అవినీతి ‘కాలువ’ | TDP leader List of Irregularities: Andhra pradesh | Sakshi
Sakshi News home page

అవినీతి ‘కాలువ’

Published Wed, May 8 2024 6:08 AM | Last Updated on Wed, May 8 2024 6:10 AM

TDP leader List of Irregularities: Andhra pradesh

మాఫియాను తలపించిన  ఇసుక, మట్టి వ్యాపారం 

నీరు–చెట్టు పేరుతో కోట్లు కొల్లగొట్టిన మాజీ మంత్రి

బీటీపీ పనుల్లోనూ అంచనాలు పెంచి రూ.వందల కోట్ల దోపిడీకి ప్లాన్‌ 

టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.1,500 కోట్ల అక్రమార్జన  

అన్ని పనుల్లోనూ మేత.. ప్రశ్నిస్తే ధర్నాలు...

ప్రభుత్వ అక్రమాలను ఎత్తిచూపే పాత్రికేయమే రాజకీయ అవతారమెత్తితే...ఇంకేముంది..ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలో ...ఎంతగా దోచుకోవాలో ఆనుపానులు కనిపెడుతుంది...అనంతపురం జిల్లాలోని కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గంలో ఇలాంటి ప్రతినిధి ఒకరు పచ్చ మీడియా అధినేత ఆశీస్సులతో టీడీపీలోకి ప్రవేశించి,  మొదట ఎంపీ  అయ్యారు.. అ తర్వాత  ఎమ్మెల్యే అయ్యారు. చీఫ్‌విప్‌ ...మంత్రి పదవులూ దక్కించుకున్నారు.. పనిలోపనిగా గుడ్‌విల్‌ పేరిట అక్రమార్జన పనిలో పడ్డారు.

అతి తక్కువ వ్యవధిలోనే రూ.1500 కోట్లను ఆర్జించారంటే ఈ నేత దోపిడీ పనితనం ఎంత గొప్పదో అర్థమవుతుంది.. ఇసుక... మట్టి, సాగునీటి ప్రాజెక్టులు.. చెరువుల పూడికతీత పనుల్లో దోపిడీకి అవకాశమున్న మేరకు దోచుకున్నారు...  ఈ అపర వెంకన్న దోపిడీ ధనం ‘కాలువై’ పొంగి పొర్లుతోంది.. ఆ దోపిడీ ప్రవాహం ఎలా సాగిపోయిందంటే....

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఆయన పేరు తిరుమల వేంకటేశ్వరుడికి పర్యాయ నామం. పేరుకు తగ్గట్టుగా వ్యవహరించడం ఆయనలో లేదు. మనిషిని చూస్తే  తెల్లగా, ఎర్రగా కనిపించినా అవినీతిలో మాత్రం స్వభావం నలుపే. పాత్రికేయ వృత్తితో అతి సామాన్య  జీవనం ఆరంభించినా,  రాజకీయం రారమ్మని తలుపు తట్టింది. రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగి టీడీపీ అధినేత చంద్రబాబుకు విధేయుడిగా మార్కులు కొట్టేశారు. టీడీపీ  పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పదవి దక్కించుకున్నారు. ఆ పార్టీ తరఫున ఎంపీగా ఓ సారి గెలిచి.. రెండో సారి ఓటమి పాలయ్యారు.

తన జిత్తుల మారి ఎత్తులతో 2014లో అసెంబ్లీ టికెట్‌ సాధించుకున్నారు. స్వల్ప మెజారీ్టతో  ఎమ్మెల్యేగా గట్టెక్కారు. ఆ తర్వాత చీఫ్‌విప్‌గా ఉంటూ అమాత్యుడిగా అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ అవకాశాన్ని రెండు చేతులతో సద్వినియోగం చేసుకుని ఆరి్థక బకాసురుడిగా ఎదిగారు.  ఇసుక నుంచి మట్టిదాకా.. ప్రాజెక్టుల నుంచి రోడ్ల వరకూ దేన్నీ వదలకుండా దోచేశారు. ప్రతి పనిలోనూ అంచనాలు పెంచి గుడ్‌విల్‌ పేరుతో దిగమింగారు. 

ఈ విషయాలను అప్పట్లో సొంత పార్టీ నేతలే బాహాటంగా వ్యతిరేకించారు. తల్లి పంట మేస్తే... పిల్ల మేర మేసినట్టు తామేమీ తక్కువ కాదన్నట్టు ఆ నాయకుడి అండదండలతో తమ్ముళ్లూ అవినీతిలో మునిగి తేలారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ.1,500 కోట్లకు పైగా అవినీతి సొమ్ము పోగుచేసి ఉంటారనే అభియోగాలు ఉన్నాయి.  ప్రజల్లో హాట్‌టాపిక్‌గా నిలిచిన ఈ వ్యవహారం ఇప్పటికీ మరచిపోలేని పరిస్థితి. ఆ మరకను ఎదుటి వారికి అంటించి కడుక్కోవాలని చూసినా ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఆ మాజీ నేత మళ్లీ ప్రజాప్రతినిధిగా గెలవడానికి చేయని పనులు లేవు.    

అక్రమాల తీరిలా.. : జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి భైరవానితిప్ప (బీటీ) ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తెస్తామనే నెపంతో  ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు ఈ మాజీ నాయకుడు. ఈ నేపథ్యంలో ఫేజ్‌–1 కింద రూ.450 కోట్లను కేటాయిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. మొత్తంగా రూ.968 కోట్లకు పరిపాలన అనుమతులను జారీచేశారు. అయినా భూనిర్వాసితులకు పిసరంతైనా నష్టపరిహారం అందించలేదు.

ఆ పనులను ప్రస్తుతం మరో దుర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేత సంస్థకు కట్టబెట్టి దోపిడీ పర్వానికి తెరలేపారు. ఆయన డీకేటీ భూముల్లో మాత్రమే కాలువ తవ్వకం పనులు చేపట్టి,  రైతులను నమ్మించే ప్రయత్నం చేశారు. బోరంపల్లి లిఫ్ట్‌ నుంచి 56 కిలోమీటర్ల దూరంలోని బీటీప్రాజెక్టుకు నీరివ్వాలి. అప్పటి ధర ప్రకారం కిలో మీటర్‌కు రూ.3 కోట్లు ఖర్చవుతుందని కాంట్రాక్టర్లు అంచనా వేశారు. మెకానికల్‌ పనులతో కలిపితే  రూ.350 కోట్లలోపే వ్యయంతో నీరివ్వొచ్చు.

దోచుకోవాలి కాబట్టి  ఏకంగా రూ.968 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో తలా కొంచెం పంచుకుతినేలా కుట్రలు పన్నారు. ఈ పనుల్లో అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారు. ప్రాజెక్టు వద్ద వేసిన పైలాన్‌ మొదలు ల్యాండ్‌స్కేప్, రంగులు తదితర పనుల్లో రూ.కోట్లు మెక్కేసిన వైనంపై ఈ ప్రాంతంలో ఎవరినడిగినా చెబుతారు.  

⇒ నియోజకవర్గ ముఖ్యపట్టణం నుంచి కళ్యాణదుర్గం రోడ్డు విస్తరణ పనుల్లోనూ రూ.20 కోట్ల వరకు ఈ నేత గుడ్‌విల్‌ మెక్కారనే ఆరోపణలూ బలంగా ఉన్నాయి.  ఈ పనులకు అప్పటి ప్రభుత్వం రూ.222 కోట్లతో టెండర్‌ పిలిచింది. కిలోమీటర్‌కు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల చొప్పున 56 కిలోమీటర్లకు రూ.112 కోట్ల నుంచి రూ.168 కోట్లు ఖర్చవుతుంది. అలా చేస్తే తమకు మిగిలేదేమీ ఉండదు కాబట్టి  రూ.54 కోట్ల నుంచి రూ.110 కోట్ల మేర అంచనాలు పెంచి రూ.222 కోట్లకు తుది అంచనాలు రూపొందించారు.

ఈ పనులను కేసీపీఎల్‌– లికాన్‌ ఏజెన్సీ 15.35 శాతం తక్కువతో రూ.194 కోట్లకు దక్కించుకుంది. దీనివల్ల ఏజెన్సీకీ లాభమే. ఈ పనుల్లో 10 శాతం అంటే రూ.20 కోట్ల వరకు అప్పట్లో మంత్రిగా ఉన్న ఈ నేతకు ముడుపులు అందినట్టు ఆరోపణలున్నాయి. 

⇒ ఈ మాజీ ఎమ్మెల్యే హయాంలోనే కణేకల్లు, బొమ్మనహాళ్, డి హీరేహాళ్‌ మండలాల్లో  ఇసుక–మట్టి అక్రమ రవాణా జిల్లాలోనే ఓ మాఫియాను తలపించింది. రచ్చుమర్రి వద్ద వేదావతి హగరి నదిలో తవ్విన ఇసుకను ఈనేత అండదండలతో ఓ సంస్థ సహకారంతో నేరుగా బెంగళూరుకు తరలించి రూ.కోట్లను కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పత్రికలు, టీవీ చానళ్లలోనూ  ఈ అవినీతి బాగోతంపై అనేకమైన కథనాలు వచ్చాయి. 

చివరకు  తమ మానస పుత్రికగా చెప్పే ఈనాడులోనే ‘మంత్రి ఇలాకాలో కంత్రీల కులాసా’ శీర్షికతో కథనాన్ని ప్రచురించారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు.  ఈ ఒక్క వ్యవహారంలోనే రూ.350 కోట్లకు తక్కువ కాకుండా కూడగట్టారనే అభియోగం నేటికీ ఉంది. అప్పట్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను కణేకల్లు పోలీసులు పట్టుకుంటే పోలీస్‌స్టేషన్‌ ముందు నేరుగా ఈ మాజీ మంత్రి ధర్నా చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిచి్చంది.

రాయదుర్గం మండలం టీ వీరాపురం, డి హీరేహాళ్‌ ప్రాంతాల్లో రూ.కోట్ల విలువ చేసే మట్టిని కర్ణాటక ప్రాంతానికి తరలించారు. ఆనాటి అక్రమాల ఆనవాళ్లు నేటికీ తన అవినీతిని బట్టబయలు చేస్తున్నాయి. 

⇒ముఖ్య పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో విలువైన రిజర్వ్‌ స్థలాన్ని టీడీపీ కౌన్సిలర్‌ ఒకరు ప్లాట్లు వేసి అమ్మేశారు. ఈయన్ని  అనుసరిస్తూ మరింత మంది దురాక్రమణకు పాల్పడి విలాసవంతమైన భవనాలను నిరి్మంచారు. వాటిని రూ.లక్షలకు అమ్ముకుని  సొమ్ము కూడగట్టారు.

మల్లాపురం, గౌడ, భంభంస్వామి, ముత్రాసకాలనీ, బీటీపీ, గ్యాస్‌గోడౌన్‌ లేఅవుట్లలో భవిష్యత్తు అవసరాల కోసం వదిలిన రిజర్వ్‌ స్థలాలను సైతం మాజీ ఎమ్మెల్యే అండతో తమ్ముళ్లు ఆక్రమించారు. ఒక్కో స్థలాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేలకు అమ్మేశారు. ఇటీవలే టీడీపీ నాయకుడి సహకారంతో పేదలకు చెందిన నాలుగు ప్లాట్లను రూ.6 లక్షలకు ఓ వ్యక్తి అమ్ముకున్నాడు.  ఆ విషయమూ వివాదంగా మారింది.  

⇒ ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యే హయాంలో కణేకల్లు, బొమ్మనహాళ్‌ మండలాల్లో ఇసుక మేటల నివారణలో భాగంగా రూ.కోట్ల మొత్తాన్ని  ఖర్చు చేసినట్టు రికార్డుల్లో చూపారు. పొలాల్లో మాత్రం ఇసుక అలాగే ఉండిపోయింది. ఆ రికార్డులు సైతం మాయం చేయడం గమనార్హం. 

నీరు–చెట్టు పనుల్లో సైతం రూ.50 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు తమ్ముళ్ల జేబులోకి చేరాయి. ఇందులో ఈ మాజీ ప్రజాప్రతినిధికీ  కమీషన్ల వరద పారింది. గుమ్మఘట్ట, డి హీరేహాళ్, కణేకల్లు ప్రాంతాల్లో జరిగిన అనేక పనులకు ఆనవాళ్లే లేవంటే దోపిడీ తీరు అర్థం చేసుకోవచ్చు. 

⇒అప్పట్లో కణేకల్లు చిక్కణ్ణేశ్వర చెరువు పూడికతీత కోసం రూ.2 కోట్లను కేటాయించారు. ఈ పనులనూ కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రకు చెందిన ఎస్‌ఆర్‌సీ కంపెనీకే అప్పగించారు. సరిగ్గా వారం రోజుల పనులయినా చేయకముందే చెరువులోకి హెచ్‌ఎల్‌సీ నీరొచి్చచేరింది.

నీరు నిండిపోవడంతో అరకొరగా చేసిన పనులు కనిపించలేదు. పక్కా ప్లాన్‌తోనే నీరొదిలి రెండు దుర్గాల నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేతలు కలసి రూ.2 కోట్లను దిగమింగారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ నిధులతోనే ఈ మాజీ ఎమ్మెల్యే విలాసవంతమైన భవనం కట్టుకున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.  

⇒టీడీపీ పాలనంతా అవినీతి, నిధుల మేతగా సాగినా... నేడు ఈ మాజీ ఎమ్మెల్యే నీతిమంతుడిలా బిల్డప్‌ ఇస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకు మళ్లీ పట్టం కడితే రెండింతల అవినీతి తప్పదని స్థానిక ప్రజలు   

మాజీమంత్రిపై నమోదైన కేసుల వివరాలు.. 
⇒19–04–2014న ఎంసీసీ కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడడంతో .. ఐపీసీ 188 సెక్షన్‌ కింద కేసు నమోదయింది. (క్రైమ్‌ నంబర్‌ –157/ 2014) 
⇒27–04–2014 న ఎంసీసీ ఉల్లంఘన పై ఐపీసీ 188 సెక్షన్‌ కింద మరో కేసు నమోదయింది. క్రైమ్‌ నంబర్‌ – 188/14 

⇒14–03–2020న మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల  నామినేషన్ల తిరస్కరణ విషయంలో  అనుచరులతో కలిసి ఈ మాజీ ఎమ్మెల్యే .. కార్యాలయంలో  దౌర్జన్యం చేశారు.. ఈ విషయంపై ఐపీసీ 343, 506 సెక్షన్ల కింద ఆర్పీ యాక్ట్‌ కేసు  నమోదయింది. క్రైమ్‌ నంబర్‌ 88/20 
⇒07–12–2021న ఓ యాక్సిడెంట్‌ కేస్‌ విషయంలో.. శవ రాజకీయం నిర్వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టిన విషయంపై.. ఐపీసీ 341, 188ల సెక్షన్ల కింద కేసు నమోదయింది. క్రైమ్‌ నంబర్‌ 525/21.  

27–11–2022 న చెన్నేకొత్తపల్లి వద్ద టీడీపీ నిర్వహించిన ధర్నాకు ఈ మాజీ ఎమ్మెల్యే ఎలాంటి అనుమతులు లేకుండా పాల్గొనేందుకు వెళ్లే ప్రయత్నం చేశారు..  పోలీసులు అడ్డుకోవడంతో..  రోడ్డుపై ధర్నా చేస్తూ  రాద్ధాంతం చేశారు. ఈ ఘటనపై ఐపీసీ 188, 341 సెక్షన్ల కింద కేసు నమోదయింది. క్రైమ్‌ నంబర్‌ 330/ 22 

⇒16–09–23 న చంద్రబాబు స్కిల్స్‌ స్కామ్‌ అరెస్టుపై అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహిస్తూ.. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించడంపై.. ఐపీసీ  143, 188, 341 ల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. క్రైమ్‌ నంబర్‌ 157/23 
⇒ 27–09–2023 న స్కిల్‌ స్కామ్‌ కేసులో మరో ర్యాలీ చేపట్టడంతో.. ఐపీసీ 143, 188, 341 సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు.. క్రైమ్‌ నంబర్‌ 165/23 

⇒28–08–23న స్కిల్‌ స్కాం  కు నిరసనగా ర్యాలీలు, నిరసనలు పోలీసు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టడంతో.. ఐపిసి 143, 188, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. క్రైమ్‌ నంబర్‌ 167/23 
⇒ 08–10–2023న మళ్లీ అవే సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఈ (9 కేసులు.. రాయదుర్గం అర్బన్‌ పీఎస్‌ లో నమోదు) క్రైమ్‌ నంబర్‌ 167/23 
⇒ 02–04–2024న బొమ్మనహళ్‌ మండలం ఉంతకల్లులో ఎంసీసీ కోడ్‌ నిబంధనలకు విరుద్ధంగా.. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించడంతో.. బొమ్మనహళ్‌ పీఎస్‌ పరిధిలో.. 188, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. క్రైమ్‌ నంబర్‌:  64/24  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement