున్నాయా? నయీమ్ అనుచరులు ఇక్కడ భూదందాలకు, సెటిల్మెంట్‌లకు పాల్పడ్డారా? వారికి ఎవరైనా సహకరించారా? అని సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.