iPhone 15 Manufacturing: దేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ ఐఫోన్‌లను తయారు చేయబోతోంది. భారత్‌లో రాబోయే ఐఫోన్ 15 (iPhone 15), 15 ప్లస్ (15 Plus) ఫోన్లను తయారు చేసేందుకు యాపిల్ (Apple) సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా తైవాన్‌కు చెందిన ఓ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంటోంది.
ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే!
టాటా సంస్థ భారత్‌లో యాపిల్ కోసం నాలుగో ఐఫోన్ తయారీ భాగస్వామిగా ఉంటుందని తైవాన్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రొవైడర్ ‘ట్రెండ్‌ఫోర్స్’ పేర్కొంది. టాటా భాగస్వామ్యంతో భారత్‌లో యాపిల్ మొత్తం ఐఫోన్‌లలో ఎంత శాతం ఉత్పత్తి చేయనుందో కచ్చితంగా తెలియదు. యాపిల్‌కు భారత్‌లో ఇప్పటికే విస్ట్రాన్, ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ అనే మూడు తయారీ భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి. అదే విధంగా భారత్‌లో రెండు రిటైల్ స్టోర్‌లను యాపిల్ ప్రారంభించింది.
టాటా గ్రూప్‌పై యాపిల్ దృష్టి
ట్రెండ్‌ఫోర్స్ నివేదిక ప్రకారం.. ఐఫోన్‌ల తయారీ కోసం భారత్‌లోని అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటిగా ఉన్న టాటా గ్రూప్‌పై యాపిల్ దృష్టి సారిస్తోంది. ఇది నిజమైతే ఐఫోన్ 15 తొలి షిప్‌మెంట్‌లు మొదట భారత్‌లోనే అందుతాయి. సాధారణంగా ఐఫోన్‌లు భారత్‌లోకి ఆలస్యంగా వస్తాయి. ఇక భారత్‌లోనే తయారైతే ఐఫోన్ 15 సిరీస్ ధరలు కూడా తక్కువ ఉండేందుకు దోహదం చేస్తుంది.
దేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో ఉనికిని విస్తరించాలని చూస్తున్న టాటా గ్రూప్‌నకు ఇది గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కోవిడ్ పరిమితులు, సప్లయి చైన్ సమస్యల కారణంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇటీవలి కాలంలో దాని తయారీ స్థావరాలను విస్తరించాలని చూస్తోంది. కంపెనీ ఇప్పటికే ఐఫోన్14, ఐఫోన్ SE, ఐఫోన్13లతో సహా కొన్ని ఫోన్లను భారత్‌లోనే తయారు చేస్తోంది.
ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్‌కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే!
Comments
Please login to add a commentAdd a comment