భారత్‌లో ఐఫోన్‌ల తయారీకి ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు మనదేశంలో ఐఫోన్‌లను తైవాన్‌కు చెందిన కంపెనీలు ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ సంస్థలు తయారు చేసి యాపిల్ సంస్థకు అందించేవి. ఈ తరుణంలో దేశీయ దిగ్గజ సంస్థ టాటా కంపెనీతో ఐఫోన్‌ల తయారీ కోసం యాపిల్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఇందుకోసం బెంగళూరుకు సమీపంలో విస్ట్రోన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో మెజారిటీ వాటా దక్కించుకోవడానికి టాటా సన్స్ సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాలు మరో రెండు నెలల్లో ఓ కొలిక్కి రానున్నాయి. విస్ట్రోన్-టాటా మధ్య ఒప్పందం కుదిరితే మాత్రం.. టాటా సన్స్‌కు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో ఐఫోన్ల తయారీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు యాపిల్‌తో టాటా సంస్థ సంబంధాల్ని బలోపేతం చేసుకుంటుంది. ఇప్పటికే తమిళనాడు హోసూర్ నగర పరిధిలో ఐఫోన్‌లో వినియోగించే విడి భాగాలను టాటా సన్స్ తయారు చేస్తున్నది. ఇటీవలే భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా యాపిల్ స్టోర్లు ప్రారంభిస్తామని, ముంబైలో తొలి యాపిల్ స్టోర్ తెరుస్తామని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment