
ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లు డిజిటల్ పరివర్తనానికి వీలుగా సేవలు అందించేందుకు భారత్ కీలక కేంద్రంగా ఉంటుందని సీమెన్స్ ప్రకటించింది. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, రవాణా, విద్యుదుత్పత్తి, విద్యుత్ సరఫరా తదితర రంగాలకు సీమెన్స్ సేవలు అందిస్తుంటుంది. భారత్‌లోని సంస్థ డెవలప్‌మెంట్ సెంటర్‌లో 6,000 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థ యాక్సెలరేటర్ పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ను భారత్‌లో ప్రారంభించింది.
డిజిటల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారిత సేవలను ఈ కేంద్రం ద్వారా అందించనుంది. ప్రపంచవ్యాప్తంగా సీమెన్స్ యాక్సెలరేటర్‌ను అమలు చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment