అమెరికాకు చెందిన టెక్ కంపెనీ యాపిల్ తన తాజా మోడల్ 'ఐఫోన్ 13' తయారీని భారత్‌లో ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా చొరవ మేరకు ఐఫోన్-13 స్మార్ట్‌ఫోన్లను తయారుచేయాలని యాపిల్ నిర్ణయం తీసుకుంది. సరికొత్త యాడ్-ఆన్ ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్స్ చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఉత్పత్తి కానుంది.
కొద్ది రోజుల క్రితమే ఐఫోన్-12ను భారత్‌లోనే ఉత్పత్తి చేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఇప్పుడు వీటితో పాటుగా యాపిల్ పోర్ట్‌ఫోలియోలోని ఐఫోన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను తయారుచేయాలని యాపిల్ సన్నద్ధమైంది. ఐఫోన్ 13ను భారత్‌లో తయారు చేస్తోన్నందుకు సంతోషంగా ఉన్నామని యాపిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. స్థానిక కస్టమర్స్ కోసం అందమైన డిజైన్, అద్భుతమైన ఫోటోలు, వీడియోల కోసం అధునాతన కెమెరా సిస్టమ్‌లు, A15 బయోనిక్ చిప్‌తో ఐఫోన్-13 తయారు చేస్తామని యాపిల్ పేర్కొంది. కాగా ఐఫోన్-13 సరికొత్త మోడల్ భారత్‌లోనే ఉత్పత్తి అవ్వడం విశేషం.
గణనీయమైన వృద్ధి..!
గత రెండు సంవత్సరాలలో యాపిల్ స్మార్ట్‌ఫోన్స్‌కు భారత్‌లో భారీ డిమాండ్ నెలకొంది. భారత్‌లో ముఖ్యంగా మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు ఉత్పత్తులను అందించే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్స్‌లో ఐఫోన్ అమ్మకాలు భారీగా అమ్ముడయ్యాయి. ఇక భారత్‌లో యాపిల్ ఐఫోన్-13 స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి అవ్వడంతో ఈ ఫోన్ ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఐఫోన్-13 ధరల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా యాపిల్ తన స్మార్ట్‌ఫోన్ల అసెంబ్లీను చైనాలో, సాఫ్ట్‌వేర్ తదితర టెక్నాలజీ ఫీచర్స్‌ను కాలిఫోర్నియాలో తయారుచేస్తుంది.
చదవండి: హెచ్చరిక..! మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయండి..లేకపోతే..!
Comments
Please login to add a commentAdd a comment