సాక్షి, అమరావతి: మార్గదర్శి అక్రమాలపై సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల్లో మార్గదర్శి బ్రాంచీల్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మార్గదర్శి రశీదు డిపాజిట్ల ముసుగులో భారీగా బ్లాక్‌మనీ మార్పిడి జరిగిందని, ఆ నల్లధనాన్నే తమ సంస్థల్లో పెట్టుబడులుగా రామోజీ తరలించినట్లు సీఐడీ గుర్తించింది.
చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు అధికారులు గుర్తించారు. రికార్డులు, డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు సీఐడీ పరిశీలించింది. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, నరసరావుపేట, ఏలూరు, అనంతపురం మార్గదర్శి బ్రాంచీల్లో సీఐడీ సోదాలు చేస్తోంది. చిట్‌ఫండ్ అక్రమాలు, నిధులు దారిమళ్లింపుపై విచారణ జరుపుతుంది. ఇప్పటికే హైదరాబాద్ మార్గదర్శి కార్యాలయంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా ఎండీ శైలజాకిరణ్‌పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్‌తో సహజీవనం చేసి..
Comments
Please login to add a commentAdd a comment