Made In India BMW 530i M Sport Carbon Edition Launched: ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ ‘మేడ్ ఇన్ ఇండియా’ చొరవలో భాగంగా కొత్త బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఎమ్ స్పోర్ట్ ‘కర్బన్ ఎడిషన్’ కారును ఆవిష్కరించింది. ఈ కారును చెన్నై ప్లాంట్‌లో బీఎమ్‌డబ్ల్యూ ఉత్పత్తి చేసింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలుదారులు ఈ కారును బుక్ చేసుకోవచ్చును. భారత మార్కెట్‌లో బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ ఎమ్ స్పోర్ట్ కర్బన్ ఎడిషన్ ధర రూ. 66,30,000 (ఎక్స్‌షోరూమ్)గా ఉంది.
చదవండి: హాట్‌కేకుల్లా అమ్ముడైన ఎమ్‌జీ ఆస్టర్..!
కార్ ఫీచర్స్ ..!
కర్బన్ ఎడిషన్ మోడల్ 5 సిరీస్ మోడల్‌లో కిడ్నీ గ్రిల్, ఫ్రంట్ ఆప్రాన్, సైడ్ వ్యూ మిర్రర్స్, రియర్ బూట్ లిడ్ స్పాయిలర్ లాంటివి కర్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. . అంతేకాకుండా 18-అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్ ను అమర్చారు. ఈ కారుకు ఆల్ఫైన్ వైట్ పెయింట్ వర్క్‌ను జోడించారు.
కార్ ఇంటిరీయర్స్ విషయానికి వస్తే...బ్లాక్ డ్యూయల్ టోన్ థీమ్డ్ స్పోర్ట్ సీట్స్‌తో కారు మరింత ఆకర్షణీయంగా నిలవనుంది. 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 16-స్పీకర్, 464-వాట్ హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, 4జోన్ టెంపరేచర్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరాలను కారులో అమర్చారు.
ఇంజిన్ విషయానికి వస్తే..!
బీఎమ్‌డబ్ల్యూ స్టాండర్డ్ 530i ఎమ్ స్పోర్ట్ మోడల్ ఇంజిను కొత్త కార్బన్ ఎడిషన్ వెర్షన్‌లో కూడా అమర్చారు. 1998సీసీ సామర్థ్యంతో ఇన్-లైన్ నాలుగు సిలిండర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీనికి 8-స్పీడ్ స్పోర్ట్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు.ఇంజిన్ 248 బీహెచ్‌పీ వద్ద 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది.
చదవండి: Facebook: ఫేస్‌బుక్ పేరు మార్పు..! కొత్త పేరు ఇదేనా...!
Comments
Please login to add a commentAdd a comment