మళ్లీ దోపిడీకి తెరపైకి.. | TDP LEADER List of Irregularities: Andhra pradesh | Sakshi
Sakshi News home page

మళ్లీ దోపిడీకి తెరపైకి..

Published Sun, May 5 2024 6:30 AM | Last Updated on Sun, May 5 2024 6:30 AM

TDP LEADER List of Irregularities: Andhra pradesh

మాజీ ఎమ్మెల్యే అరాచకాలెన్నో! 

గోబెల్స్‌ ప్రచారంలో చంద్రబాబుకు తమ్ముడు   

వక్ఫ్‌ ఆస్తులు చెరబట్టి దోచేసిన ఘనుడు  

టిప్పు షాపింగ్‌ కాంప్లెక్స్‌ కేటాయింపులో చేతివాటం 

ప్రతి పనికీ రేటుగట్టి వసూలు చేసిన చరిత్ర  

బెదిరింపులు, దౌర్జన్యాలు షరామామూలే

ఏకంగా పది క్రిమినల్‌ కేసులు 

అన్నమయ్య జిల్లాలో ఆంధ్రా ఊటీగా ప్రసిద్ధిచెందిన ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ఆ మాజీ ఎమ్మెల్యే సాగించిన అవినీతి దందా అంతాఇంతా కాదు. తాజ్‌మహల్‌ను తలుచుకోగానే ఈయన గారి పేరు గుర్తొస్తుంది. సొంత మత మండలి ఆస్తులనూ కబళించిన ఘనుడు. ప్రతి పనికీ ధర నిర్ణయించి ప్రజలను పీడించుకుతిన్న చరిత్ర ఆయన సొంతం. అతడి బెదిరింపులు, దౌర్జన్యాలకు బలైన వారు ఎందరో.. ఇప్పుడు మళ్లీ టీడీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు.చందాలు ఇవ్వాలంటూ వ్యాపార వర్గాలను బెదిరిస్తున్నారు.  

సాక్షి, టాస్‌్కఫోర్స్‌ :  హైటెక్‌ రంగానికి తానే ఆద్యుడని, హైదరాబాద్‌కు బిల్‌గేట్స్‌ను తీసుకువచ్చానని, భాగ్యనగరానికి వరల్డ్‌ మ్యాప్‌లో గుర్తింపు తన భాగ్యమేనని డాబు మాటలు చెప్పుకునే వ్యక్తి ఎవరని అడిగితే ఠక్కని మనకు గుర్తుకు వచ్చే పేరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అచ్చు ఆయనకు ఏ మాత్రం తీసిపోకుండా, అంతకంటే రెండు ఆకులు ఎక్కువే చదివారు ఈ మాజీ ఎమ్మెల్యే.నియోజకవర్గంలో అభివృద్ధి తన చలవేనని, తాను వేసిన రోడ్ల మీద ప్రజలు నడుస్తున్నారని, వక్ఫ్‌ భూములను తానే కాపాడానని, తాను లేకపోతే, మైనారీ్టలకు పెద్ద దిక్కు లేదని గొప్పలు చెప్పుకుంటుంటారు. బస్సు యజమానిగా ఉన్న ఈయన 2009లో కాంగ్రెస్‌ తరఫున గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.  చదివింది పదో తరగతే అయినా మతాన్ని అడ్డుపెట్టుకుని అంచెలంచెలుగా ఎదిగారు. అవినీతిలో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. తన ఆధిపత్యానికి అడ్డు వస్తే బెదిరింపులు, దౌర్జన్యాలకూ వెనుకాడరు.   

∗ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్ల ముసుగులో రూ.కోట్లు కొల్లగొట్టారు.  
∗ హ్యాండ్‌లూమ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ పేరుతో చేనేత కార్మికుల కోసం స్థలం కేటాయించాలని వినతిపత్రం పెట్టించి, తర్వాత తనకు అనుకూలురైన తహసీల్దార్, ఆర్డీఓల ద్వారా వాటిని అక్రమమార్గాల్లో దక్కించుకున్నారు.  
 

∗ తన అనుచరులతో ప్రభుత్వ స్థలాల్లో పాగావేసి, వాటిని విక్రయించడం ద్వారా రూ.కోట్లు పోగేసుకున్నారు. 
∗ ఈ అక్రమాలను వెలుగులోకి తెచి్చనందుకు ఓ పక్ష పత్రిక విలేకరిపై అక్రమ కేసులు బనాయించి, జైలుకు పంపారు.   
∗నియోజకవర్గ కేంద్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్‌ భూములను కాపాడేందుకు పట్టణంలోని జామియా మసీదు కమిటీ పెద్దలు కోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాల అనంతరం వక్ఫ్‌ భూములు మసీదుకే చెందుతాయని హైకోర్టు 2002లో తీర్పు ఇస్తే.. 2009లో ఈయన ఎమ్మెల్యే అయిన రెండేళ్ల తర్వాత వక్ఫ్‌ భూములకు కంచె వేయించి, భూములను తానే కాపాడినట్లుగా గోబెల్స్‌ ప్రచారం చేసుకున్నారు.  

‘టిప్పు’టాప్‌గా కబ్జా 
టిప్పు సుల్తాన్‌ వక్ఫ్‌ భూముల్లో మున్సిపల్‌ అనుమతులు లేకుండానే షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఒక్కో షాపునకు అడ్వాన్సుల పేరుతో రూ.లక్షలు వసూలుచేసి, వాటికి జమా లెక్కలు చూపకుండా నిధులు తన సొంత ఖాతాల్లోకి మళ్లించారు. టిప్పుసుల్తాన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని దుకాణాలు, గదులు అన్నింటికీ తానే యజమాని అన్నట్లుగా ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు.

తనకు నచ్చిన వారికి కేటాయిస్తున్నారు. చివరకు దుకాణాల ఎదుట మెయిన్‌ రోడ్డుపై చిరువ్యాపారులు టెంట్లు, గుడారాలు వేసుకుని వ్యాపారాలు చేస్తుంటే.. వారి వద్ద నుంచి మాజీ ఎమ్మెల్యే అనుచరులు మామూళ్లు వసూలు చేస్తున్నారు. టిప్పు సుల్తాన్‌ కాంప్లెక్స్‌ వెనుకవైపు ఖాళీస్థలంలో ఆస్పత్రి నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల మసీదు నిధులను ఖర్చుచేసి, పనులు పూర్తిచేయకుండానే అసంపూర్తిగా వదిలివేశారు.

వీటికి తోలిన ఇసుక, కంకరతో ఎన్‌వీఆర్‌లే అవుట్, మోతీనగర్‌లో రెండు ఇళ్లను నిర్మించుకున్నట్లు పట్టణంలో వదంతులు వినిపిస్తున్నాయి.   కదిరిరోడ్డులోని టిప్పుసుల్తాన్‌ కాంప్లెక్స్‌ ఖాళీ స్థలాల్లో మెకానిక్‌లు, కార్పెంటర్లు, చేతివృత్తులవారు తాత్కాలిక షెడ్లు వేసుకునేందుకు రూ.లక్షలు వసూలు చేసి అనుమతులిచ్చారు. దీనిలో మాజీ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డాడని ఆయన సొంత తమ్ముడే వాటిని తొలగించారు. ఈ అన్నదమ్ముల మధ్య విభేదాలతో పేదవారు అప్పులపాలై రోడ్డున పడే దుస్థితి నెలకొంది. 

∗బడేమకాన్‌ వక్ఫ్‌ భూముల్లో మున్సిపల్‌ అధికారుల అనుమతి లేకుండా దౌర్జన్యంగా షాపులు నిరి్మంచడమే కాకుండా ఒక్కో దుకాణానికి రూ.15–20 లక్షల వరకు వసూలుచేసి, వాటికి యజమాని తానేనన్నట్లుగా, తన జాగీరు అన్నట్లుగా రూ.100 స్టాంపు పేపర్‌పై స్వయంగా సంతకం చేసి అగ్రిమెంట్లు చేసిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పుణ్యమా అని చాలాకాలం ఈ కాంప్లెక్స్‌కు కరెంటు లేక చీకట్లోనే వ్యాపారులు దుకాణాలు నడపాల్సి వచ్చింది.  

∗వక్ఫ్‌ భూముల రక్షణ ముసుగులో భూములకు సంబంధించి అగ్రిమెంట్లు చేసి అందులో ఇతరులకు చెందిన భూములకు వెళ్లేందుకు డబ్బులు తీసుకుని రోడ్డు వేసేందుకు సహకరించారు.  

∗ఈయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో  మున్సిపల్, సర్పంచ్‌ ఎన్నికలు జరగకపోవడంతో స్పెషల్‌ ఆఫీసర్‌ పాలన సాగింది. దీంతో ఆయన స్థానిక సంస్థల్లో ఏకఛత్రాధిపత్యం సాగించారు. తన అక్రమాలకు అడ్డువస్తే మద్దతు ఉపసంహరించుకుంటానని అప్పటి సీఎంనే బెదిరించిన చరిత్ర ఈయనది.  

∗అప్పట్లో జరిగిన ప్రతి అభివృద్ధి పనిలోనూ కమీషన్లు వసూలు చేశారు. ఇవ్వకుంటే బెదిరించారు. నియోజకవర్గ కేంద్రంలో నీటి ఎద్దడిని ఆసరాగా చేసుకుని ట్యాంకర్ల ద్వారా సరఫరా పేరుతో రూ.కోట్లు దోచేశారు. బోర్ల రీ డ్రిల్లింగ్‌ల్లోనూ స్వాహా చేశారు.   

∗ బుగ్గకాలువలో ఓ టీడీపీ నేత వేసిన లేఅవుట్‌కు దారి కలి్పంచేందుకు మున్సిపల్‌ నిధులతో నిబంధనలకు విరుద్ధంగా బ్రిడ్జి నిర్మాణం చేయించారు. దీనివల్ల అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ ఇప్పటికీ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఆమె ప్రమోషన్లు, ఇతరత్రా సౌకర్యాలు నిలిచిపోయి ఇబ్బందులు పాలయ్యారు.   
∗నామినేటెడ్‌ పోస్టులనూ రూ.లక్షలకు అమ్ముకున్నారు. మార్కెకట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని ఇచ్చేందుకు భారీగా ముడుపులు తీసుకున్నట్టు సమాచారం.   

∗జామియామసీదుకు చెందిన షాదీమహల్‌ నిర్మాణానికి పంచాయతీరాజ్‌శాఖలో 2.5 లక్షలు బిల్లు చేయించి, మసీదు నిధుల నుంచి దొంగబిల్లులతో కాజేశారు.  
∗ఈయనకు ప్రజాదరణ ఏమాత్రం లేదు.  2014లో మళ్లీ పోటీ చేసిన ఈయనకు  కేవలం 7,357 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019లో రాజంపేట ఎంపీ అభ్యరి్థగా పోటీచేస్తే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.   

అఫిడవిట్‌ ప్రకారం పది క్రిమినల్‌ కేసులు  
2019లో సమరి్పంచిన అఫిడవిట్‌లో తనపై 2 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు అవి 10 కేసులకు పెరిగాయని పేర్కొన్నారు. తన ఆదాయవనరు రవాణా వ్యాపారం అని చూపిన ఆయన వాటి వివరాలు ప్రస్తావించలేదు. 2019లో ఇన్నోవా వాహనం ఉందని అఫిడవిట్‌ సమరి్పంచిన ఆయన ఇప్పుడు ఎలాంటి వాహనాలు లేవని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement