
మాట్లాడుతున్న బీజేపీ నాయకులు
బెల్లంపల్లి : నెన్నెలకు చెందిన రంగు రామగౌడ్ ఆత్మహత్యపై ప్రభుత్వం వెంటనే సీబీసీఐడీ విచారణ జరిపించాలని సీపీఐ, బీజేపీ పక్షాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వేర్వేరుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అండదండలతోనే నెన్నెల మండల కోఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, సర్పంచ్ ఆస్మా మరి కొందరు టీఆర్‌ఎస్ నాయకులు రామగౌడ్‌పై అక్రమ కేసు బనాయించారని అన్నారు. ఎమ్మెల్యేగా చిన్నయ్య ఎన్నికైన నుంచి నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరిగిపోయాయని అన్నారు. ఎమ్మెల్యే అనుచరులు, టీఆర్‌ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే వేధింపుల వల్ల ఏడాదిన్నర క్రితం తాండూర్ మండలానికి చెందిన ఆరె వరలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్యను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రామగౌడ్ ఆత్మహత్యకు కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరారు.
సమావేశంలో సీపీఐ నాయకులు ఎం.మల్లేష్, ఎం.వెంకటస్వామి, సిహెచ్.నర్సయ్య, లక్ష్మీనారాయణ, రాజం, మల్లేష్, చంద్రమాణిక్యం, రాజమౌళి, బీజేపీ నాయకులు కె.భాస్కర్, డి.ప్రకాష్, సోమశేఖర్, మోహ న్, నర్సయ్య, ఎం.శ్రీనివాస్, అరుణ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment