బ్లాక్మనీ జాబితాలో సోనియా అల్లుడు? | BJP government may investigate on Robert Vadra | Sakshi
Sakshi News home page

బ్లాక్మనీ జాబితాలో సోనియా అల్లుడు?

Published Wed, Oct 22 2014 5:25 PM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

బ్లాక్మనీ జాబితాలో సోనియా అల్లుడు? - Sakshi

బ్లాక్మనీ జాబితాలో సోనియా అల్లుడు?

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బ్లాక్ మనీ దాచుకున్న వారిలో వాద్రా ఉన్నారంటూ వార్తలు వెలువడ్డాయి. ఆయనపై కేసు నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు సమాచారం. వాద్రాపై గతంలో కూడా పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి.

బ్లాక్ మనీ దాచుకున్న వారి జాబితాను త్వరలో బయటపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఒప్పందంలో భాగంగా జర్మనీ నుంచి వివరాలు సేకరించామని తెలిపారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి పేరు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. జైట్లీ వీటిని ఖండించకపోవడం మరింత ఊతమిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement