దేశీయంగా యాపిల్ ఐఫోన్‌లను తయారు చేసేందుకు దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఐఫోన్‌ల తయారీకి టాటా కంపెనీ సంప్రదింపులు కొనసాగిస్తుండగా.. తాజాగా మెటల్ దిగ్గజం వేదాంత సైతం ఐఫోన్‌ల ఉత్పత్తికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గత వారం వేదాంత, తైవాన్‌కు చెందిన ఐఫోన్‌ల సరఫరా సంస్థ ఫాక్స్‌కాన్‌లు సంయుక్తంగా రూ.1.54లక్షల కోట్లతో తొలి సెమీ కండక్టర్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. గుజరాత్‌లో నిర్మించనున్న ఈ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ విషయంలో ఇరు సంస్థల మధ్య ఒప్పొందాలు జరిగాయి. నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి.
ఈ క్రమంలో వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహరాష్ట్రలో మ్యానిఫ్యాక్చరింగ్ హబ్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్లులో ఐఫోన్‌లతో పాటు టీవీలో ఉపయోగించే పరికరాల్ని తయారు చేయనున్నట్లు చెప్పారు. అయితే ఇప్పటికే టాటా గ్రూప్ ఇప్పటికే తైవాన్ సంస్థతో కలిసి ఐఫోన్‌ల తయారు చేయబోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు వేదాంత ఎంటర్ అవ్వడం ఆసక్తికరంగా మారింది.
విస్ట్రాన్‌తో టాటా గ్రూప్
యాపిల్ సంస్థ దేశీయంగా ఐఫోన్‌లను తయారు చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా చైనాలో ఫోన్‌ల తయారీ నిలిపివేయాలని భావిస్తుంది. చైనా నుంచి పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత భారత్‌లో ఐఫోన్ 14 సిరీస్‌లను ఉత్పత్తి చేయాలని అనుకుంటున్నట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో ప్రస్తావించింది.
ఆ కథనాల‍్ని ఊటంకిస్తూ టాటా గ్రూప్ భారత్‌లో ఐఫోన్‌లను తయారు చేసేందుకు ఫాక్స్‌కాన్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఐఫోన్‌ల ఉత్పత్తి, సప్లయ్ చైన్, అసెంబుల్ విషయంలో ఇరు సంస్థలు ఏకాభిప్రాయానికి వస్తే.. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.
టాటాతో జత.. ఐదురెట్ల అవుట్‌పుట్
తైవాన్ హ్యాండెసెట్ తయారీ దిగ్గజ సంస్థలైన విస్ట్రాన్ చైనాలో.. ఫాక్స్‌కాన్ (చెన్నై) భారత్‌లో కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాయి. యాపిల్ సంస్థ ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదర్చుకుని చెన్నై కేంద్రంగా ఐఫోన్‌లను తయారు చేస్తుంది. వాటి అమ్మకాల్ని యాపిల్ నిర్వహిస్తుంది. అదే దేశీయ సంస్థలు ఫోన్‌ల తయారీలో భాగస్వామ్యం సంస్థకు లాభదాయకంగా ఉంటుందని యాపిల్ సీఈవో టిమ్‌కుక్ అభిప్రాయ పడుతున్నారు. టాటా గ్రూప్.. విస్ట్రాన్‌తో భాగస్వామ్యంలో దేశీయంగా ఐఫోన్‌లను ఐదురెట్లు కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయొచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment