క్వారీలు, అసైన్డ్ భూములనూ వదలని మాజీ ‘బండార’ం
తండ్రిది అధికారం..కొడుకుది ఆక్రమణల పర్వం
నియోజకవర్గాన్ని దోచుకున్న మాజీ మంత్రి పరివారం
తనయుడి ప్రోద్బలంతో దళితులపై ‘పచ్చ’దళం దాడులు
ఎన్టీఆర్ హౌసింగ్ పేరిట జన్మభూమి కమిటీల స్థలాల పంపకం
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : సత్యం...శివం..సుందరం...అంటారు...ఈ టీడీపీ మాజీ మంత్రి పేరులో మాత్రమే సత్యముంది.. మనిషి స్వభావమే అసత్యం. మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేదు.. సాటి మహిళా ప్రజాప్రతినిధులను అసభ్యకరమైన భాషలో నిందిస్తుంటారు. ఈయన తాను ఏలిన నియోజకవర్గంలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. ఈయన తనయుడూ తండ్రికి తగ్గవాడే. ఓ దళిత మహిళపై దుశ్శాసన పర్వం సాగించి, ఆమె భూమిని కబ్జా చేసిన చరిత్ర ఈ తండ్రీ కొడుకులది. నియోజకవర్గంలో భూములను కాజేశారు. క్వారీలను కొల్లగొట్టారు. ఎన్టీఆర్ గృహకల్ప పేరిట ప్రభుత్వ భూములనూ కబళించారు.
ఇన్ని ఆగడాలు చేసిన ఈ మాజీకి ఇటీవల టికెట్ విషయంలో టీడీపీ అధినేత నుంచి అవమానాలూ ఎదురై ...మంచంపట్టి...కన్ను లొట్టపోయి.. ఇప్పుడు మళ్లీ మరోసారి మరింతగా దోచుకోవడానికి పక్క నియోజకవర్గం నుంచి ఎన్నికల రణక్షేత్రంలోకి దూకుతున్నారు. గత ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో మూడు కబ్జాలు.. ఆరు ఆక్రమణలుగా సాగింది ఈ మాజీ ప్రజాప్రతినిధి పాలన. ముఖ్యంగా తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఈయన తనయుడు రెచ్చిపోయారు. రెవెన్యూ అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని భూములను కొల్లగొట్టారు.
అసైన్డ్, బీ–ఫారం భూములతో పాటు దళితులకు చెందిన భూములనూ విడిచిపెట్టలేదు. నీరు–చెట్టు పథకంలోనూ అడ్డంగా దోచుకుతిన్నారు. అక్రమంగా తవ్వుకున్న క్వారీలు వీరికి అదనపు ఆదాయం తెచి్చపెట్టాయి. ఈ దోపిడీ వ్యవహారాల్లో అవసరమైతే దాడులకూ దిగిన సందర్భాలూ ఉన్నాయి. పోలీసులను ఉపయోగించుకుని కేసులు పెట్టిన ఘటనలు కోకొల్లలు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెర్రిపోతులపాలెం దాషీ్టకం.. రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపిన భూదోపిడీలు ఆ మాజీ మంత్రి పనితీరుకు మచ్చుతునకలు.
2017 డిసెంబర్ 19న జెర్రిపోతులపాలెంలో దళితుల ఆ«దీనంలో ఉన్న భూమిని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎన్టీఆర్ గృహకల్ప పేరిట దోచుకోవడానికి యతి్నంచారు. ఆ భూమికి హక్కుదారైన దళిత మహిళ వీరిని అడ్డుకోబోగా ఆగ్రహానికి గురైన టీడీపీ నాయకులు మాజీ మంత్రి తనయుడి ప్రోద్బలంతో ఆమెను నడిరోడ్డుపై వివస్త్రను చేసి, దాడికి తెగబడ్డారు. దీనిపై కేంద్ర ఎస్సీ కమిషన్ ప్రతినిధులు రంగంలోకి దిగడంతో ఏడుగురు టీడీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు.
ఆరు క్రిమినల్ కేసులు మాజీ మంత్రిపై ఆరు
క్రిమినల్ కేసులు ఉన్నాయి. దీనితోపాటు మరో కేసూ ఉంది. వీటిని ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో 2023, అక్టోబర్ 1న గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో 153ఏ, 354(ఏ), 504, 505, 506, 509, 499 ఐపీసీ, 67 ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే నేరంపై 2023, సెపె్టంబర్ 30న విజయవాడ సీఐడీ–2 పోలీసులు 153ఏ, 504, 505(2), 506, 509, ఆర్/డబ్ల్యూ 120బీ ఐపీసీ, 67 ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగిస్తున్న క్రమంలో తహసీల్దార్, వీఆర్వోలను అడ్డుకొని వారి విధులకు ఆటంకం కలిగించినందుకు 2020, ఫిబ్రవరి 17న 341, 353 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.
హౌసింగ్ పేరుతో భూ ఆక్రమణలు.. అక్రమంగా అమ్మకాలు...
అవినీతికి మారుపేరైన జన్మభూమి కమిటీలు మాజీ మంత్రి అండతో చెలరేగిపోయాయి. ఎనీ్టఆర్ హౌసింగ్ పథకం పేరుతో భూ ఆక్రమణలకు తెగబడ్డారు. సబ్బవరం, పెందుర్తి, పరవాడ మండలాల్లో ఈ పథకం పేరు చెప్పుకుని వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అమ్ముకున్నారు. ప్రతి పంచాయతీలోనూ టీడీపీ నాయకులు ఓ జాబితా తయారు చేసి, అందులో అర్హులను వదిలేసి, తమ బినామీల పేర్లు రాయించుకున్నారు.. ఆ తర్వాత అక్రమంగా లేఅవుట్లు వేసి స్థలాలు పంచుకుని తెగనమ్ముకున్నారు.
క్వారీలనూ తవ్వేసుకున్నారు
మాజీ మంత్రి అండతో టీడీపీ నాయకులు క్వారీలనూ వదల్లేదు. జెర్రిపోతులపాలెం, సబ్బవరం, నరవ, పొర్లుపాలెం ప్రాంతాల్లో క్వారీలను తవ్వుకుని దోపిడీ చేసే క్రమంలో అక్కడి రైతుల భూముల్లో ఫలసాయాన్నీ ధ్వంసం చేశారు. పెందుర్తి మండలం చింతగట్లలో స్థానిక రెవెన్యూ అధికారుల కక్కుర్తిని సొమ్ము చేసుకున్న టీడీపీ నాయకులు 117 ఎకరాల్లో క్వారీ అనుమతులు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో క్వారీకి ఆనుకునే ఉన్న ఊరిని సైతం అక్కడ ఊరే లేదని నివేదికలో అధికారులతో రాయించారు. ఇదే తరహాలో సబ్బవరం మండలం అమృతపురంలో క్వారీకి అనుమతి తెచ్చుకున్న టీడీపీ నాయకులు దానికి దారి కోసం ఏకంగా రైతులకు ఫలసాయం అందిస్తున్న మొక్కలనూ అప్పట్లో తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment